15/03/2021
ఈరోజు కేశినేని భవన్ లో కృష్ణాజిల్లా, వేలేరు, జవహర్ నవోదయ విద్యాలయ సిబ్బంది విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేశినేని శ్రీనివాస్ (నాని) గారిని కలిసి తమ సీసీఎస్ పెన్షన్ గురించి వినతి పత్రం సమర్పించారు.
1986లో ఏర్పాటైన నవోదయ రెసిడెన్షియల్ విద్యాలయాలు మంచి పని తీరును కనబరుస్తున్నప్పటికీ అందులోని అధ్యాపక మరియు అధ్యాపకేతర సిబ్బందికి పెన్షన్ సౌకర్యం లేదని, నవోదయ విద్యాలయాల తరువాత ఏర్పాటైన అనేక ఇతర సంస్థల సిబ్బందికి పెన్షన్ అమలు జరుగుతోందని, ఈ సమస్య పరిష్కారం కోసం గత రెండు దశాబ్దాలుగా పోరాడుతున్నామని తెలిపారు.
వారి వినతిని సావధానంగా విని, సానుకూలంగా స్పందించి రానున్న పార్లమెంట్ సమావేశాల zero hour లో ప్రస్తావిస్తాను అని హామీ ఇచ్చిన ఎంపీ కేశినేని నాని గారికి సదా రుణపడి ఉంటానని నవోదయ విద్యాలయ సిబ్బంది పేర్కొన్నారు.