12/08/2025
* చంద్రబాబు నాయుడు మోసాల వల్ల మీకు కలిగిన నష్టం ఎంత ? *
*అలీషేర్ ఇసాక్ 43 వ డివిజన్ కార్పొరేటర్*
*అనంతపురం*
ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని 43 వ డివిజన్ కార్పొరేటర్ అలీషేర్ ఇసాక్ మరియు వైఎస్ఆర్సిపి నాయకులు ప్రశ్నించారు.నగర పరిధిలోని 43వ డివిజన్ లో బాబు షూరీటి మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా ఇంటింటా పర్యటించి క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయించి చంద్రబాబు చేసిన మోసపూరిత హామీలను ప్రజలకు వివరించారు.ఈ సందర్భంగా ఎన్నికలపుడు సూపర్ సిక్స్, మ్యానిఫెస్టో విడుదల చేసి అధికారంలోకి వచ్చాక, తొలి ఏడాది పూర్తిగా ఎగరగొట్టి రెండో యేడాది అరకొరగా అమలు చేస్తూ ప్రజలను మోసం చేశారని విమర్శించారు.బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా తాము ప్రజల వద్దకు వెళ్తుంటే వైసీపీ హయాంలోనే తమకు సంక్షేమ పథకాలు బాగా అందేవని,రెట్టింపు పథకాలు ఇస్తామని కూటమి నేతలు చెపితే ఓటువేసి మోసపోయామని ప్రజలు చెపుతున్నారన్నారు.కార్యక్రమంలో వైయస్సార్ సిపి నాయకులు బాగేపల్లి కిషోర్ బాబు, ధను బాబు, అబ్దుల్ సుకుర్, వడ్డే నవీన్, వడ్డే గణేష్, బోయ నరేంద్ర, వడ్డే పార్థసారథి, వడ్డే యశ్వంత్, తయుబ్, జెస్సు, సాయి, నంది తదితరులు పాల్గొన్నారు.