24/08/2026
బుడేకల్ ఏరియాలో డోర్ టు డోర్ కార్యక్రమం
కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈరోజు ఆదోని పట్టణంలోని బుడేకల్ ఏరియాలో ఆదోని నియోజకవర్గం ఇంచార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడు అన్న గారి ఆదేశాల మేరకు, టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు అన్న గారి ఆధ్వర్యంలో డోర్ టు డోర్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు అన్నగారు మాట్లాడుతూ:
“కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సూపర్ సిక్స్ హామీల అమలుతో పాటు పింఛన్లు, ఉచిత బస్సు ప్రయాణం, అన్న క్యాంటీన్లు, దీపం పథకం, మెగా డీఎస్సీ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాం.
ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తాం. ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం మీనాక్షి నాయుడు అన్న గారి నాయకత్వంలో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాం” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు జిందే శంకర్, రంగన్న, రామస్వామి, రాష్ట్ర హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ రామకృష్ణ, పట్టణ అధ్యక్షులు తిమ్మప్ప, కృష్ణారెడ్డి, క్లస్టర్6 రవి, సతీష్, అల్తాఫ్, నాగేష్, మరి, నాగరాజ్, ఉదయ్ శంకర్, శిక్షావలి, తదితరులు పాల్గొన్నారు,
Nara Chandrababu Naidu
Nara Lokesh
Meenakshi Naidu konka
Konka Umapathi Naidu
Siddartha Naidu Konka
Telugu Desam Party (TDP)
Team Konka