09/02/2026
*బొబ్బిలి నియోజకవర్గం*
*తేదీ 09-02-2026*
*బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులను కలిసిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు మరియు శ్రీ గిరడ అప్పలస్వామి గారు..*
*ప్రభుత్వం తరుపున మౌళిక సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారు..*
బొబ్బిలి మండలంలో ఉన్న కృపావలస, రమణవలస, దీవెనవలస గ్రామాల గిరిజనులు తమకు ప్రభుత్వం వారు మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరుతూ గత నెలలో గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వినూత్నంగా అభ్యర్థించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు శ్రీ *ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు (బేబీ నాయన)* గారు దృష్టిలో ఆయా గ్రామాల సమస్యలు ఉన్నప్పటికీ, వాటి పరిష్కారానికి గిరిజనులు తమవంతుగా ప్రయత్నం చేశారు.
ఈరోజు ఉదయం గౌరవ *ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన* గారు మరియు బొబ్బిలి నియోజకవర్గ జనసేన ఇంచార్జ్ శ్రీ *గిరడ అప్పలస్వామి* గారుతో కలిసి ఆ గ్రామాలకు వెళ్లి, గిరిజనులతో మాట్లాడి వారి సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు.. *ఎమ్మెల్యే గారు తమవెంట రెవిన్యూ అధికారులను తీసుకువెళ్లి*, వారికి ప్రభుత్వం తరపున చేయదగిన ఏర్పాట్లను గురించి చర్చించారు.. తక్షణమే ఆ ప్రాంతాన్ని సర్వే చేసి, రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టేవిధంగా చూడాలని ఆదేశించారు. గిరిజనులు అటవీ భూములను చదును చేసి వ్యవసాయం చేస్తూ, జీవనం సాగిస్తున్న నేపథ్యంలో వారికి *కొన్ని సదుపాయాలను ప్రభుత్వం తరుపున కల్పించడంలో ఉన్న సవాళ్లను పరిష్కరించే విధంగా* చూడాలని అధికారులను కోరారు.. ప్రభుత్వం ద్వారా ఆ సమస్యలు పరిష్కారం అయ్యేలోగా, *తన సొంత నిధులతో సోలార్ పవర్ ద్వారా విద్యుత్ సౌకర్యం* ఏర్పాటు చేస్తానని, అలాగే *బోరు తీయించి త్రాగునీటి సౌకర్యం కూడా కల్పిస్తానని* తెలిపారు. ICDS PO గారుతో మాట్లాడి గిరిజనుల పిల్లలకు అంగన్వాడీ తరుపున కల్పించాల్సిన సదుపాయాలను కూడా ఏర్పాటు చేయాలని సూచించారు.
కొందరు *గిరిజనులు మక్కువ మండలం నుంచి, సాలూరు మండలం నుంచి వచ్చి స్థిరపడినందున* వారిని దగ్గరలో ఉన్న పంచాయితీలో విలీనం చేసేందుకు గల అవకాశాలను పరిశీలించమని అధికారులకు తెలిపారు.. దానివలన వారికి *రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్* వంటివి ఇవ్వడానికి వీలవుతుందని తెలియజేశారు.. ఎల్లుండు నుంచి ప్రారంభం అవుతున్న *అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్యను గురించి ప్రభుత్వం దృష్టికి* తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తానని తెలిపారు.. జనసేన ఇంచార్జ్ శ్రీ *గిరడ అప్పలస్వామి గారు సహకారంతో* ఆ గ్రామాల గిరిజనులకు అన్ని సదుపాయాలను త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.. *తాను మరియు అప్పలస్వామి గారు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని*, వారికి ఎప్పడు ఎలాంటి సహాయం కావాలన్నా తమకు తెలియజేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, బొబ్బిలి నియోజకవర్గ జనసేన నాయకులు, అధికారులు పాల్గొన్నారు.