20/08/2022
మిత్రులకు, తెలుగుదేశం పార్టీ అభిమానులకు నమస్కారాలు..
వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతో మంది కార్యకర్తలను వీపు మీద కొట్టారు, పొట్ట మీద కొట్టారు, జీవితాల మీద కొట్టారు..
అయినా సరే మొక్కవోని ధైర్యంతో మీరు ఎదురొడ్డి నిలిచిన తీరు ప్రశంసనీయం..
మీ త్యాగానికి ప్రతిఫలం అందాలన్నా మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం రావాలన్నా మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చి తీరాలి..
అందుకోసం మనం అంతా కలిసికట్టుగా పని చేసే సమయం ఆసన్నమైంది..
మనవంతు సహకారానికి తదుపరి కార్యాచరణ ఎలా చేస్తే బావుంటుంది అనేదానికి మీ నుంచి విలువైన అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి..
జై తెలుగుదేశం
జై చంద్రబాబు