04/09/2024
తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఉన్నా స్కాలర్షిప్ మరియూ ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనె విడుదల చేయలి మరియు విద్యాశాఖ మంత్రిని నియమించాలి - ABVP
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నారాయణగూడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా *ABVP తెలంగాణ రాష్ట్ర లా స్టూడెంట్స్ ఫోరం కన్వీనర్ కొండ సాయి ప్రసాద్ గౌడ్* మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు గడుస్తున్న కనీసం విద్యారంగం పై చిత్తశుద్ధి లేదని తెలంగాణలో మద్యానికి మంత్రి ఉన్నాడు గాని విద్యారంగానికి మంత్రిని కేటాయించుకోలేని దుస్థితికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. గత పాలనలో పదేళ్లు విద్యార్థులు నిరుద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతే ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యార్థులను పట్టించుకోవడం దేవుడెరుగు కానీ విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 7500 కోట్లు ఫీజు రీయంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని వెంటనే విడుదల చేయాలని స్కాలర్షిప్ రాని కారణంగా విద్యార్థులు ఉన్నత చదువులకు వెళ్లాలంటే సర్టిఫికెట్ విషయంలో ప్రైవేట్, ప్రభుత్వం కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఫీజులు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని కళాశాల యాజమాన్యాలు విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిదుర వీడి పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మరియు
ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్, క్రిష్,మనోజ్,తేజ మరియు తదితరులు పాల్గొన్నారు.