Anantapur people

Anantapur people for people of anantapur

Country India
State Andhra Pradesh
Region Rayalaseema
District Anantapur district
Elevation 335 m (1,099 ft)
Population (2011)[1]
• City 562,340
• Metro[2] 341,895
Languages
• Official Telugu
Time zone IST (UTC+5:30)
PIN 515001
Telephone code 08554
Vehicle registration AP02

Collection.
16/10/2019

Collection.

25/05/2016
ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించిన ఓ కుర్రాడు… పోలీసుల చేతిలో చావుదెబ్బలకు  తినాల్సివచ్చింది. అతనిని నుండి డబ్బులు లాగడానిక...
16/02/2016

ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నించిన ఓ కుర్రాడు… పోలీసుల చేతిలో చావుదెబ్బలకు తినాల్సివచ్చింది. అతనిని నుండి డబ్బులు లాగడానికి నా ఎదపై భాగంలో చేయి వేశాడని ఓ మహిళా పోలీసే స్వయంగా కేసు నమోదు చేసింది. ఫైన్ ఎందుకు కట్టాలో చెప్పండి అన్నందుకు 5 గురు పోలీసులు విచక్షణా రహితంగా కొట్టారు. ఇదంతా ఎందుకు ? ఎలా జరిగిందో ఆ కుర్రాడి మాటల్లోనే విందాం.

“నా ఆఫీస్ పనుల విషయమై నేనెప్పుడూ చైనా ప్రయాణం చేస్తుంటాను. చైనా ప్రజల గౌరవం,వారి అలవాట్లు, వారు అవలంబించే నూతన విధానాలు నన్ను ఆకర్షించాయి. అందులో ఎలక్ట్రిక్ సైకిల్ ఒకటి. దీన్ని చేతులతో పట్టుకువెళ్ళేలా మడిచి తీసుకువెళ్ళవచ్చు. అక్కడి ప్రజలు దీన్ని కొద్ది కొద్ది దూరాలకు వాహనాలకు బదులుగా, పొల్యూషన్ రహితంగా వాటిని ఉపయోగిస్తున్నారు.
అటువంటి సైకిల్ మనం కూడా ఉపయోగిస్తే బాగుంటుందది కదా అని బెంగళూర్ రాగానే డెకాథ్లన్ సైకిల్ స్టోర్ లో BTWIN HOPTOWN సైకిల్ తీసుకున్నాను. వెంటనే ఆ సైకిల్ తీసుకొని నడపడం మొదలుపెట్టాను. 9/2/16 ఇంటికి తీసుకెళ్లడానికి కేఆర్ పురం నుండి బెంగళూర్ కంటోన్మెంట్ కు సిటీ రైలుల బయలుదేరాను. రైలు ఎక్కిన కొద్దిసేపటి తర్వాత లేడీ చెకింగ్ ఆఫీసర్ వచ్చి, సైకిల్ ఎక్కించినందుకు జరిమానా కట్టమని చెప్పింది. ఇది చాలా తక్కువ బరువు ఉంది, దీన్ని చేతులతో పట్టుకోవచ్చు, 14 కేజీల బరువు మాత్రమే ఉంది అని చెప్పాను. ఇలా చెప్పినా సరే, ఆమె ఆరుసార్లు నన్ను జరిమానా కట్టవలసిందిగాపట్టుబడింది. నేనేం తప్పు చేయలేదు, టికెట్ కొని ప్రయాణం చేస్తున్నాను, అత్యధిక బరువు, ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఎటువంటి పెద్దవస్తువులు తీసుకువెళ్ళడం లేదు. అందుకని రైల్వే నిబంధనల ప్రకారం లగేజీ ఎంత ఉంటే జరిమానా విధించాలో చెప్పండి అని ఆమెను అడిగాను. వెంటనే నా దగ్గర ఉన్న పాస్ తీసుకొనినన్ను అరగంట సేపు అలా నిలబెట్టి వెయిట్ చేయించింది. అయితే తనకు లగేజీ రూల్స్ తెలియవు. కేవలం నా దగ్గర నుండి డబ్బులు గుంజడానికే అని అర్థమైంది. అప్పటికే నాకు చాలా ఆలస్యం అయింది. రూ.60 లతో టికెట్ కొన్నాను, ఇంకా రూ.100 నా దగ్గర ఉన్నాయి. అయితే ఆమె మాత్రం నా నుండి రూ.300 కచ్చితంగా ఇచ్చి తీరాలని పట్టుబడింది.
12662510_1207486019280951_2413154231732698691_n
అయితే మీరు నాకు రూ.1000 జరిమానా విధించినా సరే, నాకు అందుకు సంబంధించిన రిసిప్ట్ ఇస్తేనే డబ్బులు కడతాను లేదంటే లేదని తెగేసి చెప్పాను. అయితే ఆమె మాత్రం డబ్బులు అడుగుతోంది, ఆ రూల్స్ ఈ రూల్స్ చెబుతోంది కానీ రిసిప్ట్ గురించి లేదా లగేజీ రూల్స్ గురించి చెప్పడం లేదు. అప్పటివరకూ ఎంతో సహనంగా ఎదురుచూసిన నేను, ఆమె అవినీతి గురించి ప్రశ్నించాను. అలా అడిగినందుకు నన్ను చెంపదెబ్బ కొట్టి, పక్కకు తోసింది. రైల్వే స్టేషన్ లో ఉన్న రైల్వే పోలీసులను పిలిచి, తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నానని చెప్పింది. ఆ లేడీ ఆఫీసర్ తో అసభ్యంగా ప్రవర్తించానని పోలీసులు నాపై కేస్ బుక్ చేశారు. అందులో ఒక కానిస్టేబుల్ కొట్టడం ప్రారంభించాడు. కొద్దిసేపటి తర్వాత మరో 5 పోలీసులు వచ్చి ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళతో తంతున్నారు, చేతులతో పిడిగుద్దులు గుద్దుతున్నారు. ఇక ఈ రోజు నన్ను చంపేసి, నా శవాన్ని కనిపించకుండా మాయం చేస్తారని అర్థమైంది. అంతగా హింసించారు. ఆ హింసలకు తట్టుకోలేక సార్.. ప్లీజ్ సార్ క్షమించండి, వదిలేయడంని వేడుకున్నాను. అందులో ఒక పోలీస్ అయితే రూ.5000 డబ్బులివ్వు.. విడిచిపెడతాం అన్నాడు. నీకు తెలిసిన వారు లేదా నీ స్నేహితులను డబ్బులు తీసుకురమ్మని చెప్పమన్నాడు ఆ అధికారి.
12687797_1207485979280955_5643442393680009828_n
వెంటనే నా మేనేజర్ హరీష్ హస్వానికి ఫోన్ చేసి డబ్బులు తీసుకొని రమ్మన్నాను. తనతో పాటు ఇద్దరు ఆఫీస్ కొలీగ్స్ రైల్వే పోలీస్ స్టేషన్ కు వచ్చారు. గంటకు పైగా ఆ ముగ్గురు పోలీసులతో మాట్లాడి, వారిని బ్రతిమలాడి డబ్బులు చేతిలో పెట్టారు. అయితే నాపై పెట్టిన కేసులో ఆ లేడీ ఆఫీసర్ తో అసభ్యకరంగా ప్రవర్తించానని, ఆమె ఎదపై చేతులు వేశానని చెప్పారు. చేయనిపనిని సిగ్గులేకుండా డబ్బుల కోసం ఒక మహిళ ఇంతలా దిగజారినందుకు తనపై తాను నిందవేసుకున్నందుకు అసహ్యం వేసింది. ఛీ.. ఇంత నీచానికి దిగజారారు మన అధికారులు అని వారిపై ఆవేశం వచ్చింది. డబ్బులు కట్టాక, లేడీ ఆఫీసర్ సైకిల్ కు రూ.190 జరిమానా విధించింది. అలాగే నేను టికెట్ లేకుండా ప్రయాణం చేశానని అందుకు ఫైన్ వేసింది. నిజానికి ఆ ట్రైన్ పాస్ తన దగ్గరే ఉంది. నాకు ఇచ్చిన రిసిప్ట్ బిల్ లో 8/2/16 అని ఉంది, నేను ప్రయాణం చేసింది 9/2/16. ఇలా ప్రతి సంఘటన వెనుక వారి తప్పు ఉంది కానీ ఆ క్షణం అక్కడి నుండి బయటపడటం ముఖ్యమని నేను, నా మంచి కోరేవారు ఎవరూ వాటి గురించి అడగలేదు.
railway
ఇక అక్కడి నుండి బయటకు వచ్చాక నా స్నేహితుడు సర్ఫరాజ్ నన్ను హాస్పిటల్ కు తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకున్నాడు. వాళ్ళు కొట్టిన దెబ్బలకు నా ఎడమచేయి విరిగింది. ఇంకోసారి ఆ రైళ్ళలో ప్రయాణం చేయకూడదని నిశ్చయించుకున్నాను, నేను కొన్న ఆ సైకిల్ ను ఇక ముట్టుకోనేలేదు. ప్రతి క్షణం ఒక నరకంలా ఆ బాధ గుర్తుకువస్తోంది. ఏ పనీ సక్రమంగా చేయలేకపోతున్నాను, కాన్సంట్రేషన్ చేయలేకున్నాను. అయితే అనుకోకుండా నా మొబైల్ లో లేడీ ఆఫీసర్ తో మాట్లాడినది, పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మధ్య జరిగిన సంభాషణ అంతా వాయిస్ రికార్డ్ అయింది. ఇంకా రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాలలో ఫుటేజ్ కూడా ఉంది,. అప్పుడే అనుకున్నాను ఈ అవినీతి అధికారులకు ఒక గుణపాఠం చెప్పాలని. అందుకే ప్రతి ఒక్క ఉన్నత అధికారికి నాకు జరిగిన సంఘటన గురించి ఆ అధికారులు తీరు గురించి లేఖ రాసి, ఇటువంటి మళ్ళీ జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదేనని, అలాంటి వాళ్ళను ఎంకరేజ్ చేయవద్దని కోరాను.చూద్దాం ఏం జరుగుతుందో..”
- See more at: http://telugu.ap2tg.com/your-choice/railway-police-vs-a-common-man/ .O8HQJ8c9.dpuf

నాపై పెట్టిన కేసులో ఆ లేడీ ఆఫీసర్ తో అసభ్యకరంగా ప్రవర్తించానని, ఆమె ఎదపై చేతులు వేశానని చెప్పారు

నాన్న......
17/12/2015

నాన్న......

😂😂😂
17/12/2015

😂😂😂

17/12/2015

అధిక వడ్డీకి డబ్బులు తీసుకొని ఎగ్గోట్టండి. దేశ సేవలో తరించండి. ఎలాగంటే…!
callmony
“కాల్ మనీ” ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేస్తున్న వ్యవహారం ఇపుడు. లక్షలకు లక్షలు, కోట్లకు కోట్లు వడ్డీల రూపంలో వసూలు చేస్తూ, ఒకవేళ కట్టలేకపోతే బార్యనో, కుతురినో, చివరకు ఎవ్వరినయిన పడుకో పెట్టాలి, లేదా వాళ్ళే పడుకో పెట్టి డబ్బు వసూలు చేసుకుంటారు. క్లుప్తంగా చెప్పాలి అంటే ఇది “కాల్ మనీ” గురించి , అధిక వడ్డిలకు డబ్బులు ఇచ్చి ప్రజల రక్తాలనే కాదు, చివరకు మాన ప్రాణాలను కూడా తీసేస్తున్న వడ్డీ వ్యాపారుల గురించి.
వీళ్ళ రాక్షసత్వం ఎంతల బరితేగించింది అనడానికి కొన్ని వేల ఉదాహరణలు. అందులో తాజాగా జరిగిన ” కాల్ మనీ ” వ్యవహారం లో ఒక ఉదాహరణనే తీసుకుంటే…
” ఒక ఆవిడ అవసరం కోసం లక్ష రూపాయలను అప్పుగా తీసుకుంది. వడ్డీ ఎంతో తెలుసా, రోజుకు రెండు వేలు. రెండు రోజుల్లో వస్తుంది అనుకున్న డబ్బు చేతికి రాలేదు, కాని ఈమె మాత్రం రోజుకు రెండు వేలు కడుతూనే ఉంది. మధ్యలో కొన్ని రోజులు కట్టలేక పోతే, ఈ రాక్షసులు పెట్టిన టార్చర్ కి ఆవిడ చెల్లెలు ష్యురిటీ కింద చెక్ ఇచ్చింది. అలా వీరు మొత్తం 9 లక్షలు చెల్లించిన తరువాత కూడా వదలని దుర్మార్గులు ఇద్దరికీ చెక్ లను మళ్లీ బ్యాంకు లో డిపాజిట్ చేసి, చెక్ లను బౌన్స్ చేసి, కోర్ట్ లో కేసు వేసి, కోర్ట్ ల చుట్టూ తిప్పుతున్నారు.”
ఇలాంటివి ఒక్కటే కాదు, చాలానే ఉన్నాయి. వీళ్ళ టార్చర్ పడలేక ఊర్లు వదిలి పోయిన కుటుంబాలున్నాయి, తల్లితండ్రులను వదిలేసి పారిపోయిన కొడుకులున్నారు, తల్లి తండ్రుల బాధలను చూడలేక వారి వద్ద పడుకున్న కుతుర్లున్నారు, భర్తల బాధల పరిష్కారం కోసం ఇంకొకడి పక్క పంచిన బార్యలున్నారు. ఎలాగయితేనేం…. అందరు ఈ రాక్షషుల బాధితులే. ఇందులో గగుల్పోడిచే విషయమేంటంటే…. ఈ మొత్తం వ్యవహారంలో కీలక పాత్రధారులు, ఎంఎల్ఏ లు, పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు.
మరి ఈ వ్యవహారంలో ఎన్ని రోజులు మీడియా కాని, పోలీసు లు కాని హడావిడి చేస్తారో, ఎంత మందిని శిక్షిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అతిత్వరలో దీనికి ముగింపు కార్డు వేసి, చేతులు దులిపేసుకుంటారు.
ఈ వ్యవహారం ఒక్క విజయవాడ కె పరిమితం కాదు, రెండు తెలుగు రాష్ట్రలల్లోను ఇలాంటి వ్యవహారాలు సాగుతూనే ఉన్నాయి. ఇందుకు పోలీస్ లు, ప్రజాప్రతినిధులు వారికి కావాల్సిన వాటాలు వారు తీసుకొని, ఇలాంటి దుర్మార్గులను రక్షిస్తునే ఉన్నారు. అందుకు తాజాగా జరిగిన “కాల్ మనీ ” వ్యవహారమే కాకుండా, ఇంతకు ముందు “వరంగల్” లో జరిగిన పోలీస్ ” మోహన్ రెడ్డి” వడ్డీల దందా కూడా ఇలాంటిదే.
అసలు ఈ అధిక వడ్డీల దందా అన్నదే అక్రమం, చట్టానికి వ్యతిరేకం కూడా. ఎవరు ఏ విధంగా అయిన కూడా, డబ్బు తో డబ్బు వ్యాపారం చెయ్యాలి అంటే… ప్రభుత్వాల, రాజ్యాంగ సంస్తల( అర్.బి.ఐ లాంటివి ) అనుమతి తప్పనిసరి. అవి బ్యాంకు లు కావొచ్చు, చిట్ ఫండ్ కంపెనీ లు కావొచ్చు, స్వయం సేవక సంఘాలు కావొచ్చు, మరేదైనా కావొచ్చు. డబ్బులు ఇచ్చి దానిమీద వడ్డీ వ్యాపారం చెయ్యాలి అంటే, ప్రభుత్వ నిభందనలకు లోబడే వడ్డీ వసూలు చెయ్యాలి. అలా అనుమతి లేకుండా వడ్డీ వ్యాపారం చేసినా, అధిక వడ్డీలు వసూలు చేసిన కూడా చట్ట ప్రకారం శిక్షార్హులు.
అంతే కాకుండా ఇలా అధిక వడ్డీకి వసూలు చేసే డబ్బు మొత్తం “బ్లాక్ మనీ ” కింద చెలామణి అవుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇలా అక్రమంగా అధిక వడ్డీలతో వ్యాపారాలు చేసి, సక్రమంగా ప్రభుత్వాలకు టాక్స్ లు కట్టరు. కనుక ప్రజలారా ఆలోచించండి… ఒకవేళ అధిక వడ్డీకి మీరిప్పటికే ఎవరిదగ్గరైన అప్పు తీసుకొని ఉంటె దయచేసి వారికి కట్టకండి. వారి అసలు మాత్రమె ఇచ్చేయండి. ఇప్పటికే వడ్డీ అసలు కంటే ఎక్కువగానే కట్టింటే, దయచేసి అసలు కూడా చెల్లించకండి. అలా చెల్లిస్తే మీరు దేశానికి అన్యాయం చేసిన వారు అవ్వడమే కాకుండా, ” కాల్ మనీ ” లాంటి రాక్షసులని ప్రోత్సహించిన వారవుతారు.
మరి వడ్డీలు ఇచ్చిన వాళ్ళు ఇంటి చుట్టూ తిరుగుతుంటే, పరువు, మానం, మర్యాద పోదా అని మాత్రం దయచేసి ఆలోచించకండి. చట్ట వ్యతిరేక పనులు చేస్తున్న వాళ్ళు నిజంగా పరువు, మర్యాద లేని వాళ్ళు, మీరు కాదు. అంతేకాకుండా మీరు చట్ట వ్యతికేలను అడ్డుకొని దేశ సేవ చేసిన గోప్పవాల్లుగా ఫీల్ అవ్వండి.
ఒకవేళ తప్పని పరిస్థితుల్లో తీసుకోవాల్సి వస్తే అధిక వడ్డీకి కాకుండా, చాల తక్కువ నామమాత్రపు వడ్డీకి మాత్రమె తీసుకోండి.
మనం ఇలా చేస్తే రేపు మనకు డబ్బు అవసరమయితే ఎవరిస్తారు అని మాత్రం ఆలోచించకండి. ఎందుకంటే అలా ఇవ్వడం కోసమే ప్రభుత్వాలు కొన్ని సంస్తలకు అనుమతి ఇచ్చి చట్ట ప్రకారం బిజినెస్ చేయిస్తున్నాయి. వారెక్కడ ఇస్తారు అప్పులు, ఇవ్వాలంటే సవా లక్ష ప్రశ్నలు అడుగుతారు అంటే, అలా అడిగే వారిని నిలదీయండి, ఎందుకంటే ఇవ్వాల్సిన కనీస బాధ్యత వాళ్ళ మీద ఉంది. అంతే కాకుండా ప్రజల కనీస అవసరాలు తీర్చడం ప్రభుత్వాల భాద్యత. అందుకే మనం వోట్ వేసి మన ప్రభుత్వాలను మనమే ఎన్నుకుంది.
ఒకవేళ ప్రభుత్వాలు మన అవసరాలు తీర్చలేకపోతే… మన కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం, మనం నమ్మిన రాజకీయ పార్టీ కోసం, నాయకుల కోసం, సినిమాలలో దెబ్బతిన్న మన కుల/మత/ప్రాంత ఆత్మ గౌరవం కోసం ఎలా అయితే రోడ్ ల మీదకొచ్చి పోరాటాలు చేస్తామో, మన కనీస
అవసరాలు, హక్కుల కోసం కూడా అలానే పోరాటాలు చెయ్యడం మన కనీస భాద్యత అని తెలుసుకోండి.
కనుక ప్రజలారా ఆలోచించండి. అధిక వడ్డీకి తీసుకున్న డబ్బులు ఎగ్గొట్టి సేవ చేసి, అక్రమార్కుల ఆట కట్టించండి. అలాగే మేధావుల్లారా మీరు కూడా ఇటువంటి వాటి గురించి అలోచించి ప్రజలను చైతన్యం చేసి, వారి మాన ప్రాణాలను రక్షించండి. అలాగే తక్కువ నామమాత్రపు వడ్డీ వసూలు చేసే వారిని ప్రోత్సహిస్తూ, అధిక వడ్డీ కి ఇచ్చే వారి దగ్గర అదే అధిక వడ్డీ ఆశ చూపి, డబ్బులు తీసుకొని, మీ అవసరాలకు వాడుకొని, తరువాత వారి అసలు మాత్రమె తిరిగివ్వండి. వీలైతే నామత్రపు వడ్డీ మాత్రమే చెల్లించండి.

13/12/2015

పెట్రోలు రూ.40కి రాదేం..?
అంతర్జాతీయంగా ఏడాదిలో 40 శాతం తగ్గిన చమురు ధర
► అదే రీతిలో ఇక్కడా తగ్గిస్తే లీటరు రూ.40
► ప్రస్తుత ధర రూ.65; తగ్గింది 0.5-2 శాతమేతగ్గిన ప్రయోజనమంతా రిఫైనరీలు; ప్రభుత్వాల జేబుల్లోకే అంతర్జాతీయంగా మరింత పతనం
► ప్రస్తుతం 36 డాలర్ల దిగువకు...

2010లో పెట్రోల్‌పై సబ్సిడీని ఎత్తివేసిన కేంద్రం... 2014లో సరిగ్గా సమయం చూసి నొప్పి తెలియని మరో దెబ్బ కొట్టింది. నిజానికి డీజిల్ ధర పెరిగితే దేశంలో తీవ్రమైన ఆందోళన రేగేది. ఎందుకంటే దాని ప్రభావం రవాణాపై ఉంటుంది కనక... ఫలితంగా నిత్యావసరాలతో సహా అన్నీ పెరుగుతాయి. కాకపోతే 2014లో అంతర్జాతీయంగా చమురు ధర తగ్గుతున్నపుడు... కేంద్రం ఠక్కున సబ్సిడీని ఎత్తేసింది.

మన మార్కెట్ ధరల్ని అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా వదిలేసింది. కాకపోతే అప్పుడు ధరలు తగ్గుతున్న తరుణం కనక కేంద్రం చర్యతో డీజిల్‌పై అర్ధరూపాయి నుంచి రూపాయి మధ్య ధర తగ్గింది తప్ప పెరగలేదు. దీంతో జనం కూడా ధర పెరగలేదు కదా!! అని ఊరుకున్నారు. ప్రభుత్వం అదృష్టం బాగుంది. డీజిల్‌పై సబ్సిడీ తొలగించిన నాటి నుంచీ అంతర్జాతీయంగా దాని ధర తగ్గుతున్నదే తప్ప ఎన్నడూ పెరగలేదు. కానీ మార్కెట్లో ధర మాత్రం ఆ స్థాయిలో తగ్గటం లేదు. అదీ విచిత్రం.

ఇదీ... ధరల తీరు
ఉదాహరణకు 2014 డిసెంబర్ తొలి పక్షంలో ఇండియన్ బాస్కెట్ క్రూడ్ సగటు ధర బ్యారెల్‌కు రూ.4,558. (డాలర్లలో 67.24. అప్పట్లో మారకపు విలువ రూ. 63.34). మళ్లీ ఈ సంవత్సరం నవంబర్ రెండో పక్షం వచ్చేసరికి ఇండియన్ బాస్కెట్ క్రూడ్ బ్యారెల్ సగటు ధర ఏకంగా రూ.2,725కు పడిపోయింది. (డాలర్లలో 41.17, మారకపు విలువ రూ.66.21). ఈ సగటు ధరను పరిగణనలోకి తీసుకుని ఈ నెల 1న కేంద్రం స్వల్పంగా పెట్రోల్ ధరను తగ్గించిన సంగతి తెలిసిందే. కేంద్ర పెట్రోలియం శాఖ తన వెబ్‌సైట్‌లో ప్రకటించిన ఈ అంతర్జాతీయ క్రూడ్ దిగుమతి ధర ప్రకారం... ఏడాది కాలంలో చమురు ధర 40 శాతం పడిపోయింది. కానీ ఢిల్లీ పెట్రోల్ బంకుల్లో మాత్రం లీటరు ధర 4 శాతం లోపే తగ్గింది.

ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలోనైతే తగ్గింది 2 శాతంలోపే. ఆంధ్రప్రదేశ్‌లో మరీ ఘోరం. ఇక్కడ తగ్గింది కేవలం అరశాతం. ఇలా... క్రూడ్ ధర తగ్గుదల ప్రయోజనంలో కొంత పెట్రో రిఫైనరీలు తీసేసుకుంటుంటే, అగ్రభాగాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాగేసుకుంటున్నాయి. నిజానికి అంతర్జాతీయంగా మన ధర 40 శాతం తగ్గింది కనక... అది నేరుగా వినియోగదారుకు బదలాయిస్తే బంకుల్లో లీటరు పెట్రోలు దాదాపు 40 రూపాయలకు విక్రయించాలి. కానీ రూ.65కు విక్రయిస్తూ ఆ ప్రయోజనాన్ని ప్రభుత్వాలే లాక్కుంటున్నాయి.

పదేళ్లలో ఇదే కనిష్ఠ ధర!!
ఇండియా దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధర తాజాగా పదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. అంటే 2004లో ఉన్నప్పటి ధరతో సమానమయింది. అయితే బంకుల్లో 2004లో లీటరు పెట్రోల్ రూ.40కి దొరికేది. కానీ ఇపుడు రూ.65 వరకూ ఉంది. అంటే రిటైల్ ధర 60 శాతానికన్నా ఎక్కువ పెరిగిందన్న మాట. ఈ పదేళ్లలో రూపాయి మారకపు విలువ క్షీణించడం, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు ఎత్తేయడం ఈ ధరలు పెరగటానికి కొంత కారణం కాగా... విపరీతంగా పన్నులు పెంచేయడం మరో ప్రధాన కారణం.

దీనికితోడు రిఫైనరీలకు కూడా మార్జిన్లు భారీగా పెరిగాయి. 2014లో ఒక బ్యారల్ క్రూడ్‌ను శుద్ధి చేస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు 6 డాలర్లు లాభం వచ్చేది. అది 2015లో 10 డాలర్లకు పెరిగి పోయింది. అంటే... తగ్గిన క్రూడ్ ధరలో 4 డాలర్ల వరకూ ఈ రిఫైనరీల ఖాతాల్లోకి పోతోందన్న మాట. దీనర్థం... మొత్తం ధర 40% వరకూ తగ్గితే అందులో 10% వరకూ రిఫైనరీల జేబుల్లోకి పోతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మరింత వాత...
రాష్ట్రాలు కూడా తక్కువ తినలేదు. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాలు రెండూ ఈ ఏడాది పెట్రోల్, డీజిల్‌పై అమ్మకపు పన్నును రెండు దఫాలు పెంచేశాయి. గతేడాది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండింటా పెట్రోల్, డీజిల్‌పై 31% పన్ను వుండేది. ఆ మధ్య రెండు రాష్ట్రాలు లీటరుపై రూ.2 చొప్పున అదనంగా వ్యాట్‌ను వడ్డించాయి. తర్వాత నెలల్లో తెలంగాణ ప్రభుత్వం రూ. 2ను తొలగించి 31% పన్నునే 35.20 శాతానికి పెంచింది.

ఏపీ ప్రభుత్వం మాత్రం మరో రూ.2 కలిపి మొత్తం రూ.4 అదనపు వ్యాట్‌ను వడ్డిస్తోంది. దీంతో వ్యాట్ రూపంలో ప్రస్తుత ధరపై తెలంగాణ ప్రభుత్వం రూ.17.09 వసూలుచేస్తుండగా, ఏపీ ప్రభుత్వం రూ.19.05 (31%+రూ.4) పిండుకొంటోంది. అందుకే గత 12 నెలల్లో హైదరాబాద్‌లో పెట్రోల్ ధర రూ. 67.02 నుంచి రూ. 65.61కి తగ్గగా, విజయవాడలో మాత్రం ఇది రూ. 66.68గా ఉంది.

ఏడాది కిందట హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.67.02. ఇప్పుడు రూ.65.65
హమ్మయ్య! ధరలన్నీ ఆకాశాన్నంటుతున్నపుడు ఇది కాస్తయినా తగ్గింది కదా అని సంతోషించాలా?
అలాకాకుండా దాదాపు రూ.40 వద్ద విక్రయించాల్సిన పెట్రోలును రూ.65 అమ్ముతున్నారని బాధపడాలా?
తగ్గించాల్సినంత తగ్గించకుండా ప్రభుత్వాలన్నీ కలిసి మనల్ని దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేయాలా?
బాధపడాల్సిందే. ఆవేదన వ్యక్తం చేయాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతూ వచ్చినపుడు ఆ భారాన్ని నేరుగా మనపైనే వేసిన ప్రభుత్వాలు... రేపు మళ్లీ ధరలు పెరిగితే ఈ రేట్లను మరింత పెంచవనే గ్యారంటీ ఏమీ లేదు. పెపైచ్చు ఇపుడక్కడ దారుణంగా పతనమవుతున్నా ఆ తగ్గింపును మనకు బదలా యించటం లేదు. పన్నులు పెంచి తమ ఖజానా నింపుకొంటున్నాయి. ఈ దోపిడీని వివరించే ప్రత్యేక కథనం...

కేంద్రం అదనపు బాదుడు రూ. 7
మార్కెట్‌తో ధరల్ని లింకు చేస్తున్నామంటూ గొప్పలుపోయిన ప్రభుత్వం పెట్రోల్ ధరను తగ్గించాల్సిన పలు సందర్భాల్లో ఎక్సయిజ్ సుంకాన్ని పెంచేసింది. కేంద్రం ఎక్సయిజు సుంకం, సెస్‌లతో కలిపి గత నవంబర్‌లో లీటరు పెట్రోల్‌కు రూ.11.02 వసూలు చేయగా, ఇప్పుడది ఏకంగా రూ.19.06కు చేరింది. ఇంత వేగంగా పెట్రో సుంకాల్ని గతంలో ఏ ప్రభుత్వమూ పెంచలేదు. ఈ పెంపుతో డీలరు ధరపై కేంద్ర ఎక్సయిజు సుంకం, సెస్‌లు కలిపి 70%కి చేరాయి. 2004లో కేంద్ర ఎక్సయిజు సుంకం 23 శాతమే.

మగవారు మధ్యం కొనేటప్పుడు వందల్లో రేట్లు ఉన్నా బేరాలు ఆడరు ..ఆరోగ్యాన్ని పాడు చేసే మధ్యం, సిగిరెట్స్,  ఎంత రేటైన కొనేస్తా...
13/12/2015

మగవారు మధ్యం కొనేటప్పుడు వందల్లో రేట్లు ఉన్నా బేరాలు ఆడరు ..ఆరోగ్యాన్ని పాడు చేసే మధ్యం, సిగిరెట్స్, ఎంత రేటైన కొనేస్తారు ......
ఆడవారు బ్యూటీపార్లర్ కు రేట్లు వందల్లో ఉన్నా బేరాలు ఆడరు..ఫేస్ క్రీమ్ లు ఎంత రేట్ ఉన్న దాని మీద ఉన్న రేటుతోనే కొనేస్తారు... ...
కాని మార్కెట్ కి వెళితే మాత్రమ్ మగవారైన, ఆడవారైన,..మన ఆరోగ్యాన్ని కాపాడే కూరగాయలు
గంపల్లో అమ్ముతున్న వారి దగ్గర మాత్రం బేరాలు ఆడుతారు ...
వందల్లో ఖర్చుచేస్తున్న మీకు రైతులు పల్లెల నుండి వచ్చి కూరగాయలు అమ్ముతున్న వారిదగ్గర బేరాలు ఆడకుండా కొనలేర ...ఆలోచించండి ఫ్రెండ్స్
వయసు మీద పడిన నడవలేని స్తితిలో ఉన్న, ఆత్మవిశ్వాసంతో కష్టపడి బ్రతుకుతున్న వారి దగ్గర రూపాయి రెండు రూపాయల దగ్గర బేరాలు ఎందుకు ఆడటం....
మనం ఇచ్చే రూపాయి రెండురూపాయలతో వారు మిద్దెలు మేడలు కట్టరు ఒంకో పూట కడుపునిండా అన్నం తింటారు.......
మనం ఎంతో దుబారా ఖర్చులు పెడుతుంటాం వందలు వేలల్లో...
అలాంటి వారి దగ్గర ఐదు రూపాయలకు పది రూపాయలకు బేరాలు ఆడితే మనం మనుషులమే కాదు
వారి కన్న పిల్లలు వారిని వదిలేశారు..
వారు ఆత్మాభిమానం వదులుకుని అడుక్కుని తినకుండా కష్టపడి బ్రతుకుతున్నవారికి మనచేతనైనంత ఈ చిన్ని ప్రోత్సాహం కూడా ఇవ్వకపోతే
ఈ సమాజంలో మానవత్వమన్న మాటకి అర్దమేలేదు
ఎవరిని కించపరచాలని కాదు ..
ధయచేసి ఆలోచించండి ఫ్రెండ్స్......

మాది రాయలసీమ... =============రాగిసంగటి మాది.. రాళ్ల సేద్యం మాది.. సజ్జ.. జొన్న.. కొర్ర ఏదైన సంగటని.. ఎరిగినోడికే తెలుసు....
09/12/2015

మాది రాయలసీమ...
=============

రాగిసంగటి మాది..

రాళ్ల సేద్యం మాది..

సజ్జ.. జొన్న.. కొర్ర ఏదైన సంగటని..

ఎరిగినోడికే తెలుసు.. యెర్రోడికేం తెలుసు.

తాత తండ్రుల నుంచి తరతరాల నుంచి.

సీమకే ఎరుక మరి.. సిటీయోడికేమెరుక.

డాబు మాటలు తప్ప దమ్మిడీకి పనికిరాని

పట్నమోడంటే మాకు పట్టలేని చతురు..

ఆవు.. గేదెలేవైనా మనుషులే మా ఇంట..

వేరులేదు మూగజీవాలకూ మాకు..

పశుభాషతో మేమూ పలకరించుతాము.

పాడియావునైన.. సేద్యపెద్దునైనా..

మీసాలు మెలిదిప్పె రోషమే ఆభరణం..

పసిడి ఉంగరపువేలైన పేడనెత్తుట మా నైజం.

రాయలేలాడో లేదో ఎరుక లేదు కాని.

రాజసం మా నడక.. రామచంద్రుడి లెక్క.

కాపోడు కాడెత్తు.. కూలోడు పనిబట్టు..

కలిసి తినడం తప్ప కులము పట్టింపులేదు..

వావి వరసల మసులు ధనికుడైన పేద దళితుడైనా..

అయ్య.. మామ.. అనుచు.. అత్త.. పెద్దమ్మనుచూ.

నోరార పిలుచుకొనే పల్లె గడపలు మావి..

అన్నమని అడిగితే లేదనదు మా గడప.

గొడ్డు కారమైన ముద్దపైనేసి...

కడుపు నింపుట తెలుసు కల్మషము లేకుండ.

(ఇదీ మా రాయలసీమ.. రతనాల కరువుసీమ)
సేకరణ :భాస్కర్ రెడ్డి గారి నుంచి...

Address

Anantapur

Telephone

8122960313

Website

Alerts

Be the first to know and let us send you an email when Anantapur people posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share