Telugu Desam Party: Anakapalle

Telugu Desam Party: Anakapalle Official Page of TDP Anakapalle

05/08/2026

స్వయం సహాయక సంఘాల ద్వారా 5 లక్షల మందిని ఎంటర్ ప్రెన్యూర్లుగా తయారు చేయబోతున్నాం..
60 అవుట్ సోర్సింగ్ ఏజన్సీస్ ద్వారా.. ‘స్వయం’ బ్రాండ్ ను సృష్టించి అంతర్జాతీయ మార్కెట్లోకి వెళుతున్నాం..

నా మానస పుత్రిక అయిన ఈ కార్యక్రమం ఒక పెద్ద ఉద్యమంగా ఆవిర్భవిస్తోంది..
1.15 కోట్ల మంది ఉన్న డ్వాక్రా, మెప్మాలకు అవసరమైన నైపుణ్యాలు అందించి గేమ్ చేంజర్ గా నిలుస్తున్నాం.

• రాష్ట్ర విభజన కంటే 2019–24 మధ్య జరిగిన విధ్వంసం వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తన స...
05/08/2026

• రాష్ట్ర విభజన కంటే 2019–24 మధ్య జరిగిన విధ్వంసం వల్లే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత కష్టాన్ని గత రెండేళ్లలో ఎదుర్కొన్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

• గత ప్రభుత్వ హయాంలో దెబ్బతిన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు చేపట్టిన చర్యలపై సీఎం చంద్రబాబు 46 పేజీల సమగ్ర "ప్రాజెక్టు రిపోర్టు" విడుదల చేశారు

• ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులను బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దడంలో నైతిక విలువలతో కూడిన విద్య ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు

• మంగళవారం ఒక్కరోజే కూటమి నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా 3.03 లక్షలకు పైగా ఇళ్లను సందర్శించారు. గత తొమ్మిది రోజుల్లో మొత్తం 23.63 లక్షల ఇళ్లకు చేరుకుని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు

• లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను మంగళవారం టీడీపీ ఎంపీల బృందం కలిసి "అమరావతి"పై రూపొందించిన పుస్తకాన్ని అందజేసింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఎంపీలు ఈ పుస్తకాన్ని స్పీకర్‌కు అందించారు.

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/yjlar


04/08/2026

పెండింగు బిల్లులు, ఉద్యోగులకు బకాయిలు చెల్లించుకుంటూ వస్తున్నాం..
జగన్ చేసిన అప్పుల వల్ల పడిన భారాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ వస్తున్నాం..

మన ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుకుంటూ
ఎకనమిక్ వయబిలిటీ, గ్రోత్ రేట్ పెంచడం ద్వారా వడ్డీల భారం తగ్గుతుంది..

చేనేత కార్మికులకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ ను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. వడ్డెరలకు క్వారీలు , గీత కులాలకు...
04/08/2026

చేనేత కార్మికులకు, నాయీ బ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్ ను ఇస్తోంది కూటమి ప్రభుత్వం. వడ్డెరలకు క్వారీలు , గీత కులాలకు మద్యం దుకాణాల కేటాయింపులలో రిజర్వేషన్ అమలుచేస్తోంది. బలహీన వర్గాల విద్యార్థులకు పోటీ పరీక్షల కోసం ఉచిత శిక్షణ ఇప్పిస్తోంది.


04/08/2026

గత వైసీపీ ప్రభుత్వ పాలనలో గుంతలు పడినా పట్టించుకోని వేపగుంట - పినగాడి రోడ్డును కూటమి ప్రభుత్వం నాణ్యతతో ప్రయాణానికి సురక్షితంగా తీర్చిదిద్దింది.


•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన...
04/08/2026

•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

•విశాఖపట్నంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి జీవీఎంసీ కీలక అడుగు వేసింది. మాస్కో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టింది

•టీడీపీ చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు

•అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ రెడ్డి, ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు

•అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తాను చెబుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల గురించి తప్పుడు సవాళ్లు విసురుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/28MW


03/08/2026

ఎర్ర బస్సు రాదన్నవాళ్లు అడ్రస్ లేకుండా పోయారు. ప్రధాని నరేంద్ర మోదీ సహకారంతో భోగాపురానికి ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తీసుకొచ్చాం.







03/08/2026

తల్లికి వందనం అందించిన
లోకేష్ గారికి ధన్యవాదాలు

పాతపట్నం నియోజకవర్గం మెళియాపుట్టికి చెందిన ఎం. కృష్ణవేణి ఇద్దరు పిల్లలు గతంలో సచివాలయ స్థాయిలో చోటు చేసుకున్న సాంకేతికపరమైన పొరపాటు కారణంగా ప్రభుత్వ రికార్డుల్లో చనిపోయినట్లు నమోదై ఉంది.. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం కృష్ణవేణి కుటుంబానికి అందలేదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించాలంటూ ఆమె పలుమార్లు సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. మెళియాపుట్టి తెలుగు యువత అధ్యక్షుడు సామాజిక మాధ్యమాల ద్వారా సమస్యను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి ఈ సమస్య తక్షణమే పరిష్కరించాలని తన యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. మంత్రి సిబ్బంది కృషితో సాంకేతిక పొరపాటును సరిదిద్దారు. దీంతో ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం పథకం నిధులు తల్లి ఖాతాలో జమయ్యాయి. తన సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్ గారికి, స్థానికనేతలకు కృష్ణవేణి కృతజ్ఞతలు తెలియజేసింది.


03/08/2026

జగన్ ఎర్ర బస్సు రాదన్నాడు
సీబీఎన్ గారి విజన్ ఎయిర్ బస్ దింపింది.






•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండే...
03/08/2026

•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండేళ్లలో తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. సుమారు 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా రాష్ట్రానికి రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందనుంది

•ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి కొత్త ఊపు లభించింది. క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది

•ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విమానాశ్రయంపై విస్తృత చర్చ జరగడం విశేషం

•జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన పింగళి వెంకయ్య దేశభక్తిని ప్రజల్లో పెంపొందించి, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు

•రాష్ట్రానికి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QoDpO


Address

Anakapalle

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Anakapalle posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Anakapalle:

Shortcuts

Share