22/11/2023
➡️ వైద్య నీ"రజినీ" ✨🙏
➡️ ప్రశంసలు అందుకుంటున్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు,చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారి కృషి..
➡️ శారీరక రుగ్మతలతో సతమతమవుతున్న బీదాబిక్కికి పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి ఆరోగ్యధైర్యాన్నిస్తోంది.నేనున్నానంటూ బాసటగా నిలుస్తోంది.రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి కృషి ఫలితంగా సకల వసతులూ సంతరించుకుని వంద పడకలతో దిగ్విజయంగా సేవలు అందిస్తోంది. ఆపన్నహస్తమై నిలిచి భేష్ అనిపించుకుంటోంది.అపరసంజీవనిలా..ఆపద్బాంధవిలా అండగా నిలుస్తోంది.
➡️ వైద్య సేవలు భేష్..
అందుబాటులో స్పెషలిస్టు వైద్యుల సేవలు
ప్రతి నిత్యం శస్త్ర చికిత్సలు,నవజాత శిశువులకు ఎన్ఎస్యూ..!!
స్పార్ట్ ఐసీయూతో అత్యవసర సేవలు రూ. 40వేలు విలువ చేసే నెక్స్ట్ ప్లేస్ ఇంజెక్షన్లు అందుబాటులో..!!
➡️ పేదలకు బాసటగా చిలకలూరిపేట ఏరియా ఆస్పత్రి..
➡️ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు,చిలకలూరిపేట ఎమ్మెల్యే శ్రీమతి విడదల రజిని గారి చొరవతో రూ.18.57 కోట్లతో అత్యాధునిక భవనాలతో రూపుదిద్దుకున్న ఈ ఆస్పత్రి ఈ ఏడాది ఆగస్టు మూడో తేదీన ప్రారంభమైంది. రూ.2 కోట్ల విలు వైన అధునాతన వైద్య పరికరాలతో విజయవం తంగా సేవలందిస్తోంది. మరో రూ. 9.5 కోట్లతో రిటెయినింగ్వల్, అంతర్గత సీసీ రోడ్లు వంటి సదుపాయాలు సమకూర్చుకోనుంది. ప్రస్తుతం పల్నాడుతోపాటు బాపట్ల, ప్రకాశం జిల్లాల వాసు లకూ ఈ ప్రభుత్వాస్పత్రి పెద్ద దిక్కుగా మారిం ది. రోజుకు 300 మందికి తగ్గకుండా రోగులు ఆస్పత్రికి వచ్చి చికిత్స పొంది ఆనందంగా తిరిగి
వెళ్తున్నారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారి ఉండడంతో నిత్యం జరిగే రోడ్డు ప్రమాద బాధితు లకు ఈ ఆస్పత్రి ఆపద్భాందనిలా మారింది..
➡️ స్పెషలిస్టు వైద్య సేవలు..
ఆస్పత్రి ప్రారంభానికి ముందే వైద్యులు, వైద్య సిబ్బందితో కలిపి మొత్తం 96 మందిని ఇక్కడు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు నియమిం చారు. ఇందులో వైద్యులే 23 మంది ఉన్నారు. వీరిలో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, గైనకాల జీ. ఈఎన్టి, ఎముకలు, కంటి వంటి స్పెషలిస్టు డాక్టర్లూ ఉండడం విశేషం.
➡️ స్మార్ట్ ఐసీయూ భళా..
ఇదే ప్రాంగణంలోని పాత సీహెచ్సీ భవనంలో స్మార్ట్ ఐసీయూను సెప్టెంబర్ 30న ఏర్పాటు చేశారు. హృద్రోగులను మెరుగైన వైద్యం నిమిత్తం తరలించే సమయం లేనప్పుడు ఇక్కడి నుంచే రోగికి ఆన్లైన్లో అత్యవసర సేవలు అందేలా ఏర్పాట్లు చేశారు. గుండెపోటుకు అత్యవసరమైన సమయంలో వాడే రూ.40వేలు విలువ చేసే టెనె క్లో ప్లేస్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి.
➡️ ప్రసూతి సేవలకు ప్రశంసలు
ఆస్పత్రి సూపరింటెండెంట్ సహా ముగ్గురు గైనకా లజిస్టులు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. నెలకు కనీసం 78 రాస్సులు తగ్గకుండా జరుగు తున్నాయి. గత నెల రోజుల వ్యవధిలోనే 30 సిజే రియన్లు జరిగాయి. వీటితోపాటు ఇతర శస్త్రచికి త్సలూ ఇక్కడ జరుగుతున్నాయి. ఈఎన్టి, ఆర్థోఫెడిక్ వైద్య సేవలూ అందుబాటులో ఉన్నాయి. పిల్లల వైద్య నిపుణులూ అందు బాటులో ఉన్నారు. న్యూ బోర్న్ స్టెబిలైజింగ్ యూనిట్(ఎన్ఎస్ఎస్)" ఏర్పాటుతో అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చే రుగ్మతలకు అధునాతన చికిత్స అందుతోంది. దివ్యాంగులకు సదరం క్యాంపు సేవలూ లభిస్తున్నాయి..!!