Ministry of Health, Family Welfare & Medical Education Government Of AP

  • Home
  • India
  • Amaravati
  • Ministry of Health, Family Welfare & Medical Education Government Of AP

Ministry of Health, Family Welfare & Medical Education Government Of AP This is Official Page of Ministry of Health, Family Welfare & Medical Education Government of Andhra Pradesh

అమరావతి // 4.9.2026వర్చువల్ అండ్ డైరెక్టర్ గా ముగిసిన సమయం  8.00 పీఎంస్పాట్ ఐటమ్ మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ ...
04/09/2026

అమరావతి // 4.9.2026

వర్చువల్ అండ్ డైరెక్టర్ గా ముగిసిన సమయం 8.00 పీఎం

స్పాట్ ఐటమ్

మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ విధానాలకు జాతీయ నిపుణుల ప్రశంసలు

1 నుంచి శుక్రవారం వరకు జిల్లాల్లో పర్యటించిన కేంద్ర నిపుణుల బృందాలు

అమరావతి: మలేరియా నిర్మూలనలో ఆంధ్రప్రదేశ్‌ అమలు చేస్తున్న వినూత్న విధానాలను జాతీయ స్థాయి నిపుణుల బృందాలు ప్రశంసించాయి. వ్యాధి నిఘా, కేసుల నిర్వహణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ–ప్రైవేటు సమన్వయంలో రాష్ట్రం అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను గుర్తించాయి. సీఎం డ్యాష్‌బోర్డు, ‘అవేర్‌’ వ్యవస్థ, డ్రోన్‌ సాంకేతికత, ఫీడర్‌ అంబులెన్స్‌లు, ‘ఫ్రైడే–డ్రై డే’, ఐహెచ్‌ఐపీ, ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీని ప్రత్యేకంగా ప్రస్తావించాయి.

నాలుగు రాష్ట్రాల్లో మలేరియా కార్యక్రమంపై సమీక్ష

2027–2032 జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక రూపకల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మహారాష్ట్ర, ఒడిశాలో మలేరియా నియంత్రణ కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర నిపుణుల బృందాలు సెప్టెంబరు 1 నుంచి శుక్రవారం వరకు రాష్ట్రంలో పర్యటించాయి. మలేరియా ప్రభావిత అల్లూరి సీతారామరాజు, ప్రభావం లేని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల్లో క్షేత్రస్థాయి పరిశీలనలు చేపట్టాయి.

ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ చక్రధర్‌బాబుతో ఫ్రైడే నైట్‌ మీటింగ్‌

నాలుగు రోజుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం కేంద్ర నిపుణుల బృందాలు శుక్రవారం రాత్రి హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ కమిషనర్‌ చక్రధర్‌బాబు, ఇతర అధికారులతో మంగళగిరిలోని ఏపీఐసీసీ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నాయి. పలువురు సభ్యులు వర్చువల్గా హాజరయ్యారు. ప్రొఫెసర్‌ డాక్టర్‌ కామిని మెండిస్‌, డాక్టర్‌ నిర్మల్‌ జో, డాక్టర్‌ లోకేశ్‌ కోరి, డాక్టర్‌ ఆర్య రాహుల్‌, డాక్టర్‌ పి.కె. సేన్‌, డాక్టర్‌ ప్రణబ్‌ జె. భుయాన్‌, డాక్టర్‌ బద్రి థాపా పాల్గొన్నారు. సీఎం డ్యాష్‌బోర్డు ద్వారా వ్యాధి నిఘా, ‘అవేర్‌’ వ్యవస్థ ద్వారా కేసుల పరిస్థితి అంచనా, నిర్వహణను పర్యవేక్షిస్తున్న విధానాన్ని నిపుణులు ప్రశంసించారు.

గిరిజన ప్రాంతాల్లో డ్రోన్‌ సాంకేతికత వినియోగం

చేరుకోవడం కష్టమైన గిరిజన, మారుమూల ప్రాంతాల్లో రోగుల నిర్ధారణ, చికిత్స కోసం డ్రోన్‌ ఆధారిత సాంకేతికతను వినియోగిస్తున్న తీరును నిపుణులు గుర్తించారు. రోగులను సమీప ఆసుపత్రులకు తరలించేందుకు ఫీడర్‌ అంబులెన్స్‌ సేవలు అందిస్తున్న విధానాన్ని కూడా ప్రశంసించారు.

ప్రజల్లో అవగాహనకు ‘ఫ్రైడే–డ్రై డే’

దోమల వృద్ధి ప్రదేశాలను గుర్తించి తొలగించడం, మలేరియా, డెంగీ తదితర వెక్టర్‌ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తున్న ‘ఫ్రైడే–డ్రై డే’ కార్యక్రమాన్ని బృందాలు ప్రశంసించాయి. మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీ, వాటి వినియోగాన్ని ప్రోత్సహిస్తున్న విధానాన్ని కూడా గుర్తించాయి.

ప్రభుత్వ చర్యలకు నిపుణుల ప్రశంసలు

మలేరియా ప్రభావిత ప్రాంతాల్లో ఎల్‌ఎల్‌ఐఎన్‌ల పంపిణీ, ప్రజల భాగస్వామ్యంతో చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవల విస్తరణ, కేసులను ముందుగానే గుర్తించి సకాలంలో నిర్వహిస్తున్న విధానం అభినందనీయమన్నారు. రాష్ట్రం అనుసరిస్తున్న సమగ్ర విధానం మలేరియా నియంత్రణలో మెరుగైన ఫలితాలకు దోహదపడుతోందని ప్రశంసించారు.

బలోపేతానికి సూచనలు

వ్యాధి నిఘా, ముందస్తు నిర్ధారణ, సకాలంలో చికిత్స, దోమల నియంత్రణ చర్యలను మరింత బలోపేతం చేయాలని నిపుణులు సూచించారు. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు వివిధ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత మెరుగుపరచాలని తెలిపారు.

03/09/2026

మరో రంగారెడ్డిగా అనకాపల్లి జిల్లా.

పరిశ్రమలు, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఫార్మా, ఐటీ పెట్టుబడులతో...
ఉత్తరాంధ్రను దేశంలోనే తదుపరి అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దే విజన్ కార్యరూపం దాల్చుతోంది.

కనెక్టివిటీ + పెట్టుబడులు + ఉపాధి = ఉత్తరాంధ్ర భవిష్యత్!

03/09/2026

వంశధార, నాగావళి, జంజావతి, నారాయణగిరి సహా 12 కీలక సాగునీటి ప్రాజెక్టులకు ₹3,200 కోట్లతో వేగవంతమైన పనులు.

రైతన్నకు నీరు... ఉత్తరాంధ్రకు సిరులు...

03/09/2026

నదిపై నుంచి నదిని తరలించడానికి భారీ ఆక్విడిక్టులను నిర్మించి, కొండలను తొలిచి ఉత్తరాంధ్రకు పోలవరం నీళ్లను తరలిస్తున్నాం



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

03/09/2026

రాష్ట్రగీతం స్ఫూర్తితో గోదావరి, కృష్ణ్ణమ్మలను రాష్ట్రమంతా పారించి సస్యశ్యామలం చేస్తాం.

03/09/2026

అడవులు, కొండలు, నదులు, వాగులు, జాతీయ రహదారులను దాటి...
పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా గోదారమ్మ ఉత్తరాంధ్ర గడపకు చేరింది.

ఇది కేవలం నీటి ప్రవాహం కాదు... ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రవాహం!

03/09/2026

ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ..
పోలవరం లెఫ్ట్ కెనాల్ నుంచి గోదావరి నీటిని విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారు



#ఉత్తరాంధ్రసుజలస్రవంతి

ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు ...
03/09/2026

ఈరోజు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ భేటీ. వెలిగొండతో మార్కాపురం జిల్లాకు కృష్ణా జలాలు, పోలవరం ఎడమ కాల్వ ద్వారా అనకాపల్లికి గోదావరి నీళ్లు తీసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. కేబినెట్‌ హాలులోకి వచ్చే సమయంలో ముఖ్యమంత్రికి చప్పట్లతో మంత్రులు స్వాగతం పలికారు. ఈ సమావేశంలో సహచర మంత్రులతో కలసి పాల్గొన్న ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు

స్పాట్‌...ఇప్పుడే మీటింగ్ ముగిసింది02-09-2026అమ‌రావ‌తిబ‌దిలీల నిర్వ‌హ‌ణ‌పై పాల‌సీని రూపొందిస్తాంఆర్థికేత‌ర స‌మ‌స్య‌ల ప‌ర...
02/09/2026

స్పాట్‌...ఇప్పుడే మీటింగ్ ముగిసింది
02-09-2026
అమ‌రావ‌తి

బ‌దిలీల నిర్వ‌హ‌ణ‌పై పాల‌సీని రూపొందిస్తాం
ఆర్థికేత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై త్వ‌ర‌గా ఉత్త‌ర్వులిస్తాం
నిర్ణ‌యాత్మ‌క క‌మిటీలో జేఏసీ ప్ర‌తినిధుల‌ను భాగ‌స్వామ్యం చేస్తాం
ఆందోళ‌న‌ను వాయిదా వేయాలి
జెఎసి కాంట్రాక్ట్ ఉద్యోగుల‌కు వైద్య‌, ఆరోగ్య శాఖ‌ కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ విజ్ఞ‌ప్తి

బ‌దిలీల నిర్వ‌హ‌ణ‌పై నిర్దిష్ట‌మైన విధానాన్ని(పాల‌సీ) రూపొందిస్తామ‌ని కాంట్రాక్ట్ ఉద్యోగుల జాయింట్ యాక్ష‌న్ క‌మిటీ(జేఏసీ)కి వైద్య‌, ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి జి.వీర‌పాండియ‌న్ హామీ ఇచ్చారు. ఇందులో బ‌దిలీలు ఎలా, ఎప్పుడు ఏయే కేట‌గిరీ (మ్యూచువ‌ల్‌, విజ్ఞ‌ప్తులు, స్పౌజ్‌, ఇత‌ర‌) ఎటువంటి ప‌ద్ద‌తుల్ని అవ‌లంబించాల‌న్న దానిపై పాల‌సీని త‌యారు చేస్తామ‌ని చెప్పారు. ఈ బ‌దిలీలు, ఇత‌ర స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అధికారికంగా ఏర్పాటు చేసే క‌మిటీలో జెఎసి స‌భ్యుల‌ను కూడా భాగ‌స్వాముల‌ను చేస్తామ‌ని వెల్ల‌డించారు. ఆర్థికేత‌ర స‌మ‌స్య‌ల్ని సాధ్య‌మైనంత త్వ‌ర‌గా ప‌రిష్క‌రిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, ఉద్యోగ స‌ర్వీసుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, 100 శాతం గ్రాస్ వేత‌న చెల్లింపు త‌మ ప‌రిధిలో లేద‌ని, ప్ర‌భుత్వ ప‌రంగా విధాన‌ప‌ర‌మైన నిర్ణ‌యం జ‌ర‌గాల్సి ఉంద‌ని చెప్పారు. జెఎసి విజ్ఞ‌ప్తుల‌ను ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, ఉన్న‌త స్థాయిలో చ‌ర్చించేందుకు త‌గిన స‌మ‌యం అవ‌స‌ర‌మైనందున ఆందోళ‌న కార్య‌క్ర‌మాల‌ను నెల రోజుల పాటు వాయిదా వేయాల‌ని, రోగులు ఇబ్బందులు ప‌డ‌కూడ‌ద‌ని జెఎసి ప్ర‌తినిధుల‌ను కోరారు.

తాడేప‌ల్లిలోని డైరెక్ట‌ర్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ ప్ర‌ధాన కార్యాల‌యంలో బుధ‌వారం సాయంత్రం 4 గంట‌ల నుంచి 3 గంట‌ల పాటు రెండో విడ‌త జేఏసీ ప్ర‌తినిధుల‌తో కార్య‌ద‌ర్శి జి.వీర‌పాండియ‌న్‌తో పాటు ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్, డైరెక్ట‌ర్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ చ‌క్ర‌ధ‌ర్‌బాబు, ఆయుష్ క‌మీష‌న‌ర్, వైద్య‌,ఆరోగ్య శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ రోణంకి గోపాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో పద్మావతి, డైరెక్ట‌ర్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ డాక్ట‌ర్ విష్ణువ‌ర్ధ‌న్‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ప‌బ్లిక్ హెల్త్ డాక్ట‌ర్ ప‌ద్మావ‌తి ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో చ‌ర్చించారు. ఈ సంద‌ర్భంగా కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ మాట్లాడుతూ మెటర్నిటీ, చైల్డ్ కేర్, మెడికల్ లీవులు, ఇత‌ర విజ్ఞ‌ప్తుల్ని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటామ‌ని చెప్పారు. రాత్రి విధుల (Night Duty) కేటాయింపులో రొటేషన్ పద్ధతిని పక్కాగా అమల్లోకి తెస్తామ‌న్నారు. ఏ ఒక్కరిపైనే భారం పడకుండా అందరికీ 12 గంటల నైట్ డ్యూటీ పద్ధతి వర్తించేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు. రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది లీవుల అంశంపై త‌గిన‌ ఆదేశాలు ఇస్తామ‌న్నారు. ఏజెన్సీ/గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల ప్రయోజనాలను నిబంధనల ప్రకారం కాపాడతామని తెలిపారు. ఏలూరు జిల్లాతో పాటు వివిధ జిల్లాల్లో నిధి పోర్ట‌ల్ లో ఉద్యోగుల వివ‌రాల న‌మోదును వెంట‌నే పూర్తి చేస్తామ‌ని చెప్పారు.

ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ నిర్ణ‌యం ప్ర‌భుత్వానిదే..

ఉద్యోగుల క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ అంశం త‌మ ప‌రిధిలో లేద‌ని, ప్ర‌భుత్వప‌రంగా దీనిపై నిర్ణ‌యం జ‌ర‌గాల్సి ఉంద‌ని కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ చెప్పారు. అలాగే 100 శాతం గ్రాస్ వేత‌నం చెల్లించాలంటే ప్ర‌భుత్వంపై ఏడాదికి రూ.331 కోట్లు అద‌నంగా భారం ప‌డుతుంద‌ని చెప్పారు. రోగుల‌కు వైద్య సేవ‌ల్లో లోపం త‌లెత్త‌కూడ‌ద‌ని, ఆందోళ‌న‌ను క‌నీసం నెల రోజుల పాటు వాయిదా వేయాల‌ని, ఈలోగా చ‌ర్చ‌లు జ‌రిపేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని రాష్ట్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ క‌మీష‌న‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు జెఎసి ప్ర‌తినిధుల‌ను కోరారు.

పీహెచ్‌సీల్లో విద్యార్థుల‌కు శిక్ష‌ణ‌పై జేఏసీ చేసిన‌ విజ్ఞ‌ప్తి మేర‌కు ఉత్త‌ర్వుల జారీ

డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) విద్యార్థులు తమ 6/12 నెలల క్లినికల్ శిక్షణలో భాగంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలపాటు వైద్య శిక్షణ పొందాలని వైద్య విద్యాశాఖ ఆదేశించింది. ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని జిల్లా వైద్య, ఆరోగ్య అధికారుల ద్వారా విద్యార్థులకు శిక్షణ కేంద్రాలను కేటాయించనున్నారు. సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి, విద్యార్థి చదువుతున్న సంస్థ సూపరింటెండెంట్ శిక్షణ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలి. ఈ ధ్రువీకరణ పత్రాన్ని నమోదు సమయంలో లేదా కోర్సు ధ్రువీకరణ పత్రం జారీ చేసే సమయంలో తప్పనిసరిగా సమర్పించాలి. ధ్రువీకరణ పత్రం సమర్పించిన తర్వాతే డాక్టర్‌ ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అనుబంధ ఆరోగ్య వృత్తి నిపుణుల మండలి ద్వారా కోర్సు ధ్రువీకరణ పత్రం జారీ చేయాలని ఉత్తర్వుల్లో డిఎంఈ డాక్ట‌ర్ విష్ణువ‌ర్ద‌న్ పేర్కొన్నారు.

Address

Velagapudi Secratiate
Amaravati
521225

Website

Alerts

Be the first to know and let us send you an email when Ministry of Health, Family Welfare & Medical Education Government Of AP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share