Uppu Srinivas Ekalya

Uppu Srinivas Ekalya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Uppu Srinivas Ekalya, Social service, Amalapuram.

01/07/2021

ఆంధ్రప్రదేశ్ లో ఏకలవ్య జయంతిని ప్రభుత్వమే అధికారికంగా జరిపించాలి.ఆరోజు శెలవు దినంగా ప్రకటించించాలి.

ఫొటో కవిత # # # # # # # # # # # # # # # # # #మసి బారిన జీవితాల్లో ముసి నవ్వుల ఏడ?!😓మసకబారిన బతుకుల్లోవెలుగు నీడలు ఏడ?😓కన...
03/11/2020

ఫొటో కవిత
# # # # # # # # # # # # # # # # # #
మసి బారిన జీవితాల్లో
ముసి నవ్వుల ఏడ?!😓
మసకబారిన బతుకుల్లో
వెలుగు నీడలు ఏడ?😓
కన్నీటి దారల్లో...
పన్నీటి జల్లులు ఏడ?😓
బిడ్డా..
నా గుండెలపై నిదురపో...
బండలను పిండి చేసిన నా అరచేతులే...
నీకు బంగరు ఊయల.😭
నా బొంగురు గొంతు నుంచి వచ్చే వెచ్చని శ్వాశే...
నీకు జోలపాట.😭
చిరిగిన చీర కొంగే...
నీకు చలిదుప్పటి.😭
అడుగంటిన నా కన్నీరే...
నీకు నులి వెచ్చని కుంపటి.😭
నా కన్నపేగు కన్నీటి పొరను
అదిమిపడుతోంది.😓
కడుపుకోత వాత్యల్యయం పెంచుతోంది.😓
కాఠిన్యమే లేని కఠిక ప్రేమ నాది,
ధనమేలేని నిరుపేద గాధ మనది,
కడగళ్ల కష్టాల కధ మనది.😓
మట్టి వాసన పొత్తిళ్ళల్లో పొందికగా బొజ్జోబిడ్డ..😓
లాలి పాట నే..పాడలేను
జోల పాట నే..చెప్పలేను
ఉగ్గు పాలు బొగ్గు పాలైనాయ్
నీ లేత బుగ్గలపై నల్లని పౌడరే అద్దాను😭
దిష్టి చుక్క లేనేలేదు.
మన బతుకులో..
వేగు చుక్క రానేలేదు
కన్నా... కడుపు కట్టి
నిన్ను పడుకోబెట్టి,
కాష్టం లో సేద్యం చేసి
నీ బతుక్కి బంగారు బాట వేస్తా..
మరో "చిట్టి తల్లి"
"కన్నతల్లి" కాకుండా నీవే రక్షించు.
బాల్యం బుగ్గి కాకుండా సంరక్షించు.
# # # # # # # # # # # # # # # # # #

మీ ఉప్పు శ్రీనివాస్
9491433133

04/10/2020

నేను ఆడపిల్లను🙏
రక్షణ లేని దేశంలో సమిధను😓
నేను ఆడపిల్లను🙏
సంరక్షణ లేని ప్రదేశం లో వట్టి ప్రమిదను😓
నేను ఆడపిల్లను🙏
పురుషాధిక్య సమాజంలో కుందేలును😓
నేను ఆడపిల్లను🙏
స్వార్థ రాజకీయ పార్టీలకు కుదేలును😓
నేను ఆడపిల్లను🙏
కులం మతం జాతి ప్రాంతం లేకుండా భక్షణమౌతున్న అబలను😓
నేను ఆడపిల్లను🙏
నేను స్వేచ్ఛగా తిరగలేను
కారణం?!మగతోడేళ్లు వెంటబడుతాయ్😓
నేను ఆడపిల్లను🙏
నేను నా ఇష్టంగా ఉండలేను
కారణం?!కామాంధుల కళ్లు స్పై కెమెరాలతో చూస్తుంటాయ్😓
నేను ఆడపిల్లను🙏
నాకు నచ్చిన చోటుకు వెళ్లలేను
కారణం?! మ్రుగాళ్ల డేగచూపుల డ్రోన్లు వెంటాడుతాయ్.😓
నేను ఆడపిల్లను🙏
నిర్భీతిగా ఉద్యోగం చెయ్యలేను
కారణం?!అధికారం పేరుతో బాస్ చూపులు నన్ను వేటాడుతాయ్😓
కానీ.....😡😡😡😡😡😡😡
నేను ఆడపిల్లను💪
గర్జిస్తాను మాత్రుస్వామ్యం కోసం✊
నేను ఆడపిల్లను💪
ప్రశ్నిస్తాను లింగ వివక్షత కోసం✊
నేను ఆడపిల్లను💪
నేను నిలదీస్తాను సిగ్గు లేని మగాళ్ల కోసం✊
నేను ఆడపిల్లను💪
కాదు కాదు అగ్గి పుల్లను😡
వెలిగిస్తాను.. కామాంధుల చితులను✊✊✊
నేను ఆడపిల్లను💪
తెరిపిస్తాను సన్నాసులు కళ్లను😡😡
నేను ఆడపిల్లను💪
నడిపిస్తాను సాటి మహిళల కన్నీటి కలలను✊✊✊
నేను ఆడపిల్లను💪
వినిపిస్తాను సాటి మహిళల కన్నీటి గాధలను😡😡😡😡
నేను ఆడపిల్లను✊✊✊
గొంతుక వినిపిస్తాను✊నపుంసక మగనాయాళ్ల పరిపాలకుల కోసం😡😡😡😡😡
నేను ఆడపిల్లను✊✊✊✊
హాధ్రాస్ లో అర్థరాత్రి కాలింది చిధ్రమైన నా శరీరం కాదు,
విచ్ఛిన్నమైన నా దేశపు ఆడపడుచులు ఆత్మగౌరవ వ్యధ😡😡😓😓😓😓

(నాలుక కోసి, నడుము మెడ విరగ్గొట్టి సామూహిక అత్యాచారానికి కాబడ్డ నా సోదరికి ఘననివాళులు అర్పిస్తూ...)

ఇట్లు
మీ సేవకుడు
ఉప్పు శ్రీనివాస్ ఏకలవ్య

20/09/2020

నా అక్షరాలు ముళ్లు...............................
మీ అంతరాత్మలను గుచ్చి గుచ్చి నిద్రలేపుతాయ్!...............................................................................
నా అక్షరాలు రాళ్లు.......................................
మీ అహాన్ని వెంటబడి తరుముతాయ్!...............................................................................
నా అక్షరాలు మళ్లు.......................................
మీ చైతన్య చేలకు మడులు కడతాయ్!...............................................................................
నా అక్షరాలు బీళ్లు.......................................
మీ వట్టిపోయిన మట్టి బుర్రల్లో ఎర్రటి మొలకలు మొలిపిస్తాయ్!...............................................................................
నా అక్షరాలు నీళ్లు.......................................
మీ మనువాద బ్రాహ్మణీయ పిడివాదాన్ని కడిగివేస్తాయ్!...............................................................................
నా అక్షరాలు కన్నీళ్లు.......................................
మీ అణగారిన వర్గాలకు ఉక్కు పిడికిలౌతాయ్!...............................................................................
నా అక్షరాలు బళ్లు.......................................
మీ మస్తిష్క తరగతి గదిలో విప్లవాల విధ్య నేర్పే గురువులౌతాయ్!...............................................................................
నా అక్షరాలు గుళ్లు.......................................
మీ కష్టాల కడలిలో ప్రశ్నించే వారికి అంబేద్కర్ లాంటిదేవుళ్లౌతాయ్!...............................................................................
నా అక్షరాలు లేళ్లు.......................................
మీ అలిసిన భావాలకు ఎగిసిపడే ఉధ్యమ తరంగాల కుప్పిగంతులౌతాయ్!...............................................................................
నా అక్షరాలు తేళ్లు.....................................
మీ స్వజాతి ప్రయోజనాలను రాజకీయాలకు తాకట్టుపెట్టిన వారి గుండెల్లో విషపు కొండెలౌతాయ్!............................................................................

నా అక్షరాలు జీళ్లు.......................................
మీ తియ్యని జ్ఞాపకాల బాధలను నెమరువేస్తాయ్!................................................................................
నా అక్షరాలు ఏకలవ్య వేళ్లు.......................................
మీ అణవేతను ఛేదించి బానిసత్వాన్ని వధించే బాణాలౌతాయ్!...............................................................................
ఇట్లు
మీ సేవకుడు
ఉప్పు శ్రీనివాస్ ఏకలవ్య
9491433133

08/09/2020

నువ్వు ప్రశ్నించకపోతే..బాత్ రూం సింగర్ గాను, బాత్ టబ్ స్విమ్మర్ గాను,ఫుట్ పాత్ రన్నర్ గాను మిగిలి పొతావ్.నువ్వు పిడికిలిబిగించకపోతే.. బానిసత్వానికి అలవాటుపడతావ్.

30/08/2020

Welcome to my page

Address

Amalapuram
533201

Website

Alerts

Be the first to know and let us send you an email when Uppu Srinivas Ekalya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category