03/21/2024
చామల కిరణ్ కుమార్ రెడ్డి...తెలంగాణ కాంగ్రెస్ నవతరం యువనాయకుడు.. మీడియా చర్చాగోష్టిల్లో,సామాజిక మాధ్యమాల్లో కాంగ్రెస్ పార్టీ గళాన్ని బలంగా వినిపించే నేత...రాష్ట్ర రాజకీయాలకంటే ముందే జాతీయ రాజకీయాలను ఔపాసన పట్టి రచ్చ గెలిచి ఇంటగెలిచిన కాంగ్రెస్ పార్టీ వీర విధేయుడు..టీపీసీసీ ఉపాధ్యక్షుడిగా, మీడియా ఇంచార్జ్ గా పార్టీ కార్యక్రమాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనే చామల కిరణ్ కుమార్ రెడ్డి తొలిసారి భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్ధమౌతున్నారు. ఆయన రాజకీయ ప్రస్థానంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను ఒక్కసారి పరిశీలిస్తే...
2006 నుంచి 2010 వరకు చామల కిరణ్ కుమార్ రెడ్డి యువజన కాంగ్రెస్ జాతీయ విభాగంలో టాస్క్ ఫోర్స్ సభ్యుడిగా అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యక్ష పర్యవేక్షణలో 6-7 రాష్ట్రాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీగా సమర్థవంతంగా పనిచేసి అధిష్టానం దృష్టిలో పడడమే కాక తన పనితీరుతో వారి మెప్పు పొందారు.
2017 నుంచి పీసీసీ అధ్యక్షుడిగా ఎంపికైన రేవంత్ రెడ్డి గారి కార్యవర్గంలో అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా, నేటివరకు కూడా జాతీయ మరియు స్థానిక మీడియాతో సత్సంబంధాలను కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను,ఎజెండాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఎనలేని కృషిచేసిన నాయకుడా చామల కిరణ్ కుమార్ రెడ్డి.
దశాబ్ద కాలపు బీఆర్ఎస్ దొరహంకార అవినీతి, అక్రమాలపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారథ్యంలో అనేక నిరసన కార్యక్రమాలు,ధర్నాలతో పాటు నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలపై అనేక నిరసన కార్యక్రమాల్లో పోలీసుల లాఠీ దెబ్బలను సైతం తట్టుకొని పోరాడి ప్రజల పక్షాన నిలబడే నాయకుడిగా అనతికాలంలోనే పేరుసంపాదించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.
రాజకీయ చదరంగంలో అవకాశాలు వచ్చినట్టేవచ్చి చేజారిపోతున్నా నిరాశపడకుండా సహనంతో వ్యవహరిస్తూ అంతర్గత ప్రత్యర్థులను సైతం మిత్రులుగా చేసుకొని అందరివాడుగా మారి పార్టీ జెండానే గుండెలనిండా నింపుకున్న నిజమైన కాంగ్రెస్ వాదిగా నిలిచాడు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో తన సొంత నియోజకవర్గం తుంగతుర్తిలో పార్టీ అభ్యర్థి మందుల సామెల్ కు 50000 వేల మెజార్టీతో గెలిపించడంతో పాటు మిగతా నియోజకవర్గాల్లో సైతం అభ్యర్థుల విజయంలో కీలకపాత్ర పోచించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి.