AHUDA

AHUDA Official Account of Ananthapuramu Hindupur Urban Development Authority

*అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి*- *: అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి*అనంతపురం, మార్చి 12 :- *అనంతపురము - హింద...
12/03/2026

*అహుడ గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలి*

- *: అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి*

అనంతపురం, మార్చి 12 :

- *అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో వస్తున్న గ్రీవెన్స్ త్వరితగతిన పరిష్కరించాలని అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డి ఆదేశించారు. గురువారం నగరంలోని అహుడ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించి అర్జీలను స్వీకరించారు.*

- *ఈ సందర్భంగా నారాయణపురం పంచాయతీలో ఎలైట్ అపార్ట్మెంట్ లో పార్కింగ్ స్థలాన్ని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అర్జీ అందించారు. మార్ట్ గేజ్ పరిశీలన చేయాలని అర్జీ అందించారు. ఉప్పరపల్లిలో అనధికార లేఅవుట్ లో భవనం కడుతున్నారని, కక్కలపల్లి ఎల్ఆర్ఎస్ ఓపెన్ సైట్ ని వారిఫై చేయాలని, ఎల్ఆర్ఎస్ అప్రూవల్ కావాలని అర్జీలు సమర్పించగా, అర్జీలను వేగంగా పరిష్కరించాలని అహుడ సెక్రటరీ ఆదేశించారు. పరిగి చుట్టుపక్కల పరిధిలో అనధికార లేఅవుట్లపై ప్రత్యేక డ్రైవ్ లు వేసి తనిఖీలు చేయాలని ఆదేశించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పిఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

*ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి*- *:అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కార్యాలయం నందు అహు...
05/03/2026

*ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలి*

- *:అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కార్యాలయం నందు అహుడా ఛైర్మన్ టి. సి.వరుణ్ మరియు జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ గారు గ్రీవెన్స్ నిర్వహించారు. మరియు అర్జీదారులు నుండి అర్జీలు స్వీకరించారు.

అనంతపురం, మార్చి 05 :

- *అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో ప్రతి లేఅవుట్ క్రమబద్ధీకరణ కావాలని జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. నగరంలోని అహుడ కార్యాలయంలో గురువారం అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)పై సంబంధిత అధికారులతో అహుడ చైర్మన్ టిసి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారునికి మెరుగైన సేవలను అందించాలన్నారు. అక్రమంగా లేఅవుట్లను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ పథకం (LRS-2020) కింద అనధికార లేఅవుట్లు / ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకొనుటకు అవకాశం కల్పించామని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలన్నారు. అథరైజ్డ్ లేఅవుట్లలో మూడేళ్ల తరువాత తక్కువ పురోగతి ఉన్న వాటిపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో జెసి అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంఐజి పేమెంట్లు, రిజిస్ట్రేషన్ లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. కందుకూరు, కునుతూరు లేఅవుట్ లలో పనులు వేగంగా చేపట్టాలన్నారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పిఓ ఇషాక్, ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కార్యాలయం నందు గ్రీవెన్స్ డే  సందర్భంగా అహుడా ఛైర్మన్  టి. సి.వరుణ...
19/02/2026

అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) కార్యాలయం నందు గ్రీవెన్స్ డే సందర్భంగా అహుడా ఛైర్మన్ టి. సి.వరుణ్ గారు మరియు జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ గారు నివసించడం జరిగింది.

అనంతపురం, ఫిబ్రవరి 19 :

- *అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో ప్రతి లేఅవుట్ క్రమబద్ధీకరణ కావాలని జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. నగరంలోని అహుడ కార్యాలయంలో గురువారం అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)పై సంబంధిత అధికారులతో అహుడ చైర్మన్ టిసి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎంఐజి లేఅవుట్ లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రతి ఫ్లాట్ కొనుగోలుదారునికి మెరుగైన సేవలను అందించాలన్నారు. అక్రమంలో లేఅవుట్లను వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ పథకం (LRS-2020) కింద అనధికార లేఅవుట్లు / ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకొనుటకు అవకాశం కల్పించామని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. అథరైజ్డ్ లేఅవుట్లలో మూడేళ్ల తరువాత తక్కువ పురోగతి ఉన్న వాటిపై చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా గ్రీవెన్స్ లో అర్జీలను స్వీకరించారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఎంఐజి పేమెంట్లు, రిజిస్ట్రేషన్ లపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పిఓ ఇషాక్,ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, పబ్లిక్ హెల్త్ ఆఫీసర్, జెపీఓ హరీష్ చౌదరి, డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

👆👆*ఫోటోలు..*-----------------*బిపిఎస్, ఎల్ఆర్ఎస్ పనులు వేగవంతం చేయాలి*- *: జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్...
11/02/2026

👆👆
*ఫోటోలు..*
-----------------

*బిపిఎస్, ఎల్ఆర్ఎస్ పనులు వేగవంతం చేయాలి*

- *: జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్*

అనంతపురం, ఫిబ్రవరి 11 :

- *అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో బిపిఎస్, ఎల్ఆర్ఎస్ పనులను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్ ఆదేశించారు. నగరంలోని అహుడ కార్యాలయంలో బుధవారం అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)పై సంబంధిత అధికారులతో అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ & అహుడా వైస్ చైర్మన్ మాట్లాడుతూ అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ పథకం (LRS-2020) కింద అనధికార లేఅవుట్లు / ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకొనుటకు అవకాశం కల్పించామని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. బిల్డింగ్ పినరైజేషన్ స్కీం ప్రక్రియ పనులలో మరింత వేగం పెంచాలన్నారు. ఎంఐజి లేఅవుట్ లో పనులు వేగంగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కందుకూరు, కునుతూరు పనులు త్వరితగతిన చేయాలని, అనుమతి పొందని లేఅవుట్లపై చర్యలు తీసుకోవాలన్నారు. అథరైజ్డ్ లేఅవుట్లలో మూడేళ్ల తరువాత తక్కువ పురోగతి ఉన్న వాటిపై చర్యలు చేపట్టాలన్నారు. లైసెన్స్ టెక్నీకల్ పర్సన్ పనితీరుపై మానిటర్ చేసేందుకు సమావేశం నిర్వహించాలన్నారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ పి ఓ ఇషాక్,ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, , జెపీఓ హరీష్ చౌదరి,డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

👆👆*ఫోటోలు..*----------------*ఎల్ఆర్ఎస్ పనులు వేగవంతం చేయాలి*- *: ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్* ...
29/01/2026

👆👆
*ఫోటోలు..*
----------------

*ఎల్ఆర్ఎస్ పనులు వేగవంతం చేయాలి*

- *: ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ సి.విష్ణుచరణ్*

- *: నగరంలోని అహుడ కార్యాలయంలో అహుడపై అధికారులతో చైర్మన్ టి.సి.వరుణ్, సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించిన ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్..*

అనంతపురం, జనవరి 29 :

- *అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా) పరిధిలో ఎల్ఆర్ఎస్ లను నిర్దేశిత సమయం పెట్టుకుని వేగవంతం చేయాలని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ సి.విష్ణు చరణ్ పేర్కొన్నారు. నగరంలోని అహుడ కార్యాలయంలో గురువారం అనంతపురము - హిందూపురము అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (అహుడా)పై సంబంధిత అధికారులతో అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ మరియు అహుడ సెక్రటరీ జి.రామకృష్ణారెడ్డితో కలిసి ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ సి.విష్ణు చరణ్ సమీక్ష నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ మాట్లాడుతూ అనధికార లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ పథకం (LRS-2020) కింద అనధికార లేఅవుట్లు / ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకొనుటకు అవకాశం కల్పించామని, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలన్నారు. బిల్డింగ్ పినరైజేషన్ స్కీం ప్రక్రియను మొదలు పెట్టాలన్నారు. అర్బన్ లో ఏర్పాటు చేస్తున్న పింక్ టాయ్ లెట్స్ ను, స్విమ్మింగ్ పూల్ ని త్వరలో ప్రారంభించాలన్నారు. ఎంఐజి లేఅవుట్లలో పెండింగ్ పేమెంట్ లను వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుండంకోనేరు టెండర్లను మళ్లీ పిలిచేలా చూడాలన్నారు. అనంతరం అహుడా కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ కేఎండి.ఇషాక్,ఇంజినీర్ దుష్యంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, , జెపీఓ హరీష్ చౌదరి,డీఈ రేవంత్, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.

*ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ సేవలు మరువలేనివి*- *: అహుడ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న...
22/01/2026

*ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ సేవలు మరువలేనివి*

- *: అహుడ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి ఘన సన్మానం..*

అనంతపురం, జనవరి 20 :

- *నగరంలోని అహుడ కార్యాలయంలో బదిలీపై వెళుతున్న ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి మంగళవారం ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అహుడ చైర్మన్ టి.సి.వరుణ్, అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, అహుడ అధికారులు పాల్గొన్నారు.*

- *ఈ సందర్భంగా అహుడ చైర్మన్ టి.సి.వరుణ్ మాట్లాడుతూ ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ బదిలీపై వెళ్లడం ఊహించలేదని, ఇంఛార్జి జిల్లా కలెక్టర్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నామని, ఆయన సేవలు మరువలేనివన్నారు. తాను చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఇంఛార్జి జిల్లా కలెక్టర్ తో కలిసిమెలిసి పనిచేయడం జరిగిందని, ఇది తాను జీవితాంతం గుర్తించుకునే విషయమన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ ముందు వరుసలో ఉంటారని, అహుడ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారని, రాష్ట్రస్థాయిలో అహుడ ప్రధానంగా ఎదిగిందన్నారు. అహుడకి మంచి ల్యాండ్ బ్యాంక్ వచ్చేలా చర్యలు తీసుకున్నారని, ఆయన భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.*

- *ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ మాట్లాడుతూ తాను అహుడ వైస్ చైర్మన్ గా పనిచేయడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆ సమయంలో అధికారులు, సిబ్బంది అందరూ మంచిగా సహకారం అందించాలని ఎందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంతకుముందు చాలా తక్కువ టీంతో అహుడ ఉందని, ఐదారు నెలల కిందట కొత్తగా అధికారులు, సిబ్బంది వచ్చారని, ఛైర్మన్, సెక్రెటరీ, అందరూ తనకు చాలా చక్కగా సహకారం అందించారన్నారు. అధికారులు, సిబ్బంది అందరూ కష్టపడి పనిచేయడం కొనసాగించాలని సూచించారు. అహుడలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.*

- *ఈ సందర్భంగా అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అహుడలో వైస్ చైర్మన్ గా శివ్ నారాయణ్ శర్మ గారు బాధ్యతలు స్వీకరించిన వాటి నుంచి పరిపాలన, రెవెన్యూ పరంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ నూతనంగా సిబ్బందిని నియమించారని, బిల్స్, స్టాఫ్ అరియర్స్ పరిష్కారం చేశారని, అహుడకి ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేశారని, జిల్లాలో రాష్ట్రంలోనే లేనివిధంగా ప్రత్యేక గ్రీవెన్స్ ఏర్పాటు చేయడం జరిగిందని ఇందుకు మంచి పేరు వచ్చిందని, ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అనంతరం ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & అహుడ వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మకి శాలువా కప్పి, జ్ఞాపికలు అందజేసి ఛైర్మన్, సెక్రెటరీ, అధికారులు ఘనంగా సన్మానించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, డీఈ రేవంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, కేఎండి.ఇషాక్, ఎగ్జిక్యూట్ ఇంజినీర్ దుష్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్, తదితరులు పాల్గొన్నారు.*

*అహుడపై అధికారులతో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ సమీక్ష*అనంతపురం, జనవరి 08 :- *నగరంలోని ఇంఛార్జి జిల్లా కలెక్ట...
08/01/2026

*అహుడపై అధికారులతో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ సమీక్ష*

అనంతపురం, జనవరి 08 :

- *నగరంలోని ఇంఛార్జి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం అహుడపై సంబంధిత అధికారులతో ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ శివ్ నారాయణ్ శర్మ సమీక్ష సమావేశం నిర్వహించారు.*

- *ఈ సందర్భంగా ఇంఛార్జి జిల్లా కలెక్టర్ & వైస్ చైర్మన్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ లను నిర్దేశిత సమయం పెట్టుకుని వేగవంతం చేయాలని ఆదేశించారు. పెనుగొండ, మడకశిర ఎంఐజి, కొనుతూరు లేఅవుట్ల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. అంతకుముందు అహుడా కార్యాలయంలో ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి అర్జీదారుల నుంచి పలు అర్జీలను స్వీకరించారు. అర్జీల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.*

- *ఈ కార్యక్రమంలో అహుడ సెక్రటరీ రామకృష్ణారెడ్డి, కేఎండి.ఇషాక్, ఎగ్జిక్యూట్ ఇంజినీర్ దుష్యంత్, జీపీఓ హరీష్ చౌదరి, సర్వేయర్ శరత్,డీఈ రేవంత్, ఈఓ అరుణ కుమారి, ఏఓ రవిచంద్రన్, తదితరులు పాల్గొన్నారు.*

Address

AHUDA
Anantapuramu
515001

Website

Alerts

Be the first to know and let us send you an email when AHUDA posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share