TDP Cheepurupalli

  • Home
  • TDP Cheepurupalli

TDP Cheepurupalli తెలుగుదేశం ప్రజలకోసం

02.05.2024చీపురుపల్లి నియోజకవర్గం.*శ్రీ నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణాంధ్ర సాకార యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న-- కూటమి ఎంప...
02/05/2024

02.05.2024
చీపురుపల్లి నియోజకవర్గం.

*శ్రీ నందమూరి బాలకృష్ణ గారి
స్వర్ణాంధ్ర సాకార యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న-- కూటమి ఎంపీ అభ్యర్థి
కలిశెట్టి అప్పలనాయుడు గారు..

చీపురుపల్లి పట్టణంలో NDA కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కిమిడి కళా వెంకటరావు గారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ నందమూరి బాలకృష్ణ గారి స్వర్ణాంధ్ర సాకార యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న NDA కూటమి విజయనగరం పార్లమెంట్ లోక్ సభ
అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారు...

ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున గారు,మాజీ ప్రభుత్వ విప్ గద్దె బాబురావు గారు,చీపురుపల్లి నియోజకవర్గ మాజీ ఇంచార్జ్, నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త కుచ్చర్లపాటి త్రిమూర్తులు రాజు గారు మరియు నియోజకవర్గ ముఖ్య నాయుకులు పాల్గున్నారు..

02/05/2024

*01-05.2024
*చీపురుపల్లి నియోజకవర్గం*
*చీపురుపల్లి మండలం*

చీపురుపల్లి టౌన్ లో పాత గవిడి వీధి, కూరాకుల వీధి మరియు చిలుకూరి వీధి రుంకానా వీధిఎన్నికల ప్రచారంలో భాగంగా డోర్ టు డోర్ క్యాంపెనింగ్ లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి *కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* గారు
ఇంటింటికి సూపర్ సిక్స్ పథకాలను వివరించి ప్రతి ఇంటికి ఈ పథకాలను చేర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పడం జరిగింది.

అంతేకాకుండా ఆయా పరిసరాలలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుని టిడిపి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.

ప్రతి కార్యకర్తకు భరోసానిస్తూ మీకు నేను తోడుగా ఉంటానని చెప్పడం జరిగింది.

అలాగే మన అభ్యర్థి *బ్యాలెట్ నమూనా నెంబర్ 2* అందరు సైకిల్ గుర్తు పై ఓటు వేసి గెలిపించామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు,మహిళలు మరియు యువత పాల్గొన్నారు.

మొన్న ఎప్పుడో చెప్పునిన్న రాయి విసిరారు అంటే అర్ధం కాలేదా నిన్ను జనంలోకి రావొద్దు అంటున్నారు....నీ పనైపోయింది జగన్ అంటున...
14/04/2024

మొన్న ఎప్పుడో చెప్పు
నిన్న రాయి విసిరారు అంటే
అర్ధం కాలేదా నిన్ను జనంలోకి రావొద్దు
అంటున్నారు....
నీ పనైపోయింది జగన్ అంటున్నారు

I have reached 5.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉
24/11/2023

I have reached 5.5K followers! Thank you for your continued support. I could not have done it without each of you. 🙏🤗🎉

19/08/2023

ఘనంగా చీపురుపల్లి నియోజకవర్గం ఇన్చార్జి కిమిడి నాగార్జున గారి జన్మదిన వేడుకలు....
పాల్గొన్న నాలుగు మండలాల నాయకులు కార్యకర్తలు....

11/10/2022

అమరావతిలో రాజధాని, విశాఖ మరియు ఉత్తరాంధ్రవాసుల అవకాశాలను దెబ్బతీస్తుందా? 🤔🤔🤔

విశాఖ, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి, ఈశాన్యాన ఉన్న ఒక ప్రకృతి వరం.
ఎలమంచిలి ,పరవాడ, నుంచి భీమిలి వరకు విస్తరించి ఉన్న ఒక సుందర నగరం.
ఆంధ్ర రాష్ట్రానికే, ఆర్థిక రాజధానిగా బాసిల్లుతున్న నగరం.

దక్షిణాన పరవాడ నుంచి అచ్యుతాపురం వరకు,
వందల కొద్ది విస్తరించి ఉన్న ఫార్మా కంపెనీలు,
మెడ్ టెక్ జోన్లు, బ్రాండిక్స్ వగైరా కంపెనీలు,
దానికి ముందే ఉన్న ఎన్టిపిసి సింహాద్రి పవర్ ప్లాంట్,
అచ్చుతాపురానికి ఉత్తరాన ఉన్న, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు స్టీల్ ప్లాంట్,
దానికి అనుకునే ఉన్న గంగవరం పోర్టు,
ఆ తర్వాత, విశాఖపట్నం పోర్టు, షిప్పియార్డు, డాక్ యార్డ్,
జింకు, బిహెచ్పివి, బీహెచ్ఈఎల్,

ఇవన్నీ కాకుండా ఈస్టర్న్ నావెల్ బేస్, విశాఖ కే ఒక వెన్నెముక.

విశాఖ మధ్యలో మకుటాయమానంగా శోబిల్లుతున్న ఆంధ్ర యూనివర్సిటీ. ఎందరో ప్రతిభావంతులను దేశానికి అందించిన విద్యామతల్లి.

పడమర దిక్కున కొలువైన సింహాచల
నృసింహ క్షేత్రం, ఉత్తరాంధ్ర ఇలవేల్పు.
టూరిజానికి హంగులద్ధిన, ఋషికొండ, తోట్లకొండ, బావికొండ, కైలాసగిరి కొండ, సొగసులు చూడ తరమా?

విశాఖ కే మణిహారం లా ఉండే బీచ్ రోడ్డు, యారాడ బీచ్ నుండి మొదలు, ఆర్కే బీచ్, ఊడా పార్కు ,అప్పూఘర్, తెన్నేటి పార్కు ,సాగర్ నగర్ లు, మరియు ఋషికొండ బీములిబీచ్లు విశాఖ టూరిజానికి వన్నె తెచ్చేవే కదా!

కొండలపై నెలకొన్న మిలీనియం టవరు మరియు ఇతర సాఫ్ట్వేర్ కంపెనీలు, మరియు రావడానికి సిద్ధంగా ఉన్న అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు, డాటా సెంటర్లు, ఆంధ్రాలో, సాఫ్ట్వేర్ చదువుకున్న విద్యార్థులకు ఏకైక డెస్టినేషన్ ముందు ముందు విశాఖపట్నమే కదా?

రామానాయుడు ఫిలిం సిటీ, మరియు ఇతర సినీ పరిశ్రమకు కావలసిన హంగులు అన్నీ ఇక్కడే కదా కొలువై ఉన్నాయి. నటీనట సాంకేతిక వర్గం అంతా ఇక్కడి వారే అయ్యుండి, వారికి సరైన మార్గదర్శకం లేకనే కదా ముందడుగు పడటం లేదు.

ఈ కారిడారంతా కలుపుతూ, భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం గావించినట్లయితే ఎంత సర్వీస్ ఇండస్ట్రీ డెవలప్ అవుతుంది.

విశాఖ నుండి కాకినాడ తీరం వరకు విస్తరించే పెట్రో కెమికల్ కారిడార్లు, ఎంత ఉద్యోగాల సృష్టి కల్పిస్తుంది.

భాజపా వారు దయ తలిస్తే, వచ్చే రైల్వే జోన్ వల్ల ఎన్ని అవకాశాలు వస్తాయి...

ఇవి కాక ఎన్నెన్నో యూనివర్సిటీలు, హాస్పిటల్స్ కలిగిన విశాఖ దేనిలో వెనకబడింది🤔🤔🤔


‌‌ ఏమీ లేని పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, మధ్య వెలసిన అమరావతి అనబడే రాజధానిని చూసి,
"విశాఖ" అసూయ పడుతోందా?

అందరి ఆమోదంతో అందరికీ అందుబాటులో రాష్ట్రానికి మధ్యలో, 8 సంవత్సరాల క్రితం ఏర్పడిన రాజధానిని, నాయకులు రేపే ప్రాంతీయ విద్వేషాలతో, రాజధానిని విశాఖకు తరలించకపోతే మేమెంతో వెనుకబడి పోతాం అనే సెంటిమెంటు మాటల ప్రయోగంతో ,
మూడు ముక్కలాటకు వంత పాడటం సబబేనా?

గుండెల మీద చేయి వేసుకుని చెప్పండి ఎవరైనా, మధ్య కోస్తా ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమ అయినా, లేక ఉద్యోగం కల్పన ఐనా ఇదివరలో జరిగిందా?

అందరి ఆమోదయోగ్యంతో పెట్టబడిన రాజధానిలో, నాలుగు ప్రైవేటు యూనివర్సిటీలు, అది మేము ఇచ్చిన భూములలో ఏర్పాటు చేయడం , దానివల్ల మేమేమైనా ఎత్తుకుపోతామా?
రాష్ట్రంలోని పిల్లలకు, పక్క రాష్ట్రాలకు పోకుండా మెరుగైన విద్య అందుతుందనే కదా!

మా దగ్గర సేకరించిన భూములు కొంత తక్కువ రేట్లో ఇచ్చి,నాలుగు ప్రైవేట్ స్పెషలైజేడ్ హాస్పిటల్స్ కడతామంటే ఇక్కడ అందరికీ అందుబాటులో ఉంటుందనే కదా? బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ , అమెరికన్ హాస్పిటల్ ,బి ఆర్ శెట్టి హాస్పిటల్స్ లాంటివి ,నాలుగు వస్తే అందరికీ హైదరాబాదు పరిగెత్తే పని లేకుండా అందుబాటులో ఉంటాయి అనే కదా!

వీటికి తోడు రాజధాని లో, సర్వీస్ సెక్టార్ లాగా కొన్ని ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, మరియు సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తే, రాజధాని లో కూడా కొంత సివిక్ లైఫ్ పెరిగి ఆదాయ మార్గాలు వస్తాయనే కదా!

ప్రజాధనం వృధా కాకుండా, మరి యొక ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగితే రాష్ట్ర ప్రజలకే కదా ఆదాయ మార్గాలు పెరిగేది.

అమరావతిలో జరిగే ఈపాటి గ్రోత్, విశాఖకు ఏ విధంగా నష్టం కలిగిస్తుంది, విశాఖ గ్రోత్ కి
అమరావతి అభివృద్ధికి సంబంధం ఏముంది.

కాబట్టి ఆంధ్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే, ఏది ఎక్కడ ఉంటే సమాజానికి ఉపయోగకరంగా ఉంటుందో, అది అలా జరిగినప్పుడే భావితరాల భవిష్యత్తు ఆనందదాయకంగా ఉంటుంది.

ఈ మూడు ముక్కలాట ఆడే వారి ప్రలోభాలకు గురై ఆంధ్ర రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేయకండి.🙏

09/10/2022

నీటిలో తేలియాడే మార్కెట్లతో
మన రాష్ట్రాన్ని థాయిలాండ్ కి
పోటీ ఇచ్చే స్థితికి తెచ్చిన ఘనత
తుగ్లక్ రెడ్డిది...

07/10/2022

మహారాజుల ఔన్నత్యం దశదిశలా కనపడేలా ఉండే ప్రతీ దానిని మార్చడమే పనిగా పెట్టుకున్నట్లున్నారు.

మూడు లాంతర్లు కూల్చేశారు
గంటస్థంభం మార్చేశారు
ఇప్పుడు "మహారాజా" పేరు తీసేశారు.

జనం వీళ్లను మార్చే రోజులు దగ్గర పడ్డాయి.

02/07/2022

చంద్రమండలానికైనా ఈజీగా వెళ్ళొచ్చేమో కానీ జగనన్న ఊరికి వెళ్లడం అంత వీజీ కాదు

24/02/2022

విశాఖ కోర్టుకు హాజరైన నారా లోకేశ్

సాక్షి సహా మూడు మీడియా సంస్థలపై కేసు పెట్టా

దీ వీక్ క్షమాపణలు కోరింది.. సాక్షి, దక్కన్ క్రానికల్ వివరణ కూడా ఇవ్వలేదు

వివేక హత్య తర్వాత చంద్రబాబుపై సాక్షి మీడియా దుష్ప్రచారం

మాపై అసత్య కథనాలు ప్రచురించారు.మొదటి నుంచీ సాక్షి మీడియా నాపై దుష్ప్రచారం చేస్తోంది

వ్యక్తిగత జీవితంపై కూడా సాక్షి మీడియా బురద జల్లింది

నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం సాక్షి మీడియా చేసింది

నేను వేటికి భయపడను.. తప్పుడు వార్తలు రాస్తే చట్టప్రకారం ముందుకు వెళ్తా

టీడీపీ కోసం ప్రత్యేక ఐపీసీ సెక్షన్‍ను వైసీపీ పెట్టింది

ఇప్పుడు నాపై మర్డర్ కేసు సహా 13 కేసులు పెట్టారు

ప్రజల తరపున పోరాడుతున్నందుకే మాపై దొంగ కేసులు

నా తల్లిపై అసెంబ్లీ సాక్షిగా దారుణంగా మాట్లాడారు. విజయలక్ష్మి, భారతి, వారి పిల్లల గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి

మా సంస్కృతి అది కాదు.. ఓ తల్లి ఎలా బాధపడుతుందో కొడుకుగా చూశా

నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టను Nara Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్

Address


534406

Telephone

+13473355490

Website

Alerts

Be the first to know and let us send you an email when TDP Cheepurupalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to TDP Cheepurupalli:

Shortcuts

  • Want your organization to be the top-listed Government Service?

Share