Swamy Nathari Yuvasena

Swamy Nathari Yuvasena || Bellampally Constituency Congress Senior Leader || Formar Bellampally WACCS President ||.

22/07/2023
*గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ప్రముఖులు**మహిళా సాధికారత విద్యా ఉపాధికి పెద్దపీటవేస్తామన్న చైర్మన్ సమత*...
14/07/2023

*గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ను ప్రారంభించిన ప్రముఖులు*

*మహిళా సాధికారత విద్యా ఉపాధికి పెద్దపీటవేస్తామన్న చైర్మన్ సమత*

*మెమోరియల్ ట్రస్టు లోగోను ఆవిష్కరించిన రమేష్ రాథోడ్, బోడ జనార్ధన్*

*మల్లేష్ తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు పెట్టిన మాజీ ప్రజా ప్రతినిధులు*.

అమరజీవి గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ను మాజీ మంత్రివర్యులు బోడ జనార్ధన్ మాజీ పార్లమెంటు సభ్యులు రమేష్ రాథోడ్ లు శుక్రవారం బెల్లంపల్లి సింగరేణి కళా వేదికలో ప్రారంభించారు. అమరజీవి గుండా మల్లేష్ మూడో జయంతి సందర్భంగా సింగరేణి కళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆ ట్రస్టు లోగోను ఆవిష్కరించి ఆ ట్రస్టుకు చైర్మన్ గా ఉన్నటువంటి గుండ మల్లేష్ కుమార్తె గుండ సమతకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అమరజీవి గుండ మల్లేష్ గారి మూడో జయంతిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ
గుండ మల్లేష్ ఒక వ్యక్తి కాదని ఒక వ్యవస్థని కీర్తించారు. అనుక్షణం, ప్రతి నిమిషం ప్రజల కోసం పరితపించిన ప్రజల మనిషి గుండ మల్లేష్ నీతికి, నిజాయితీకి, నిబద్ధతకు నిలువెత్తు రూపమని కొనియాడారు. కమ్యూనిస్టు పార్టీ నాయకుడిగా తన జీవితాంతం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి విలువలతో జీవించిన మహోన్నత వ్యక్తని, శత్రువును సైతం ప్రేమించే గొప్ప మనసున్న వ్యక్తి కాబట్టే అజాత శత్రువుగా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. నాలుగు మార్లు శాసనసభ్యుడిగా గెలిచి ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల అభివృద్ధిలో తనదైన ముద్రను వేసుకున్నారని, తుది శ్వాస విడిచే వరకు ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కొరకే జీవించారని వివరించారు. చనిపోయే గంట ముందు కూడా ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కార్యాలయానికి వెళ్లి తిరిగి వస్తూ ప్రజల మధ్యనే కుప్ప కూలిపోయారని, ఇలా తుది శ్వాస వరకు ప్రజల శ్రేయస్సు కోసం పరితపించిన గుండ మల్లేష్ భౌతికంగా దూరమై మూడు సంవత్సరాలు అవుతున్న ఇంక ప్రజల గుండెల్లో సజీవంగానే ఉన్నారన్నారు.
అసమానతలు లేని సమాజ నిర్మాణం కావాలని, ఈ ప్రాంతం విద్యా వైద్యంతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించిన మా తండ్రి గారి ఆశయ సాధన కోసం ఆయన పేరిట ఈ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని గుండా సమత తెలిపారు.
గుండ మల్లేష్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళా సాధికారత, స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, విద్య, వైద్యం, అన్నార్తులకు చేయూతలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సంజీవ,
మాజీ శాసనసభ్యులు అమరాజుల శ్రీదేవి రాజేశ్వర్, ఎం సిపిఐ యు కేంద్ర కమిటీ సభ్యులు సబ్బని కృష్ణ , కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ కాంపెల్లి ఉదయ కాంత్, కాంగ్రెస్ జిల్లా నాయకులు న్యాతరి స్వామి, AIYF రాష్ట్ర అధ్యక్షులు వలీవుల్లా ఖాద్రి, సిపిఐ రాష్ట్ర నాయకులు చిప్ప నరసయ్య, రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ పుల్లల రవికుమార్, NFIW రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బొల్లం పూర్ణిమ, సిపిఐ పట్టణ కార్యదర్శి దాసరి శ్రీధర్, మాల మహానాడు సంఘం రాష్ట్ర కార్యదర్శి సొల్లు లక్ష్మి, తెలంగాణ అమరుల ఐక్య సాధన సమితి అధ్యక్షులు ఈడుగు రంజిత్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సమ్మయ్య బిజెపి రాష్ట్ర నాయకులు పాల్వాయి హరీష్, ఆత్మ రాంనాయక్, శ్రీకాంత్, ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

  Nathari Swamy anna garu
12/07/2023

Nathari Swamy anna garu

 Nathari Swamy anna
12/07/2023


Nathari Swamy anna

ఈరోజు 12వ వార్డులోని కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ సింగ్ గారి తండ్రిగారు (కీర్తిశేషులు) శంకర్ సింగ్ గారి ప్రధమ వర్ధంతి సందర...
12/07/2023

ఈరోజు 12వ వార్డులోని కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్ సింగ్ గారి తండ్రిగారు (కీర్తిశేషులు) శంకర్ సింగ్ గారి ప్రధమ వర్ధంతి సందర్భంగా ఈరోజు వారి ఇంటికి వెళ్లి శంకర్ సింగ్ గారి చిత్రపటానికి నివాళులు అర్పించిన టీపీసీసీ ఓబీసీ రాష్ట్ర వైస్ చైర్మన్ మరియు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండి ప్రభాకర్ యాదవ్ గారు *బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శ్రీ నాతరి స్వామి* గారు మొయినుద్దీన్ ఆసం అఖిల్ సాయికిరణ్ పాల్గొన్నారు..
ాంతి

ఈరోజు బెల్లంపల్లి ఏఎంసి గ్రౌండ్ అండర్ 14 క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్ ఆ...
12/07/2023

ఈరోజు బెల్లంపల్లి ఏఎంసి గ్రౌండ్ అండర్ 14 క్రికెట్ ప్రీమియం టోర్నమెంట్ నాకౌట్ పద్ధతిలో నిర్వహించడం జరిగింది. టోర్నమెంట్ ఆర్గనైజేషన్ రెడ్డి శ్రీనివాస్, వేణు, రోహన్, శశి,ఎంఏ విజయ్, ఎన్.రాజ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ లీగ్ లో బెల్లంపల్లి, మంచిర్యాల్, కాగజ్నగర్, మరియు బల్లార్షా జట్లు పాల్గొన్నాయి. నిన్న బెల్లంపల్లి మరియు మంచిర్యాల్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడగా బెల్లంపల్లి బ్లూ టీం విజయం సాధించింది
ఉత్తమ బౌలర్:- సాహిల్ యాదవ్ వినయ్ వర్ధన్
ఉత్తమ బ్యాట్స్మెన్:- కుందన్
ఉత్తమ ఆల్ రౌండర్ :- పవన సుత.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా *మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య గారు, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి గారు బెల్లంపల్లి నియోజకవర్గ నాయకులు స్వామి గారు* పాల్గొనడం జరిగింది.
*బెల్లంపల్లి నియోజకవర్గం నాయకులు స్వామి గారు* మాట్లాడుతూ గురు అకాడమీ పిల్లలకు స్పోర్ట్స్ నిర్వహించడంలో మరియు వారిలో ప్రతిభను చాటేలా బెల్లంపల్లిలో ఇది రెండవసారి టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. కావున మీరు ఇదే విధంగా పిల్లలకి మంచి చక్కటి ప్రదర్శనని నేర్పించాలని కోరతూ అదేవిధంగా ప్రతి కార్యక్రమానికి మీకు తోడుగా ఉంటామని తెలుపుతూ నతారి స్వామి గారు *గురు అకాడమీకి 5000 రూపాయలు అందించడం జరిగింది*.
అనంతరం ముఖ్య అతిథుల చేత క్రీడాకారులకు బహుమతులు అందించడం జరిగింది. ఎం. ఏ అఫ్జల్, బండి లక్ష్మణ్, వెంకట్ యాదవ్, సిల్వర్ సత్యనారాయణ, మొండయ్య, సమ్మిరెడ్డి, సాయికిరణ్ యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Nathari SWAMY Nathari Swamy  yuvasena
08/07/2023

Nathari SWAMY Nathari Swamy yuvasena

08/07/2023

డాక్టర్ . వైస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి సందర్బంగా వారి సేవలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నాను.
❤️ 🙏

08/07/2023

Address

Bellampalle

Alerts

Be the first to know and let us send you an email when Swamy Nathari Yuvasena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share