17/08/2026
జిల్లా పోలీస్ కార్యాలయం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా,
అమలాపురం.
తేదీ: 17.08.2026
ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందజేసిన జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా, ఐపీఎస్ సూచించారు. ఆర్థిక ఇబ్బందులు విద్యార్థుల చదువుకు అడ్డంకిగా మారకుండా వారికి అండగా నిలుస్తూ విద్యాభ్యాసానికి సహకారం అందిస్తున్న క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సేవలను ఆయన అభినందించారు.
జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, క్రెడిట్ యాక్సెస్ ఇండియా ఫౌండేషన్ సంస్థల సహకారంతో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ఆరుగురు ప్రతిభావంతులైన విద్యార్థులు డి. శ్వేత, డి . రేవతి, ఎన్.యశ్వంత్, పి .కీర్తి, కె .అమిత , ఏ.విజయదుర్గా స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేశారు. జిల్లా ఎస్పీ రాహుల్ మీనా చేతుల మీదుగా ఒక్కొక్క విద్యార్థికి రూ.10,000 చొప్పున స్కాలర్‌షిప్‌లను అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ...
👉విద్యార్థి దశ జీవితంలో అత్యంత కీలకమైన దశ అని పేర్కొన్నారు. ఈ దశలో విద్యతో పాటు క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల, సానుకూల ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు.
👉తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ విద్యలో రాణించాలని అన్నారు.
👉ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవడం ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని ఎస్పీ పేర్కొన్నారు.
👉ఆర్థిక పరిస్థితులు చదువుకు అడ్డంకిగా మారకుండా ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. అందుతున్న ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని సూచించారు.
👉తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యను అభ్యసించి, మంచి ఉద్యోగాలు సాధించడంతో పాటు సమాజానికి ఉపయోగపడే బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని విద్యార్థులకు ఎస్పీ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ విశాఖపట్నం రీజినల్ మేనేజర్ బి. వెంకట రమణ, ఏరియా మేనేజర్ షేక్ జమీర్ బాష, మేనేజర్ లు ఎం.చిన్న, వై. పోలినాయుడు, టి.లోవరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభ్యాసానికి తమవంతు సహకారం అందించేందుకు సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.