Telugu Desam Party: Araku Valley

Telugu Desam Party: Araku Valley Official Page of TDP Araku Valley

04/08/2026

కొడుకు వీధి రౌడీలా చెలరేగుతూ ప్రజల మీద పడి దాడులకు దిగుతుంటాడు..
నా కొడుకు సుద్దపూస, అమాయకుడని అని తల్లి సర్టిఫికెటు ఇస్తుంటుంది..

సిదిరి అప్పలరాజు నుంచి విరూపాక్ష దాకా గొడ్డలి పార్టీ బుద్ధి మాత్రం ఒక్కటే..
చెలరేగిపోయి నేరాలు చేయడం.. ఆ తర్వాత నంగనాచి కబుర్లు చెప్పడం..!!




•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన...
04/08/2026

•ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ప్రజలకు తాగునీటి కొరత రాకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు

•విశాఖపట్నంలో అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అభివృద్ధికి జీవీఎంసీ కీలక అడుగు వేసింది. మాస్కో ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సాంకేతిక సహకారానికి శ్రీకారం చుట్టింది

•టీడీపీ చేపట్టిన “ఇంటింటికీ తెలుగుదేశం-2026” కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు

•అధికారంలో ఉన్నప్పుడు రైతుల సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ రెడ్డి, ఇప్పుడు రైతులపై ప్రేమ చూపిస్తున్నట్లు నటిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు

•అభివృద్ధిపై చర్చకు సిద్ధమని తాను చెబుతుంటే, వైసీపీ నేతలు మాత్రం ఎన్నికల గురించి తప్పుడు సవాళ్లు విసురుతున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/28MW



ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే గుండాగా మారి, తన అనుచరులతో కలిసి సామాన్యుల, దళితుల ఇళ్లపై పడి దౌర్జన్యానిక...
03/08/2026

ప్రజాస్వామ్యంలో ప్రజలను కాపాడాల్సిన ఎమ్మెల్యే గుండాగా మారి, తన అనుచరులతో కలిసి సామాన్యుల, దళితుల ఇళ్లపై పడి దౌర్జన్యానికి దిగితే... మహిళలను అవమానిస్తే... అటువంటి రౌడీలకు నువ్వు మద్దతుగా నిల్వడంలో అర్థం ఏంటి జగన్? నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది అంటే నేరంలో తీవ్రత నీకు అర్థం కాలేదా?




03/08/2026

భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి చేసి ప్రారంభించిన ఘనత చంద్రబాబు గారికే దక్కుతుంది. మా ప్రాంతం అభివృద్ధికి ఎయిర్పోర్ట్ ఉపయోగపడుతుంది.
- వైసీపీ కార్యకర్త








03/08/2026

భోగాపురంలో విమానాశ్రయానికి శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు సీఎం చంద్రబాబు గారి కృషి ఉందని.. ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో దూసుకుపోతుందని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.








•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండే...
03/08/2026

•పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శుభవార్త చెప్పాయి. ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణం అందించనుండగా, రెండేళ్లలో తిరిగి చెల్లించే అవకాశం కల్పించారు. సుమారు 50 వేల మంది రైతులకు లబ్ధి చేకూర్చే ఈ పథకం ద్వారా రాష్ట్రానికి రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందనుంది

•ఆంధ్రప్రదేశ్–ఆస్ట్రేలియా భాగస్వామ్యానికి కొత్త ఊపు లభించింది. క్లీన్ ఎనర్జీ, అధునాతన తయారీ, విద్య, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో సహకారం పెంచేందుకు ఏపీ ప్రభుత్వం ఆస్ట్రేలియాలోని ప్రముఖ సంస్థలతో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది

•ఉత్తరాంధ్ర అభివృద్ధికి మైలురాయిగా నిలిచే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ఆ ప్రాంత ప్రజల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. లక్షలాది మంది హాజరైన ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ విమానాశ్రయంపై విస్తృత చర్చ జరగడం విశేషం

•జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఘనంగా నివాళులర్పించారు. జాతీయ పతాకాన్ని రూపుదిద్దిన పింగళి వెంకయ్య దేశభక్తిని ప్రజల్లో పెంపొందించి, దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని కొనియాడారు

•రాష్ట్రానికి అదనంగా రూ.4,597 కోట్ల పన్నుల వాటా కేటాయించినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌లకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అదనపు నిధులు రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తాయని పేర్కొన్నారు

నేటి వార్తల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి 'చైతన్య రథం' ఈ పేపర్ ను డౌన్లోడ్ చేసుకోండి.

https://bitly.cx/QoDpO



భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు ఉత్తరాంధ్ర విజయోత్సవ...
02/08/2026

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు ఉత్తరాంధ్ర విజయోత్సవంగా మార్చారు.








02/08/2026

ఉత్తరాంధ్రలో వచ్చే మూడేళ్లలో 8 ప్రధాన సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేస్తాం..
నేరేడు బ్యారేజీ నిర్మాణం ద్వారా దశాబ్దాల కలను నిజం చేస్తాం..
గోదావరి ని వంశధారను అనుసంధానం చేసే బాధ్యత తీసుకుంటాం..
ఉత్తరాంధ్రనుంచి ఇక వలసలు ఉండవు.. ఆ హామీ మీకు ఇస్తున్నా..








Address

Araku

Alerts

Be the first to know and let us send you an email when Telugu Desam Party: Araku Valley posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Telugu Desam Party: Araku Valley:

Shortcuts

Share