TDP Avanigadda

TDP Avanigadda Telugu Desam Party will strive to empower, youth and backward segments of the society in Andhrapradesh.

"తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా ..దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా" అని పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటాన్ని ముందుండ...
05/07/2023

"తెలుగు వీర లేవరా..దీక్షబూని సాగరా ..దేశమాత స్వేచ్చ కోరి తిరుగుబాటు చేయరా" అని పిలుపునిచ్చి, స్వతంత్ర పోరాటాన్ని ముందుండి నడిపారు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. మన స్వేచ్ఛ కోసం తన ప్రాణాలను ఫణంగా పెట్టిన త్యాగధనుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి సందర్భంగా పోరాటయోధుడిని స్మరించుకుందాం.
--మండలి బుద్ధప్రసాద్.

18/06/2023
 #మండలి  #బుద్ధప్రసాద్ గారి మాటలలో.........దివిసీమలో మట్టి..ఇసుక.. సహజ వనరులను యధేచ్చగా దోచేస్తూ అధికార పార్టీ అక్రఅక్రమ...
18/06/2023

#మండలి #బుద్ధప్రసాద్ గారి మాటలలో.........
దివిసీమలో మట్టి..ఇసుక.. సహజ వనరులను యధేచ్చగా దోచేస్తూ అధికార పార్టీ అక్రఅక్రమ దందాలు ఎన్ని జరుగుతున్నా అధికార యంత్రంగం తీరు తీవ్ర అభ్యంతరకారం. జగనన్న కాలనీల పేరుతో మట్టి దందా కొనసాగుతున్నా పట్టించుకున్న అధికారులు లేరు..చట్టాలను యధేచ్చగా ఉల్లంఘిస్తున్నారు.. ప్రశ్నించిన వారి అణిచివేసేందుకు ప్రయత్నించటం దుర్మార్గం. దివిసీమలో జరుగుతున్న ఈ దోపిడీకి సర్వ సైన్యాధ్యక్షుడు కడవకొల్లు నరసింహారావు. ఎమ్మెల్యే ఆశీస్సులతో అక్రమ దందా జరుగుతుంది. దివిసీమ లుంటాక (కొల్లగొట్టేవారు) కడవకొల్లు నరసింహారావు. దివిసీమ రక్షణ..మనుగడ కు ప్రతి ఒక్కరూ పోరాటం చేయాల్సిన ఆవశ్యకత ఉంది.జరుగుతున్న వాస్తవాలను ప్రజలు ఆలోచన చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న.

భావదేవరపల్లిలో మట్టి దందా జరుగుతుందని గ్రామస్తులు చెబితే తాను వెళ్లి కళ్ళారా చూసి జరుగుతున్న తతంగాన్ని చూసి ఆశ్చర్యపోయాను. చట్టాలని కాపాడాల్సిన అధికారులే చట్టాలను ఉల్లంగించడం.. మట్టి దందా ఎమ్మార్వో కనుసన్నల్లోనే జరుగుతుంద
రైతులు ఆరోపించారు. తవ్వకాలను రైతులు అడ్డగించి వాహనాలను పట్టిస్తే తూతూ మంత్రంగా జరిమానాలు విధించి వదిలేసారన్నారు. అధికారుల పనితీరు తీవ్ర అభ్యంతరంగా ఉంది. వాహనాలను సీజ్ చేసి కేసు పెట్టాల్సిన పరిస్థితి ఉంటే తవ్విని యంత్రాన్ని సైతం వదిలేసి మొక్కుబడిగా జరిమానాలు విధించారు.కంచే చేను మేసిన చందాన అధికారులు తీరు ఉంది. ఈ మట్టి దందాను ప్రశ్నించి.. అడ్డుకోవాలనే ఉద్దేశంతో నాగాయలంక తహశీల్దార్ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చాను. తెల్లవారేసరికి తెలుగుదేశం పార్టీ నాయకులను ఎక్కడికి అక్కడ అరెస్టులు చేయడం.. నోటీసులు ఇవ్వడం జరిగింది తనకు సైతం పోలీసులు నోటీసులు అందిస్తే గాంధేయ పద్ధతుల్లో శాసనోల్లంఘనకు సిద్ధమని చెప్పి నోటీసులను అంగీకరించేది లేదని వారికి తెలియజేశాను. అధికార పక్షం చెప్పిందని ప్రశ్నించిన వారి గొంతు నొక్కాలని చూడటం సబబు కాదు. సామాన్య రైతులు మట్టి తవ్వుకునేందుకు అనుమతి ఇవ్వని తహశీల్దార్ మట్టి దందాకు ఎలా అనుమతి ఇచ్చారు. నంగేగడ్డకు బలహీనవర్గానికి చెందిన రైతు ఆవేదన వ్యక్తం చేస్తే ఈరోజు వారి ఇంటికి వెళ్లి బెదిరించారు. వక్కపట్లవారిపాలెం సర్పంచ్ అంబటి శ్యామ్ ప్రసాద్ ఇందుకు నాయకత్వం వహించారు. భావదేవరపల్లిలో తాను పర్యటించినప్పుడు ఎక్కడా నేతల పేర్లు ప్రస్తావించలేదని కానీ ముఖ్య సూత్రధారులు అందరూ ఈరోజు బయటికి వచ్చారు . అంబటి బ్రాహ్మణయ్య గారు సర్పంచ్ గా ఉన్న సమయంలో తన తండ్రి మండలి వెంకట కృష్ణారావు గారు రాష్ట్రంలోనే మొట్టమొదటి కాలనీగా బ్రహ్మానందపురం కట్టించారు.. ఆ తర్వాత తాము అనేక కాలనీలు కట్టించాము ఇలా మట్టిదందా ఏరోజు చేయలేదు.

నాగాయలంక.. కోడూరు మండలంలోని 15 రోజుల సీసీ పుటేజీ ఇస్తే అక్రమ రవాణా విషయం బయల్పడుతుందనీ నేను మాట్లాడింది నిజమో కాదో తెలుస్తుంది ఆ సిసి ఫుటేజ్ ఇవ్వాలని పోలీసులను కోరడమైనది.
జగనన్న కాలనీల పేరు చెప్పి మట్టిదందా చేస్తున్నారనేది జగమెరిగిన సత్యం . మట్టి అంతా జగనన్న కాలనీలకే తరలిస్తున్నారా. విచ్చల విడిగా దోపిడీ జరుగుతున్నా ఎమ్మెల్యే మౌనం ఎందుకు వహిస్తున్నారు . ఈ దోపిడీకి సర్వ సైన్యాధ్యక్షుడు కడవకొల్లు నరసింహారావు అని.. ఆయనకు ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయి. నరసింహారావు కు "దివిసీమ లుంటాక" అనే బిరుదు ఇవ్వటం సముచితమ. ఎడ్లంక.. శ్రీకాకుళంతోపాటు నియోజకవర్గంలో జరుగుతున్న దోపిడీ అంతా ఇంతా కాదు . ప్రశ్నించే వారిని అణిచివేయాలని చూడడం దుర్మార్గమైన చర్య.. దమ్ము ధైర్యం ఉంటే తమను తహశీల్దార్ కార్యాలయానికి వెళ్ళనివ్వాలి కదా. చట్టబద్ధంగా తవ్వకాలకు ఎలా అనుమతి ఇచ్చారో తహశీల్దార్ సమాధానం చెప్పేవారు కదా.

జగనన్న కాలనీ లబ్ధిదారులను తీసుకువచ్చి ధర్నా చేయాలని చూడటం నన్ను అడ్డగించి బెదిరింపులకు దిగాలని చూడటం ఏమిటి. ఎవరిని భయపెడతారు. దివిసీమ లోని దందాను రాష్ట్రవ్యాప్తంగా తీసుకు వెళ్లారు. ఇక్కడ జరుగుతున్న దోపిడీని అందరికీ తెలిసేలా చేశారు అధికార పార్టీ దౌర్జన్యాలకు తలవంచేవారు ఇక్కడ ఎవరూ లేరు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఆ రకంగా బుద్ధి చెప్పగలం . ఉద్యమాలతో చైతన్యం కలిగిన దివి ప్రాంతంలో నేడు దివిసీమ రక్షణ.. మనుగడ కోసం ప్రతి ఒక్కరు పోరాటం చేయాల్సిన తరుణం ఆసన్నమైంది ప్రజలు ఆలోచించాలని మంచి..చెడులు బీరీజు వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

 #ఏరువాక  #పున్నమికి  #నాగలి  #పట్టిన  #మండలి  #బుద్ధప్రసాద్--ఎద్దులను అలంకరించి పొలాలకు తీసుకెళ్లిన రైతులు --భూమి పూజ అ...
04/06/2023

#ఏరువాక #పున్నమికి #నాగలి #పట్టిన #మండలి #బుద్ధప్రసాద్

--ఎద్దులను అలంకరించి పొలాలకు తీసుకెళ్లిన రైతులు

--భూమి పూజ అనంతరం వ్యవసాయ పనులు ప్రారంభం

మోపిదేవి: మండల పరిధిలోని బొబ్బర్లంక గ్రామంలో ఏరువాక పౌర్ణమిని రైతులు ఆనందోత్సాహాల నడుమ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. పొలాల్లో భూమి పూజ నిర్వహించి, నాగలితో దుక్కిదున్ని వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండలి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ నాగరికత ఎంత మారినా నాగలి లేకుండా వ్యవసాయం జరగదని, రైతు లేకుండా పూట గడవదని అన్నారు. ప్రతి ఏడాది జ్యేష్ట పూర్ణిమ నాడు అన్నదాతలు ఎడ్లు, నాగలి, ఇతర వ్యవసాయ పనిముట్లకు పూలు, పసుపు, కుంకుమ, ధూప దీపాలు మొదలైనవాటితో పూజించి, దుక్కి దున్నడంతో ప్రారంభించి, వ్యవసాయ పనులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి పంటలు పండాలని భగవంతుని కోరుకుంటూ వ్యవసాయ పనులు ప్రారంభించడం ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయం అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ఏరువాక పూర్ణిమ పర్వదినాన్ని ఎంతో గొప్పగా జరిపేవారమని, ఈ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను అబద్ధపు మాటలతో మోసగించటం సరిపోతుంది అన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు కూడా సరిగా చెల్లించటం లేదు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నాలుగేళ్లుగా రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, రైతుల సమస్యలను ఎన్నిసార్లు, ఎంతమంది ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా చీమకుట్టినట్లు కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి లేదు అన్నారు. రాష్ట్రంలో మిల్లర్లకు వ్యతిరేఖంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రైతులను నమ్మించి, మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకుండా మిల్లర్ల వద్ద ముడుపులు తీసుకుని రైతులను మోసం చేసి భారీ అవినీతికి వైసీపీ నాయకులు పాల్పడ్డారని అన్నారు. అకాల వర్షాలకు నియోజకవర్గంలో వాణిజ్య పంటలు దెబ్బతిన్నప్పటికీ కనీసం ఉద్యానవన శాఖ అధికారులు కానీ, ప్రభుత్వం కానీ స్పందించలేదని, వర్షాలకు పంట తడిచిపోయి, మొక్కజొన్న పంట మొత్తం మొలకలు వచ్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో దెబ్బతిన్న పంటలకు ఇన్సూరెన్స్ ఇచ్చేవారమని, కానీ ఇన్సూరెన్స్ కూడా మేమే కడతాం అంటూ రైతులను మోసం చేసి, నేడు భీమా లేదు అంటూ రైతులను నట్టేట ముంచారు అన్నారు. రైతులంటే చిన్న చూపు చూస్తున్న ప్రభుత్వ ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వం మాత్రమేనని, రైతు వ్యతిరేకిగా జగన్మోహనరెడ్డి ప్రవర్తిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ యాంత్రీకరణను తీసుకుని వచ్చారని, రైతులకు ట్రాక్టర్లు, నాగలి వంటి పలు యంత్రాలను రైతులకు అందించారని అన్నారు. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేసిన ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ ప్రయాణాలు రాష్ట్ర ప్రజల కోసం కంటే కేసుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే పరిమితం అయ్యాయని విమర్శించారు. సమాజ ప్రయోజనాలను గురించి ఆలోచించకుండా స్వార్థ ప్రయోజనాలను ముఖ్యమంత్రి కాపాడుకుంటున్నారని అన్నారు. అనంతరం పసుపు, మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులు మండలి ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటకు మద్దతు ధరను ఇవ్వకుండా ప్రభుత్వం తమని ఇబ్బంది పెడుతోందని, రైతు భరోసా కేంద్రాలలో పేరు నమోదు కోసం వెళ్తే కులం ఏమిటని అడుగుతున్నారని, రైతుకు కులం ఏమిటో అర్థం కావడం లేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్, మోపిదేవి మండల ఎంపీపీ రావి దుర్గావాణి, తెలుగు మహిళ జిల్లా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలత, మండల అధ్యక్షులు నడకుదిటి జనార్ధనరావు, బొబ్బర్లంక గ్రామ సర్పంచ్ గంగా భవాని, దొప్పలపూడి జగదీష్, జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నేతలు గొర్రెపాటి రామకృష్ణ, రావి నాగేశ్వరరావు, అయినంపూడి బానుప్రకాష్, రావి రత్నగిరి, కోనేరు చంద్రమౌళి, చల్లపల్లి మండల అధ్యక్షులు మోర్ల రాంబాబు, తెలుగు మహిళ జిల్లా నేతలు పైడిపాముల కృష్ణకుమారి, దివి యుగంధరి, మాజీ ఎంపీపీ మోర్ల జయలక్ష్మి, చందన రంగారావు, సర్పంచ్ దిడ్ల జానకీ రాంబాబు, రైతులు బాల భార్గవ్, కల్లేపల్లి రమేష్, కోటేశ్వరరావు, బాల సాంబశివరావు, బాల రాము, గ్రామ మహిళలు కోనేరు సౌమ్య, కావ్య, బాల శకుంతల, గ్రామస్తులు కోనేరు నాగేశ్వరరావు, వేణుగోపాలరావు, తేజ, భార్గవ్, నాగబాబు తదితరులు పెద్దయెత్తున పాల్గొన్నారు.

29/05/2023

The Game Changer in Andhra Pradesh politics...

29/05/2023

Address

Avanigadda
521121

Alerts

Be the first to know and let us send you an email when TDP Avanigadda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share