బండారి శేఖర్ అన్న సైన్యం

  • Home
  • బండారి శేఖర్ అన్న సైన్యం

బండారి శేఖర్ అన్న సైన్యం Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from బండారి శేఖర్ అన్న సైన్యం, Political organisation, .

- ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఫైర్ నిబంధనలు పాటించకున్న  NOC లు-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:- ⁠ఫైర్ నిబంధనలు ప్రకారం ఏ కాలే...
14/08/2026

- ఇంటర్, డిగ్రీ కాలేజీలు ఫైర్ నిబంధనలు పాటించకున్న NOC లు-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:
- ⁠ఫైర్ నిబంధనలు ప్రకారం ఏ కాలేజీలకు ఉన్నాయో ఫైర్ అధికారి బయటపెట్టాలి.
- ⁠ఫైర్ అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారి ఆస్తులపై నిఘా పెట్టాలి.
— ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
- *కరీంనగర్ DIEO కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.*
- ⁠కరీంనగర్ DIEO కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి గడిచిన 9 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారి "వసూల్ రాజా"గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
- ⁠*ఫైర్ ఆఫీసర్, DIEOలకు డబ్బులిస్తే చాలు.. ప్రైవేట్ కాలేజీల్లో నామమాత్రపు తనిఖీలతో NOCలు.*
- ⁠*వసూళ్ల పర్వానికి తెరలేపిన అధికారులపై ACBకి ఫిర్యాదు చేస్తాం.*

ఇట్లు...
బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్.

- *కాలేజీలు ఫైర్ నిబంధనలు పాటించకున్న  NOC లు-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:*- ⁠*ఫైర్ నిబంధనలు ప్రకారం ఏ కాలేజీలకు ఉన్నా...
13/08/2026

- *కాలేజీలు ఫైర్ నిబంధనలు పాటించకున్న NOC లు-విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం:*
- ⁠*ఫైర్ నిబంధనలు ప్రకారం ఏ కాలేజీలకు ఉన్నాయో బయటపెట్టాలి.*
- ⁠*ఫైర్ అవినీతి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి, వారి ఆస్తులపై నిఘా పెట్టాలి.*
— ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్
- *కరీంనగర్ DIEO కార్యాలయం అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది.*
- ⁠*ఫైర్ ఆఫీసర్, DIEOలకు డబ్బులిస్తే చాలు.. ప్రైవేట్ కాలేజీల్లో నామమాత్రపు తనిఖీలతో NOCలు.*
- ⁠*వసూళ్ల పర్వానికి తెరలేపిన అధికారులపై ACBకి ఫిర్యాదు చేస్తాం.*
- ⁠కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని ప్రైవేటు, కార్పొరేట్ ఇంటర్ మరియు డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల ప్రాణాలతో కాలేజ్ మేనేజ్‌మెంట్లు, విద్యాశాఖ, ఫైర్ అధికారులు చెలగాటమాడుతున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తనిఖీల పేరుతో ఫైర్ అధికారి, డీఈఓ మరియు యూనివర్సిటీ అధికారులు కాసుల వేట మొదలుపెడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వసతులు లేకున్నా, ఫైర్ సేఫ్టీ నిబంధనలను లేకున్నా ముడుపులు తీసుకుంటూ "అంతా సవ్యంగా ఉందంటూ" ప్రైవేట్ కాలేజీలకు అక్రమంగా ఫైర్ NOCలు, ఇతర సర్టిపికెట్లు కట్టబెడుతున్నారని మండిపడ్డారు. ఒక్క భవనం కోసం ఫైర్ సర్టిపికెట్ కావాలని దరఖాస్తూ పెట్టితే కనీసం తనిఖీలు చేయకుండానే డబ్బులు తీసుకొని ఫైర్ అధికారి ఎన్ వోసి లు ఇస్తున్నారని మండిపడ్డారు.
నామమాత్రపు తనిఖీలు – వెలుగులోకి వచ్చిన అక్రమాలు:
రాష్ట్రంలో ఈ ఏడాది 1,400 ప్రైవేటు కాలేజీలు అఫిలియేషన్ కోసం దరఖాస్తు చేసుకోగా, మార్చి, ఏప్రిల్ నెలల్లో DIEOలు చేపట్టిన ఫిజికల్ వెరిఫికేషన్ నివేదికలను ఇంటర్ బోర్డు సెక్రటరీ అభిలాష అభినయ్ నేతృత్వంలో పరిశీలించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయని తెలిపారు.
ఖాళీ గదులను ల్యాబ్‌లుగా, లైబ్రరీలుగా చూపిస్తూ తప్పుడు నివేదికలు ఇచ్చారు.
కనీసం మరుగుదొడ్లు లేని కాలేజీలకు కూడా అధికారులు క్లీన్ చిట్ ఇవ్వడం ఘోరం.
మే నాటికే పూర్తికావాల్సిన అఫిలియేషన్ ప్రక్రియ, అధికారుల అవినీతి వల్లే ఆగస్టు వచ్చినా కొలిక్కి రాలేదు.

ఫైర్ సర్వీసెస్ అధికారి, DIEO ఆఫీసులోని ఓ వ్యక్తి కలిసి ఒక్కో కాలేజీ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తూ ఫైర్ NOC లు, ఇతర సర్టిపికెట్లు ఇప్పిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ DIEO కార్యాలయంలో పనిచేస్తున్న ఒక అధికారి గడిచిన 9 ఏళ్లుగా అక్కడే తిష్టవేసి, అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా మారి "వసూల్ రాజా"గా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
విద్యార్థుల భవిష్యత్తుతో, ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఫైర్ ఆఫీసర్, DIEO ఆఫీస్ అధికారులపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ (ACB)కి ఆధారాలతో సహా ఫిర్యాదు చేయనున్నట్లు బండారి శేఖర్ స్పష్టం చేశారు.

ఇట్లు...
బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్.

దళితుల అసైన్డ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి, NHRC కలెక్టర్ కు అదేశాలు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర...
29/07/2026

దళితుల అసైన్డ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి, NHRC కలెక్టర్ కు అదేశాలు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 574లో పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన దాదాపు 15 ఎకరాల పైగా అసైన్డ్ భూమిని 'జ్యోతిష్మతి విద్యాసంస్థలు' (శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్) అధినేత జె. సాగర్ రావు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు.

దళితుల అసైన్డ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి – NHRC కలెక్టర్‌కు ఆదేశాలుNHRC ఆదేశాలపై సమగ్ర నివేదిక పంపాలి – ఆల్ ఇండ...
28/07/2026

దళితుల అసైన్డ్ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలి – NHRC కలెక్టర్‌కు ఆదేశాలు

NHRC ఆదేశాలపై సమగ్ర నివేదిక పంపాలి – ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామంలోని సర్వే నంబర్ 574లో పేద ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించిన దాదాపు 15 ఎకరాలకు పైగా అసైన్డ్ భూమిని ‘జ్యోతిష్మతి విద్యాసంస్థలు’ (శాలిని ఎడ్యుకేషనల్ ట్రస్ట్) అధినేత జె. సాగర్ రావు చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్నారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ ఆరోపించారు.

ఈ ఆక్రమణలు, అనధికార నిర్మాణాలపై 2007లోనే అప్పటి తహసీల్దార్ నుంచి హైకోర్టు వరకు భూములను స్వాధీనం చేసుకోవాలని స్పష్టమైన తీర్పులు వచ్చినప్పటికీ, రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటివరకు ఆ భూములను రికవరీ చేయలేకపోయారని ఆయన మండిపడ్డారు.

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) జోక్యం

ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు, కబ్జాలపై బండారి శేఖర్ **08-12-2025న జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC)**కు సమగ్ర ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదుపై విచారణ జరిపిన NHRC కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు ప్రతిని ఆన్‌లైన్ ద్వారా **కరీంనగర్ జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)**కు పంపి, తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

4 వారాల్లోగా నివేదిక సమర్పణ

సదరు భూమి ఆక్రమణపై చేపట్టిన చర్యల నివేదికను (Action Taken Report) ఆంగ్లంలోకి అనువదించి, నాలుగు వారాల్లోగా కమిషన్‌కు సమర్పించాలని తెలంగాణ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి, దళితుల అసైన్డ్ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని, బాధిత పేదలకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా బండారి శేఖర్ డిమాండ్ చేశారు.

ఇట్లు,
బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కరీంనగర్ జిల్లా

- మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి.- చెరువు శిఖం భూమిని రోడ్డుగా చూపిస్తే, పె...
26/07/2026

- మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి.
- చెరువు శిఖం భూమిని రోడ్డుగా చూపిస్తే, పెద్ద పెద్ద భవనాలకు నిర్మాణ అనుమతులు ఎలా ఇస్తారు?
- ⁠పనులు జరుగుతున్న వాటివి నిర్మాణాలను నిలిపివేయండి
- ⁠ఎన్‌వోసీ (NOC) లేకుండా అసలు నిర్మాణం అనుమతులు ఎలా మంజూరు చేశారో సమాధానం చెప్పాలి.
టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ బండారి శేఖర్ క్షేత్రస్థాయిలో పరిశీలన అధికారులపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రశ్నించారు.

24న విద్యాసంస్థల బంద్ కు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు.నిట్ పేపర్ లికేజీపై ఢిల్లీలో  ...
23/07/2026

24న విద్యాసంస్థల బంద్ కు అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కమిటీ సంపూర్ణ మద్దతు.
నిట్ పేపర్ లికేజీపై ఢిల్లీలో పోరాడుతున్న విద్యార్థులపై జరిగిన లాఠీఛార్జిలకు నిరసనగా ఈ నెల 24న విద్యార్ధి,యువజన సంఘాలు విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చాయి.
AIFB కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ సంపూర్ణ మద్దతు తెలియజేసారు.

- అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఉంటేనే ప్రయివేట్ ఆసుపత్రులకు  'ఫైర్ NOC' అనుమతి  మరియు రెన్యూవల్ చేయాలి!- ⁠కరీంనగర్ జిల్లా ...
22/07/2026

- అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు ఉంటేనే ప్రయివేట్ ఆసుపత్రులకు 'ఫైర్ NOC' అనుమతి మరియు రెన్యూవల్ చేయాలి!
- ⁠కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డికి AIFB వినతిపత్రం.
- ⁠నిబంధనల ప్రకారం ఉంటేనే అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చిన జిల్లా అగ్నిమాపక అధికారి

కరీంనగర్ నగర పరిధిలోని ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యాసాంస్థలు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పూర్తిస్థాయి అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు (Fire Safety Norms) ఉంటేనే 'ఫైర్ NOC' (No Objection Certificate) మంజూరు లేదా నవీకరణ (Renewal) చేయాలని అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్రంగా డిమాండ్ చేశారు.
నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) మరియు తెలంగాణ అగ్నిమాపక చట్టం ప్రకారం అవసరమైన ఫైర్ స్ప్రింక్లర్లు, అలారాలు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు, వెడల్పాటి అత్యవసర ద్వారాలు ఉన్న భవనాలకు మాత్రమే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు కరీంనగర్ జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి గారికి కలిసి వినతిపత్రం అందజేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి గారు — ప్రైవేట్ సంస్థల్లో భద్రతా ప్రమాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, ఫైర్ నిబంధనలకు లోబడి ఉంటేనే రెన్యూవల్స్ మరియు కొత్త అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరంలో వెలిసిన అనేక ప్రైవేట్ ఆసుపత్రులు, పాఠశాలలు మరియు కళాశాలలు కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను గాలికి వదిలేశాయని విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇరుకైన భవనాల్లో, అత్యవసర ద్వారాలు (Emergency Exits) కూడా లేకుండానే వ్యాపారాత్మకంగా పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి భవనాల్లో వైద్యం కోసం వచ్చే పసిపిల్లలు, రోగుల ప్రాణాలకు మరియు చదువుకునే వేలాది మంది విద్యార్థుల జీవితాలకు తీవ్రమైన ముప్పు పొంచి ఉందన్నారు. గతంలో నిబంధనలను సరిగ్గా పరిశీలించకుండానే కొన్ని సంస్థలకు 'ఫైర్ NOC'లు మంజూరు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. ప్రస్తుతం ఈ సర్టిఫికెట్ల రెన్యూవల్ ప్రక్రియ జరుగుతున్న తరుణంలో భవనాలను అధికారులు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని డిమాండ్ చేశారు.భద్రతా ప్రమాణాలు లేని భవనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ NOC మంజూరు చేయకూడదు. నిబంధనలు ఉల్లంఘించిన ఆసుపత్రులు, విద్యాసంస్థలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

"భవిష్యత్తులో అగ్ని ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు పోకుండా ముందస్తుగా అడ్డుకోవాల్సిన బాధ్యత అగ్నిమాపక శాఖపై ఎంతైనా ఉంది. అధికారి ఇచ్చిన హామీ మేరకు నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న భవనాలకు అనుమతులు మంజూరు చేస్తే ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం 'అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్' పార్టీ ఆధ్వర్యంలో బాధితులు మరియు ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేపడతాం" అని హెచ్చరించారు.
ఇట్లు,
(బండారి శేఖర్)
ప్రధాన కార్యదర్శి,
అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB),
కరీంనగర్ జిల్లా.

తేదీ: 13-07-2026- సన్‌షైన్ హాస్పిటల్‌ను తక్షణమే సీజ్ చేయాలి:- ⁠ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్ - కలెక్టరేట్‌లో ‘ప్రజ...
13/07/2026

తేదీ: 13-07-2026
- సన్‌షైన్ హాస్పిటల్‌ను తక్షణమే సీజ్ చేయాలి:
- ⁠ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ డిమాండ్
- కలెక్టరేట్‌లో ‘ప్రజావాణి’ ద్వారా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన AIFB బండారి శేఖర్, బద్రి నేత రాజిరెడ్డి, కిరణ్ కుమార్ బృందం
- NDPS చట్టాల ఉల్లంఘన, ఫైర్ సేఫ్టీ లోపాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆగ్రహం.
- 10 రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్‌కు ఆదేశించిన జిల్లా కలెక్టర్
నగరంలోని సన్‌షైన్ హాస్పిటల్స్ నిర్వహణలో తీవ్రమైన చట్టపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సదరు ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌కు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తరఫున ఆయన అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు.
ఈ సందర్భంగా బండారి శేఖర్ మాట్లాడుతూ.. సన్‌షైన్ హాస్పిటల్స్‌లో నార్కోటిక్ డ్రగ్స్ & సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టాలను బహీరంగా ఉల్లంఘిస్తున్నట్లు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అధికారిక నివేదికలో తేలిందని పేర్కొన్నారు. Drugs and Cosmetics Act, 1940 ప్రకారం బాధ్యులపై వెంటనే FIR నమోదు చేసి క్రిమినల్ చర్యలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ నిబంధనల ప్రకారం ఆసుపత్రి రిజిస్ట్రేషన్‌ను, ఫార్మసీ లైసెన్స్‌ను తక్షణమే రద్దు చేయాలన్నారు. అలాగే, తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్‌కు అధికారిక ఫిర్యాదు పంపి, ఇందుకు కారణమైన సంబంధిత వైద్యులపై కఠిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ చొరవ చూపాలని కోరారు. "అత్యవసర వైద్య సేవలు అందించే ఆసుపత్రిలో కనీస ఫైర్ సేఫ్టీ (అగ్నిమాపక) ప్రమాణాలు లేవని అధికారులు గుర్తించినా.. కేవలం ఒక లక్ష రూపాయల ఫైన్ వేసి వదిలివేయడం దారుణం. అధికారులకు అన్నీ తెలిసినా మౌనంగా ఉండటం వెనుక ఉన్న అంతర్యమేమిటి? ప్రశ్నించారు. ఇలాంటి లోపాలు కొనసాగడం ప్రజల ప్రాణాలకు తీవ్ర ముప్పు అని అన్నారు."
ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తున్న సన్‌షైన్ హాస్పిటల్‌లో ఆరోగ్యశ్రీతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య సంబంధిత పథకాల (EHS) అనుబంధాన్ని (Empanelment) రద్దు చేయాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండాలంటే కఠినమైన చట్టపరమైన చర్యలే తీసుకోవాలని డిమాండ్ చేశారు .
*10 రోజుల్లో విచారణకు కలెక్టర్ ఆదేశం:*
ఈ ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్.. కరీంనగర్ అదనపు కలెక్టర్ డా. అశ్విని తానాజీ వాకడే (ఐఏఎస్) గారితో సన్‌షైన్ హాస్పిటల్స్‌పై సమగ్ర విచారణ జరిపిస్తామని, 10 రోజుల్లోగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని బండారి శేఖర్ వెల్లడించారు.
ఈ కార్యక్రంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బద్రి నేత నాయకులు రాజిరెడ్డి, కిరణ్ పాల్గొన్నారు.

ధన్యవాదములతో,
ఇట్లు,
(బండారి శేఖర్)
జిల్లా ప్రధాన కార్యదర్శి,
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB),
కరీంనగర్.

https://youtu.be/Xj3dSNM5U1g?si=wiFFP8WrHEF5NIeE- సన్‌షైన్ హాస్పిటల్స్ అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.- సన్‌షైన...
09/07/2026

https://youtu.be/Xj3dSNM5U1g?si=wiFFP8WrHEF5NIeE

- సన్‌షైన్ హాస్పిటల్స్ అక్రమాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి.
- సన్‌షైన్ ఆసుపత్రిని తక్షణమే సీజ్ చేయాలి.* ⁠
- డ్రగ్స్ నియంత్రణ శాఖ నివేదిక ఇచ్చినా చర్యలేవీ ?
- వైద్యుల లైసెన్సులు రద్దు చేయాలి.
- ⁠అల్ ఇండియా పార్వర్డ్ బ్లాక్ ⁠జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్

ఇట్లు,
(బండారి శేఖర్)
AIFB జిల్లా ప్రధాన కార్యదర్శి,
కరీంనగర్.

కరీంనగర్ సన్‌షైన్ హాస్పిటల్‌ను తక్షణమే సీజ్ చేసి గుర్తింపును రద్దు ...

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when బండారి శేఖర్ అన్న సైన్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share