26/04/2022
వైరా శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియ రాములు నాయక్ గారి క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం .
వైరా నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు సంబంధించి వైరా పట్టణం, వైరా మండలం ,కొనిజర్ల మండలం ఏనుకూరు మండలం, జూలూరుపాడు మండలాలకు సంబంధించి 8,72,500/- రూపాయల విలువ గల 34 సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమo వైరా మండల మరియ వైరా పట్టణ అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు , దార్ణ శేఖర్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ శాసనసభ్యులు గౌరవ శ్రీ లావుడియ రాములు నాయక్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైనా ఆరోగ్యపరంగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ఎంతో మంచి ఆలోచనతో ఎంతో కొంత ఆ కుటుంబానికి అండగా ఉండాలనే ఉద్దేశంతో కెసిఆర్ గారు సంకల్పించారు. ,మనం సీఎంఆర్అఫ్ కి అప్లై చేసిన అతి కొద్ది సమయంలోనే ఆ కుటుంబానికి స్థానిక శాసనసభ్యులు క్యాంపు కార్యాలయం నుంచి వారికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ దస్త్రాలు వెంటనే లబ్ధిదారులకు చెక్కులను త్వరగా జారీ చేయడం జరుగుతుంది .కావున రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి ముఖ్యమంత్రిని గెలిపించుకోవాలని ఇలాంటి టిఆర్ఎస్ ప్రభుత్వం మరల రావాలని ఆకాంక్షించారు . అదే విధంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతు బంధు ,దళిత బంధు ,ఆసరా పింఛన్లు , కెసిఆర్ కిడ్స్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ,పేదలకు సన్న బియ్యం , వసతి గృహాలకు సన్న బియ్యం , గ్రామాలు పట్టణాల్లో రోడ్లు ,అన్ని అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ, ఇలాంటి అభివృద్ధి పరుగులు పెట్టాలంటే మరల కెసిఆర్ గారు తప్పకుండా గెలవాలని అలా గెలిస్తే మన వైరా నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగు పెడుతుందని ,రాబోయే రోజులలో ఇంకా అనేక నిధులు తీసుకొని వచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తాం అని గట్టిగా తెలియజేశారు . అభివృద్ధి విషయంలో ముందుకు సాగుతుంది అందుకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలని మనవి చేశారు .ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ మన ఎమ్మెల్యే గారు తన ఆఫీసులో కొంతమంది వ్యక్తులను ప్రత్యేకంగా సీఎంఆర్ఎఫ్ ఫైల్స్ కోసం నియమించుకుని వారి ద్వారా హైదరాబాద్లోని సెక్రటేరియట్లో త్వరగా వచ్చే విధంగా చూస్తున్నారని కొనియాడారు.