28/04/2025
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గౌరవనీయులైన శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్, నెల్లూరు జిల్లా జనసేన పార్టీ హెడ్ శ్రీ వేములపాటి అజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో డొక్కా సీతమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు లోని బైపాస్ వద్ద ఉన్న ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో జనసేన పార్టీ నాయకులు డొక్కా సీతమ్మ చలివేంద్రాన్ని ప్రారంభించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ గారు, జమీర్ గారు, కృష్ణారెడ్డి గారు, రవి గారు, సురేష్ గారు పాల్గొని చలివేంద్రాన్ని ప్రారంభించారు. డొక్కా సీతమ్మ వర్ధంతి సందర్భంగా చలివేంద్రాన్ని ప్రారంభించడం హర్షించదగ్గ విషయమని జనసేన సీనియర్ నాయకులు చదలవాడ హరీష్ కుమార్ పేర్కొన్నారు. వరదల వలన ఇబ్బందులకు గురయ్యే గ్రామాల పేదలకు ఎంతో సహాయం చేసేదని ..వచ్చిన వారికి కాదనకుండా అన్నం పెట్టిన మంచి మనసున్న వ్యక్తి డొక్కా సీతమ్మని కొనియాడారు.రాబోయే రోజుల్లో టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాల మేరకు డొక్కా సీతమ్మ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమం లో ఆత్మకూరు నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షుడు & జనసేన పార్టీ సంగం మండల సీనియర్ నాయకులు దాడి భాను కిరణ్ గారు, మర్రిపాడు మండల ఇంచార్జ్ ప్రమీల, ఎస్ పేట మండలం ఇంచార్జ్ అక్బర్ బాషా, ఆత్మకూరు టౌన్ నాయకులు వంశీ కృష్ణ, ఆత్మకూర్ రూరల్ నాయకులు వెంకటేష్ , నెల్లూరు జిల్లా నాయకులు పవన్ , చేజర్ల మండల నాయకులు ప్రసాద్, అనంతసాగరం మండల జనసేన పార్టీ ఇంచార్జ్ ఉదయగిరి రవి గారు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు నియోజకవర్గం - జనసేన పార్టీ
JanaSena Shatagni Pawan Kalyan JanaSena Party Naga Babu Nadendla Manohar