20/10/2025
Grand Felicitation to Gold Medal Winner Jeevan Tannya
Sarada Niketan announces one year of free education
At Sarada Niketan School, run by the Sarada Trust in Araku Valley, third-grade student Korra Jeevan Tannya has been honored for her remarkable achievement. The school management announced that Jeevan Tannya will receive one year of free education, including exemption from all fees and other expenses.
On October 12, Jeevan Tannya participated in a 10-kilometer marathon held at Visakha Geetam College and proudly secured a Gold Medal. In recognition of her achievement, the school management felicitated her in a special ceremony.
During the event, school representatives expressed their pride and announced full support for Jeevan Tannya’s continued education. They also appealed to Paderu ITDA to encourage and support such talented students to achieve even greater success in the future.
The program was attended by School Committee members K. Surendra and V. Umamaheswara Rao, Principal S. Chiranjeevi, the student’s parents, teachers, and fellow students, who all congratulated and celebrated her accomplishment.
గోల్డ్ మెడల్ సాధించిన జీవన తాన్యకు ఘన సన్మానం
ఏడాది పాటు ఉచిత విద్యను అందిస్తున్న శారదా నికేతన్
అరకులోయలో శారదా ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న శారదానికేతన్ పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న కొర్రా జీవన్ తాన్యకు శారదనికేతన్ పాఠశాల యాజమాన్యం ఏడాది పాటు ఎటువంటి ఫీజులు, ఇతర ఖర్చులు లేకుండా ఉచిత విద్యను ప్రకటించింది. అక్టోబర్ 12న విశాఖ గీతం కళాశాలలో జరిగిన పది కిలోమీటర్ల మారథాన్ పరుగు పందెంలో జీవన్ తాన్య పాల్గొని బంగారు పతకం సాధించింది. ఈ మేరకు పాఠశాల యాజమాన్యం జీవన్ తాన్యను పాఠశాలలో ఘనంగా సత్కరించింది.
ఈ సందర్భంగా యాజమాన్యం ప్రతినిధులు మాట్లాడుతూ తాన్యకు ఏడది పాటు ఉచిత విద్యను అందిస్తుందని చెప్పారు. పాడేరు ఐటిడిఏ ఇటువంటి ప్రతిభగల విద్యార్థులను ప్రోత్సహించి భవిష్యత్తులో మరింతగా రాణించేందుకు సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కమిటీ సభ్యులు కె.సురేంద్ర, V.ఉమామహేశ్వర రావు గార్లు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు s.చిరంజీవులు గారు మరియు విద్యార్థిని తల్లిదండ్రులు, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్ధుల పాల్గొన్నారు.