11/03/2022
స్థానిక కోదాడ పట్టణం లోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కార్యాలయం వద్ద మద్యం వ్యాపార అక్రమాలపై వినతిపత్రం సమర్పిస్తూ బిజెపి రాష్ట్ర నాయకులు *ఓర్సు.వేలంగి రాజు* ఈ సందర్భంగా మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ పరిధిలోని గల గ్రామాలలో సరైన అనుమతులు లేకుండా ప్రధాన రహదారుల వెంబడి మరియు దేవాలయాల వెంబడి మద్యం దుకాణాలు ప్రభుత్వ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం దుకాణాలు పెట్టి, అనేక ప్రమాదాలకు మరియు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేస్తూ, మద్యం అమ్మకందారులు వైన్ షాపుల యాజమాన్యం వారు సిండికేట్ అయ్యి బెల్టుషాపులను నిర్వహిస్తూ, ప్రజల వద్ద అధిక ధరలను వసూలు చేస్తూ, ప్రజల యొక్క నడ్డి విరుస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రజాప్రతినిధులు యొక్క కనుసన్నలలో మద్యం వ్యాపారం ఏరులై పారుతుంది , టిఆర్ఎస్ ప్రభుత్వం మద్యం అమ్మకాలను మరియు మాదకద్రవ్యాలను ప్రోత్సహిస్తూ ప్రజలను మద్యానికి బానిసలను చేస్తుందని మరియు ప్రజల ఆరోగ్యాలను పాడుచేస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తూ అమాయక ప్రజలను వీధిన పడే విధంగా చేస్తూ వారి యొక్క ఉసురు కొట్టుకుంటుంది అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారి యొక్క ప్రోత్సాహంతోనే ,పర్యవేక్షణ లోపం వలన వారి నిర్లక్ష్యానికి కారణమై అనేక అవినీతి అక్రమాలకు నిలయంగా మారిందని అన్నారు . . భవిష్యత్తులో ఇలాంటి అన్యాయ అక్రమాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించి పెద్ద ఎత్తున ఉద్యమానికి పిలుపునిస్తామని అని తెలియజేశారు.