20/08/2026
చీరాల, ఆగస్టు 19:
- అర్హులైన ప్రతి ఓటరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ వి., ఐ.ఏ.ఎస్. గారు బీఎల్‌ఓలను ఆదేశించారు.
- చీరాల మండల పరిషత్ కార్యాలయం, ఎన్‌టీఆర్ నగర్‌లోని 49వ పోలింగ్ కేంద్రంలో బీఎల్‌ఓలు నిర్వహిస్తున్న హియరింగ్‌ను కలెక్టర్ గారు పరిశీలించారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌లో నమోదుకాని ఓటర్లకు జారీ చేసిన నోటీసులపై సమర్పించిన పత్రాలను పరిశీలించి, నిబంధనల ప్రకారం ఏఈఆర్‌ఓలకు పంపాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.