Amaravati - People's Capital of Andhra Pradesh

Amaravati - People's Capital of Andhra Pradesh Official page of Amaravati City. Follow Page for more updates. Everyone has a chance to be part of this remarkable journey.
(608)

Amaravati, envisioned as the dynamic heart of Andhra Pradesh, stands as a symbol of progress, innovation, and prosperity. On 22nd October 2015, a historic chapter began with the foundation stone being laid by Prime Minister Sri Narendra Modi, alongside Chief Minister Sri Chandrababu Naidu, marking the start of the ambitious plan for a 'People's Capital' - Praja Rajdhani Amaravati. This modern, wor

ld-class city will be a hub for opportunities, where technology, sustainability, and growth converge. Amaravati is poised to create not just infrastructure, but a thriving ecosystem for its citizens and visitors alike. By contributing an e-brick, you can play a role in shaping the future of this vibrant city. Visit amaravati.gov.in to contribute and make your mark in the development of !

07/09/2026

ప్రజారాజధాని అమరావతిలో పురోగతి దిశగా ప్రాజెక్టులు!

✅రాష్ట్ర ప్రభుత్వ చొరవతో నిర్మాణం పూర్తయిన రాయపూడిలోని APCRDA ప్రధాన కార్యాలయం నుంచి అమరావతి అభివృద్ధి పనుల పర్యవేక్షణ, సమన్వయం నిరంతరం కొనసాగుతోంది. వేగంగా ముందుకు సాగుతున్న ప్రాజెక్టులతో అమరావతి పురోగతి బాటలో పయనిస్తోంది.

07/09/2026

మౌలిక సదుపాయాలలో మేటి.. మన రాజధాని అమరావతి!

✅E6 రహదారి అభివృద్ధిలో భాగంగా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు.. విద్యుత్ తదితర మౌలిక వసతులను అండర్‌గ్రౌండ్ వ్యవస్థల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

07/09/2026

అమరావతిలో కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత!
✅ప్రజారాజధాని అమరావతిలో నిర్మాణ పనుల్లో భాగస్వాములవుతున్న కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు APCRDA, ADCL ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయి.
✅కృష్ణాయపాలెం లేబర్ క్యాంపులో NCC సంస్థ ఆధ్వర్యంలో శనివారం, 2026 సెప్టెంబర్ 5న APCRDA, ADCL ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో 112 మంది కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేయడం జరిగింది.
ప్రజారాజధాని అమరావతి – అభివృద్ధితో పాటు సంక్షేమానికి చిరునామా..

05/09/2026

అమరావతిలో ముమ్మరంగా జరుగుతున్న E1 రహదారి నిర్మాణం!
✅ ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకు 4 లేన్లుగా అభివృద్ధి చేస్తున్న E1 రహదారి, అమరావతిలో మెరుగైన కనెక్టివిటీకి దోహదపడనుంది.

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 6.155 ఎకరాల భూమిని అందజేసిన నిడమర్రు రైతు కుటుంబం! ✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్...
05/09/2026

రాజధాని అమరావతికి భూసమీకరణ కింద 6.155 ఎకరాల భూమిని అందజేసిన నిడమర్రు రైతు కుటుంబం!

✅ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ కింద తమ కుటుంబానికి చెందిన భూములను అందజేసేందుకు జొన్నాల శ్రీనివాసరెడ్డి గారు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. జొన్నాల శ్రీనివాసరెడ్డి, కృష్ణకుమారి గార్లకు చెందిన నిడమర్రు పరిధిలోని 6.155 ఎకరాల భూమిని రాజధాని నిర్మాణం కోసం APCRDA అధికారులకు అందజేసేందుకు తమ సమ్మతి తెలియజేశారు. సంబంధిత అంగీకార పత్రాలను కాంపిటెంట్ అథారిటీ అయిన నిడమర్రు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.భద్రు గారికి యూనిట్ కార్యాలయంలో శనివారం, 2026 సెప్టెంబర్ 5న అందజేశారు.

✅భూసమీకరణ కింద 6.155 ఎకరాల భూమి సమకూరడంతో నిడమర్రులో ట్రంక్ ఇన్‌ఫ్రా తదితర ప్రాజెక్టుల పనులలో పురోగతి జరగనుంది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నందుకు సంతోషంగా ఉందని శ్రీనివాసరెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేశారు. రాజధాని గ్రామాల ప్రజలు పూలింగ్ ప్రక్రియకు APCRDA అధికారులతో సహకరించాలని కోరారు.

05/09/2026

మౌలిక సదుపాయాలలో మేటి.. మన రాజధాని అమరావతి!

ప్రజారాజధాని అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతుల రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న LPS జోన్‌లలో అత్యుత్తమ మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతోంది.

వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లతో పాటు.. అండర్‌గ్రౌండ్ వ్యవస్థల ద్వారా విద్యుత్ తదితర మౌలిక వసతుల అభివృద్ధి ముమ్మరంగా జరుగుతోంది.

05/09/2026

వరద నివారణకు.. జల వనరుల సమర్థ నిర్వహణకు అమరావతిలో గ్రావిటీ కెనాల్!

✅ప్రజారాజధాని అమరావతిలో 7.8 కిలోమీటర్ల మేర విస్తరించిన గ్రావిటీ కెనాల్ నెక్కల్లు నుంచి దొండపాడు వరకు విస్తరించి, వరద నివారణతో పాటు జల వనరుల నిర్వహణలో కీలక పాత్ర పోషిస్తోంది.

✅మోటార్ల అవసరం లేకుండా.. కేవలం గురుత్వాకర్షణ శక్తితో నీటి ప్రవాహాన్ని నిర్వహించే ఈ కెనాల్, అమరావతి సమగ్ర జల నిర్వహణ వ్యవస్థలో కీలకంగా నిలుస్తోంది.

✅ప్రకృతితో సమన్వయం.. సమర్థవంతమైన జల నిర్వహణకు కేరాఫ్ మన రాజధాని అమరావతి!


05/09/2026

వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతులకు కేంద్రంగా ప్రజారాజధాని అమరావతి!

✅ నిడమర్రులో నిర్మాణంలో ఉన్న బొల్లినేని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్కిల్, ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (BISER) యూనివర్సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయి.

✅ ఈ ప్రాజెక్టులో భాగంగా 500 పడకల మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నారు.

✅ ఆధునిక వైద్య సేవలు, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలక కేంద్రంగా నిలవనుంది. లక్ష మందికి పైగా అభ్యర్థులకు శిక్షణ, ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నారు.

✅ సమగ్ర ఆరోగ్య, విద్య, నైపుణ్యాభివృద్ధి మౌలిక వసతులతో ప్రజారాజధాని అమరావతి ప్రపంచ స్థాయి నాలెడ్జ్ & హెల్త్ హబ్‌గా రూపుదిద్దుకుంటోంది.

05/09/2026

ప్రజారాజధాని అమరావతిలో పౌరసేవలకు ప్రథమ ప్రాధాన్యత!

✅5 నిముషాలలోనే అత్యవసర సేవలు..
10 నిముషాలలోనే ఆట స్థలాలు, రిక్రియేషన్ సెంటర్లు..
15 నిముషాలలోనే కార్యాలయాలు, పని ప్రదేశాలకు చేరుకునేలా రవాణా సౌకర్యాల అభివృద్ధి..

✅మౌలిక సదుపాయాలలో మేటి మన రాజధాని అమరావతి!

Celebrating the Educators Who Inspire, Guide and Empower!On Teachers’ Day, APCRDA salutes the dedicated teachers whose k...
05/09/2026

Celebrating the Educators Who Inspire, Guide and Empower!

On Teachers’ Day, APCRDA salutes the dedicated teachers whose knowledge, guidance and values inspire young minds, shape character and empower the next generation to dream, learn and lead.

As Amaravati, the People’s Capital, progresses towards a brighter and more inclusive future, we celebrate the educators who lay the foundation for that future by nurturing talent, curiosity and ambition—one learner at a time.

Happy Teachers’ Day!

Address

Rayapudi Post, Thulluru
Vijayawada
522237

Alerts

Be the first to know and let us send you an email when Amaravati - People's Capital of Andhra Pradesh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Amaravati - People's Capital of Andhra Pradesh:

Shortcuts

Share