02/09/2026
#అసలు_ఎవరీ_సజ్జల_రామకృష్ణారెడ్డి 🟥🇱🇸
నిన్నటి విజయసాయి రెడ్డి బహిరంగ లేఖలో.. వైసీపీ పార్టీని పూర్తిగా control చేస్తుంది సజ్జల రామక్రిష్ణ రెడ్డే అని, జగన్ రెడ్డి కేవలం సజ్జల రామక్రిష్ణ చేతిలో కీలుబొమ్మ అని.. స్పష్టంగా చెప్పాడు.. పార్టీలో అన్నీ తానై నడిపిస్తూ, జగన్ రెడ్డిని చివరికి సొంత కుటుంబ సభ్యులు కూడా,, చీకొట్టి వెళ్ళిపోవడానికి, సజ్జల ఏ విధంగా కారణం అయ్యాడో వివరించాడు...
మొత్తం వ్యవహారం చూసినవాళ్లకు.. జగన్ రెడ్డి సజ్జల చేతిలో కీలుబొమ్మ ఎందుకు అయ్యాడు..?? అసలు సజ్జలకు ఇంత power ఉండడానికి కారణం ఏమిటి..?? అసలు ఎవరీ సజ్జల రామకృష్ణా రెడ్డి..?? అనే అనుమానాలు కలగకపోదు..
👉 ఆ ప్రశ్నలకు సమాధానం వివరిస్తాను..
✅ సజ్జల రామకృష్ణా రెడ్డి గురించి బయట తక్కువగా తెలిసిన నిజాలు.. ✅
సజ్జల ఈనాడు పత్రికలో ఒక సాధారణ విలేకరిగా జీవితాన్ని మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగి, ఇప్పుడు వైఎస్ఆర్సి పార్టీలో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు.. అని ఒక అబద్ధాన్ని వైసీపీ కార్యకర్తలలో బాగా ప్రచారానికి పెట్టారు..
కానీ... నిజానికి సజ్జల రామకృష్ణారెడ్డి కొన్ని వేల కోట్లకు అధిపతి.. రాజశేఖరరెడ్డికి బినామీలుగా.. అతని కుటుంబం దాదాపు 40 సంవత్సరాల నుంచి మైనింగ్ రంగంలో వ్యాపారం చేస్తూ కొన్ని వేల కోట్లు సంపాదించింది..
▪️ రాజశేఖర్ రెడ్డి మానసపుత్రుడు సజ్జల రామక్రిష్ణ▪️
రాజశేఖరరెడ్డికి ఏకైక పుత్రుడు జగన్ రెడ్డి కాగా.. మరో ఇద్దరు మానసపుత్రులు ఉన్నారు.. 1. గాలి జనార్ధన్ రెడ్డి 2. సజ్జల రామక్రిష్ణ రెడ్డి.. 2004 లో అధికారంలోకి వచ్చాక వీరిద్దరినీ అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడు వైఎస్సార్..
తన తండ్రి రాజారెడ్డి ద్వారా మైనింగ్ రంగంలో సంపాదించిన సొమ్ముతో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుపుతూ MLA స్థాయికి ఎదిగిన రాజశేఖర్ రెడ్డి.. 2004 ఎన్నికల సమయానికి కూడా కేవలం లక్షల్లోనే tax లు కట్టినట్టు వారి election affidavit ల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది.. కానీ 2009 ఎన్నికల సమయానికి.. ఇటు రాజశేఖరరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అక్కడ గాలి జనార్ధన్ రెడ్డి వందల కోట్ల advance tax కట్టే స్థాయికి ఎదిగారు.. వీరి ఈ rapid growth కు కారణం.. Mining Mafia .
▪️రాజశేఖరరెడ్డి Mining Mafia ను నడిపింది సజ్జల కుటుంబమే▪️
సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం ముగ్గురు అన్నదమ్ములలో సజ్జల రామకృష్ణారెడ్డి మూడవ వాడు.. పెద్ద సోదరుడు రామసుబ్బారెడ్డి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APMDC) లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సేవలందించి 1980లలో రిటైర్ అయ్యాడు.. ఈయన దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఖనిజ వనరుల మీద, మైనింగ్ మీద పూర్తి అవగాహన ఉన్న సుప్రసిద్ధ జియాలజిస్ట్ గా పేరుగాంచిన వ్యక్తి... రెండో సోదరుడు దివాకర్ రెడ్డి.. ఈయన కూడా జియాలజి గ్రాడ్యుయేట్.. మైనింగ్ లో మంచి పట్టు ఉన్న వ్యక్తి..
రాజారెడ్డి వీరిద్దరినీ చేరదీసి.. వీరి సహాయంతో మైనింగ్ వ్యాపారాన్ని విస్తరించాడు.. సజ్జల సోదరుల పేరుతో రాజశేఖరరెడ్డి కుటుంబం Sajjala Iron and Steel company ltd. మరియు Red Gold Enterprises పేర్లతో రెండు మైనింగ్ కంపెనీలు పెట్టించి, నడిపించేది..
▪️2004 లో CM గా YSR.. దోపిడీ కథ మొదలు..▪️
2004 లో CM పదవి దక్కడంతో.. రాజశేఖరరెడ్డి తాను అప్పటికే ఉన్న మైనింగ్ వ్యాపారంతోనే,, లక్షల కోట్లు కొల్లగొట్టే ప్రణాళిక అమలు చేశాడు.. అందుకోసం తన మానసపుత్రులైన గాలి జనార్ధన్ రెడ్డి, సజ్జల రామకృష్ణ రెడ్డిలను రంగంలోకి దింపాడు..
✅ సజ్జల కుటుంబానికి ఓబులాపురం అక్రమ మైనింగ్ లో వాటా.. ✅
రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఓబులాపురం గనులను ఏ విధంగా గాలి జనార్ధన్ రెడ్డికి దోచి పెట్టాడో తెలిసిందే.. దాని మీద ఇప్పటికీ వివాదం నడుస్తూనే ఉంది.. (దోచి పెట్టిన విధానాలు GO లతో సహా రాయమంటే కామెంట్లలో తెలియజేయండి.. ఒక పోస్టుగా రాస్తాను)..
2007 లో.. రాజశేఖరరెడ్డి బినామీలు అయిన సజ్జల కుటుంబ కంపెనీ Red Gold Enterprises కు, గాలి జనార్ధన రెడ్డి కి చెందిన ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ (OMC) కు ఒక కీలక ఒప్పందం జరిగింది.. దాని ప్రకారం.. OMC నిర్వహించిన తవ్వకాల్లో 50% ముడి ఇనుము ఈ Red Gold Enrerprises కి కేవలం 5% appreciation ధరతో ఇవ్వబడుతుంది.. దాని అర్థం.. ఓబులాపురం అక్రమ మైనింగ్ లో 50% వాటా సజ్జల కంపెనీకి దక్కింది..
అంటే... ఓబులాపురం అక్రమ మైనింగ్ లో లాభాలను తన మానసపుత్రులు గాలి జనార్ధన్ రెడ్డి, మరియు సజ్జల రామకృష్ణా రెడ్డికి తలో 50% వచ్చే విధంగా ఏర్పాటు చేశాడు రాజశేఖర్ రెడ్డి.. సజ్జల కంపెనీలకు ఆ విధంగా అక్రమ మైనింగ్ నుండి వచ్చిన డబ్బులో కొంత భాగాన్ని,, RR Global అనే ఒక suitcase company ద్వారా, సాక్షి మీడియాకు మళ్ళించాడు రాజశేఖర్ రెడ్డి.. ఈ అంశాలన్నీ గాలి జానార్ధన్ రెడ్డి కేసుకి సంబంధించిన CBI ఛార్జ్ షీట్ లో స్పష్టంగా పేర్కొంది..
✅ సాక్షి స్థాపన నుండి జగన్ రెడ్డికి రాజకీయ Care Taker గా సజ్జల ✅
సాక్షి లో పెట్టుబడులు పెట్టాక.. ఈ RR గ్లోబల్, Sajjala Iron and Steel కంపెనీలు వ్యాపారాలు ఆపేసుకుని కనుమరుగు అయిపోయాయి.. అంటే.. సజ్జల రామకృష్ణ రెడ్డికి, రాజశేఖరరెడ్డి ఇచ్చిన టాస్క్ అక్కడితో complete అయిపోయింది అన్నమాట..
ఇక్కడ నుండి సజ్జల రామకృష్ణ రెడ్డి,, సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్ గా రాజశేఖర్ రెడ్డి కుటుంబ రాజకీయ వ్యవహారాలు manage చేయడం మొదలుపెట్టాడు..
✅ జగన్ రెడ్డి ఎందుకు కీలుబొమ్మగా ఉంటున్నాడు..?? ✅
రాజశేఖరరెడ్డి Prime phase లో ఉన్నప్పుడు జగన్ రెడ్డి.. ఆకతాయిగా తిరిగే కుర్రాడిగా ఉన్నాడు.. చదువుకోమని విదేశాలకు పంపితే తిరుగుటపాలో వచ్చేశాడని, బొత్తిగా చదువు మీద ధ్యాస లేదు అని,, రాజశేఖరరెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా చెప్పాడు..
తన తాత రాజారెడ్డి లాగా ఎప్పుడూ గొడవలు కొట్లాటలలో తిరిగేవాడు.. చివరికి 25 సంవత్సరాల వయసు వచ్చాక హైదరాబాద్ లో ఒక ఊరుపేరు లేని కాలేజీలో B.Com చదువుతో సరిపెట్టాల్సి వచ్చింది.. రాజశేఖరరెడ్డికి జగన్ రెడ్డి మీద చాలా అపనమ్మకం ఉండేదనీ,, దీనితో వీరిద్దరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరిగేవి అనేది, చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు కూడా..
దానితో రాజశేఖరరెడ్డి అక్రమ వ్యాపారాలు మరియు రాజకీయ వారసత్వం విషయంలో జగన్ రెడ్డికి ఉన్న పరిజ్ఞానం సరిపోదు అని భావించి.. అతనికి Custodian గా సజ్జల రామకృష్ణ రెడ్డిని నియమించాడు.. దాంతో ఏ వ్యవహారంలో కూడా జగన్ రెడ్డికి కనీస అవగాహన ఉండేది కాదు.. ఎవరు ఏ విషయం గురించి అడిగినా.. "సజ్జల అన్న దగ్గరకు వెళ్ళండి" అని,, సజ్జల వైపు చెయ్యి చూపించడమే జగన్ రెడ్డికి 20 ఏళ్లుగా అలవాటుగా మారింది..
👉👉 ఇప్పుడూ అదే అలవాటు కొనసాగుతుంది. 👈👈
వైసీపీ పార్టీ విషయంలో కూడా జగన్ రెడ్డి తన 20 సంవత్సరాల కీలుబొమ్మ పాత్రే కొనసాగిస్తున్నాడు.. ప్రతీ విషయంలో సజ్జల మీదనే ఆధారపడ్డాడు.. 5 సంవత్సరాల పాలన కూడా, సజ్జల తోనే చేయించాడు.. అతన్ని ఎవరు కలవడానికి వెళ్ళినా.. అలవాటు ప్రకారం "సజ్జల అన్న దగ్గరకు వెళ్ళండి" అంటూ పంపించేసాడు.. పార్టీలో అన్నీ కీలక నిర్ణయాలు సజ్జల తీసుకుంటే, జగన్ రెడ్డి గుడ్డిగా సంతకం పెట్టడం మాత్రమే చేశాడు.. మంత్రుల నియామకాలు, మార్పులు, పార్టీ నాయకులు, కమిటీలు.. అన్నీ సజ్జల రామకృష్ణా రెడ్డే manage చేశాడు..
జగన్ రెడ్డిలో సమర్ధత లేకపోవడం వల్లనే.. సజ్జల రామకృష్ణా రెడ్డి మీద ఆధారపడి నెట్టుకురావాల్సిన పరిస్తితి.. కాబట్టే అతను సజ్జల చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు..
✅ విజయసాయి రెడ్డి చెప్పినట్టు.. వైసీపీకి నిజమైన బాస్ సజ్జల రామకృష్ణా రెడ్డే.. జగన్ రెడ్డి కేవలం ఉత్సవ విగ్రహం మాత్రమే.. ✅