CPM West Godavari

CPM West Godavari Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from CPM West Godavari, Political Party, Puchhalapalli Sundarayya Bhavan CPM Office Mentay Vari Thota, Bhimavaram.

06/09/2026

| CPI(M) AP Pressmeet in Vijayawada | సిపిఐ(యం) ఏపి మీడియా సమావేశం || CPIM AP

31/08/2026

సుమారు 50 సంవత్సరాలనుండి ముదునూరు గుబ్బలమ్మ గుడి వద్ద నుండి కర్ర పేట వరకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నిరుపేద కుటుంబాలకు ఏ సమస్య వచ్చినా అనారోగ్యం ఇతర సమస్యల పైన ఇళ్ల పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కానీ కూటమి ప్రభుత్వం 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్దానాలు చేశారు అందుచేత ముదునూరు చివర చిలకంపాడు సరిహద్దులో పెంటపాడు మండలానికి సంబంధించి ఎస్సి పేట వారికి ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారని గతంలో కూడా వీరి సమస్యల పైన అనేకసార్లు అధికారులకు గత ప్రభుత్వాలకు తెలిపరచడం పిటీషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అధికారులు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడైనా ముదునూరు ఉన్న గ్రామ ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇప్పించవలసిందిగా కోరుతూ

భారత కమÖ్యనిస్టు పార్టీ మార్క్సిస్టు పశ్చిమగోదావరి జిల్లా కమిటీప్రచురణ / ప్రసారార్థంభీమవరం, 31.08.2026 :నిత్యావసర వస్తువ...
31/08/2026

భారత కమÖ్యనిస్టు పార్టీ మార్క్సిస్టు
పశ్చిమగోదావరి జిల్లా కమిటీ
ప్రచురణ / ప్రసారార్థం
భీమవరం, 31.08.2026 :

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలను తక్షణమే అదుపు చేయాలి: సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్

వీరవాసరం (తూర్పు చెరువు సెంటర్):

నిత్యం పెరుగుతున్న నిత్యావసర వస్తువులు మరియు కూరగాయల ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పెరిగిన ధరలను తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే చర్యలు తీసుకోవాలని సిపిఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ డిమాండ్ చేశారు. వీరవాసరం తూర్పు చెరువు సెంటర్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన/ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

గోపాలన్ గారు తెలిపిన ముఖ్యమైన అంశాలు:

పెరిగిన ధరల భారం: బియ్యం బస్తా ధర 300 నుండి 400 వరకు పెరిగింది. ఉల్లిపాయలు కేజీ 50 నుండి 60 వరకు, పంచదార కేజీ 45 నుండి ఆకస్మికంగా 90 కి పెరిగాయి. బెండ, బీర, దొండ వంటి కూరగాయలతో పాటు కందిపప్పు, మినపప్పు, వంటి పప్పుధాన్యాల ధరలు వంటనూనె, గ్యాస్ అపారంగా పెరిగిపోయాయి.
పెరిగిన ధరలకు తగినట్లుగా ప్రజల ఆదాయాలు పెరగకపోగా, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ కూలీలు, కౌలు రైతులు, పేదలకు సరైన పనులు కూడా దొరకక తీవ్ర అవస్థలు పడుతున్నారు.
కార్పొరేట్లు, బడా వ్యాపారుల దోపిడీ: ఎల్ నినో లేదా వాతావరణ మార్పుల వల్ల వర్షాలు తగ్గడం ధరల పెరుగుదలకు ప్రధాన కారణం కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్లనే కార్పొరేట్ కంపెనీలు, బడా వ్యాపారులు సరుకులను బ్లాక్ మార్కెట్‌కు తరలించి, కృత్రిమ కొరత సృష్టించి లాభాలు కూడబెట్టుకుంటున్నారు.
ఇథనాల్ విధానం -- పంచదార సంక్షోభం: ఇథనాల్ తయారీ కోసం చెరకును దారి మళ్లించడం వల్లే మార్కెట్లో పంచదార ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆయన విమర్శించారు.
నెల రోజులకు పైగా ధరలు పెరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని, తక్షణమే నిత్యావసరాల ధరలను అదుపులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోయే రోజుల్లో ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని, దానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే పూర్తి బాధ్యత వహించాల్సి
ఉంటుందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బొర్ర అలమహారాజు మండల కమిటీ సభ్యులు యండమÖరి సుబ్బారావు, గొట్టుముక్కల శ్యాంబాబు, తాళ్ళూరి రాము మరియు బాలం విజయ కుమార్, యాళ్ళబండి నారాయణమÖర్తి, ఐనపూడి బాబూరావు, కిలాడి సత్యనారయణ, జుత్తిగ శ్రీనివాస్, పాలొ కోటేశ్వరరావు పాల్గొన్నారు.

:చించినాడ వంతెనకు భద్రతా కంచెను ఏర్పాటు చేసి పోలీసు గస్తీని పెట్టì ప్రజల ప్రాణాలు కాపాడాలని జిల్లా అధికార యంత్రాంగానికి ...
28/08/2026

:

చించినాడ వంతెనకు భద్రతా కంచెను ఏర్పాటు చేసి పోలీసు గస్తీని పెట్టì ప్రజల ప్రాణాలు కాపాడాలని జిల్లా అధికార యంత్రాంగానికి సిపిఎం జిల్లా కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి.గోపాలన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను కలుపుతూ జాతీయ రహదారికి 216కు అనుసంధానంగా ఉన్న చించినాడ వంతెన రాకపోకలకు కీలకంగా మారిందని ఆయన అన్నారు. గత కొంత కాలంగానే ఇక్కడ నుండి ఆత్మహత్యలు పెరిగాయని ఆయన తెలిపారు. పెట్టుబడిదారి వ్యవస్ధ దుష్పలితాల వల్లే ఆత్మహత్యలు జరుగుతాయని ఆయన అన్నారు. ఆత్మ హత్యలను పూర్తిగా నివారించలేకపోయినా కనీసం కొన్ని భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా తొందరపాటుగా ఆత్మహత్యలకు పాల్పడేవారిని నివారించవచ్చునని ఆయన అన్నారు. ఆందువల్ల ఎత్తైన కంచె, సిపి కెమేరాలు, పోలీసు గస్తీని జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాటు చేయాలని గోపాలన్ కోరారు.

ప్రపంచ బ్యాంకు చేతిలో కీలు బొమ్మ చంద్రబాబు నాయుడు `` మంతెన సీతారాం రాష్ట్ర కమిటీ సభ్యులువిద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్...
28/08/2026

ప్రపంచ బ్యాంకు చేతిలో కీలు బొమ్మ చంద్రబాబు నాయుడు `` మంతెన సీతారాం రాష్ట్ర కమిటీ సభ్యులు
విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం --
మోదీ ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలను తిప్పి కొట్టాలి: సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్

విద్యుత్ రంగంలో తీసుకొచ్చిన ప్రైవేటీకరణ, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రాణాలర్పించిన విద్యుత్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని సీపీఎం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం ఆగస్టు 28న విద్యుత్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా భీమవరంలోని ప్రకాశం చౌక్ సెంటర్ వద్ద విద్యుత్ అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ: చంద్రబాబు బుద్ది మారలేదన్నారు 26 సంవత్సరాల క్రితం ప్రపంచ బ్యాంకు విధానాలకు తలొగ్గి ఆనాడు పెట్టుబడీ దారి వర్గ ప్రయోజనాలకోసం విద్యుత్‌ను ప్రైవేటు సరుకుగా మార్చేదానికి విద్యుత్ చార్జీలు, భారాలు వేసేదానికి ప్రయత్నం చేస్తే ప్రజలు పెద్ద ఎత్తున విద్యుత్ పోరాటం చేస్తే బషీర్ బాగ్‌లో ఆందోళన కారులపై లాఠీ చర్జ్ చేయండి,గుర్రాలతో తొక్కించండి, పోలీస్ కాల్పులు జరపండి అని అదేశాలిచ్చి ముగ్గురు ప్రాణాలు బలిగొన్నాడు అట్లాంటి దుర్మార్గమైనచర్యకు ప్పాడ్డాడు ఈ చంద్రబాబు నాయుడు అని గుర్తుచేశారు. ఆ పోరాటంతో అప్ప్పుడు చంద్రబాబు మెడలు వంచాం. ఇప్ప్పుడు మల్లీ స్మార్ట్‌మీటర్లు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టాడు మోడి తీసుకు వచ్చిన నూతన విద్యుత్ చట్టాలను కూటమి నాయకులు ఏమాత్రం ఎదురు చెప్పకుండా అమలు చేసేదానికి సన్నద్దమైయ్యారు. మరో విద్యుత్ ఉద్యమానికి మనంతరం సిద్దం కావాలని సీతారాం అన్నరు.
సిపిఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి గోపాలన్ మాట్లాడుతూ
2000వ సంవత్సరం ఆగస్టు 28న హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా జరిగిన చారిత్రాత్మక పోరాటంలో రామకృష్ణ, విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి అనే ముగ్గురు యువకులు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయి అమరులైయ్యారని గుర్తుచేశారు.
ఆనాటి పోరాటాల ఫలితంగానే ప్రభుత్వాలు విద్యుత్ ఛార్జీలు పెంచడానికి దశాబ్దాల కాలం భయపడ్డాయని, కానీ నేడు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ‘విద్యుత్ సవరణ చట్టం’ తీసుకువచ్చి విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
భారీగా పెరగనున్న ఛార్జీలు: ఈ కొత్త చట్టం ఆమోదం పొందితే ఇంధన ధరల ప్రాతిపదికన ఎప్పటికప్పుడు ప్రజలపై విద్యుత్ భారం పడుతుందని, బొగ్గు మైనింగ్ కార్పొరేట్ల చేతుల్లో ఉండటం వల్ల విద్యుత్ చార్జీలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందన్నారు.
క్రాస్ సబ్సిడీకి గండి: ఇళ్ల విద్యుత్ వినియోగానికి, వ్యవసాయ రంగానికి లభించే క్రాస్ సబ్సిడీని రద్దు చేసి, కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చేలా ఈ మార్పులు ఉన్నాయని ఆరోపించారు.
విద్యుత్ సంస్కరణలు, ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా అమరవీరుల స్పూర్తితో ప్రజలందరూ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఫార్వర్డ్‌బ్లాక్ జిల్లా కార్యదర్శి దండు శ్రీనివాసరాజు, ఎం.సి.పి.ఐ.యు నాయకులు కొల్లాబత్తుల మహంకాలి పాల్గొని మాట్లాడారు.

27/08/2026
24/08/2026

పశ్చిమగోదావరి జిల్లాలో కెవిపిఎస్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జరిగిన సామాజిక శంఖారావం చలో కలెక్టరేట్ ధర్నాలో మాట్లాడుతున్న వక్తలు

Address

Puchhalapalli Sundarayya Bhavan CPM Office Mentay Vari Thota
Bhimavaram
534202

Telephone

9490098570

Website

Alerts

Be the first to know and let us send you an email when CPM West Godavari posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share