YSR Congress Party - Chilakaluripeta

YSR Congress Party - Chilakaluripeta జయహో జగనన్న జయహో రజినమ్మ

*ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి**పథకం యథాతథంగా కొనసాగేలా చూడాలి**:మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజ...
07/01/2025

*ఆరోగ్యశ్రీ పెండింగ్‌ బిల్లులు వెంటనే చెల్లించాలి*
*పథకం యథాతథంగా కొనసాగేలా చూడాలి*
*:మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని డిమాండ్‌*

ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ఆరోగ్యశ్రీ లో మార్పు ఏ మాత్రం సరికాదు
హైబ్రిడ్‌ మోడల్‌తో ఇన్సూరెన్స్‌ కంపెనీలకే లాభం
అది నిరుపేద రోగులకు అత్యంత ఇబ్బందికరం
ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే ఉద్యమిస్తాం
:ప్రెస్‌మీట్‌లో మాజీ మంత్రి విడదల రజిని స్పష్టీకరణ

ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు పెండింగ్‌ బిల్లులు చెల్లించడంలో ఉదాసీనంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి విడదల రజిని ఆక్షేపించారు. గుంటూరులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆమె,పేద ప్రజలు అనారోగ్యం పాలైతే మానవతా దృక్పథంతో ఆదుకోవాలే తప్ప ట్రస్ట్‌ మోడల్‌లో ఉన్న ఆరోగ్యశ్రీని హైబ్రిడ్‌ మోడల్‌లోకి మార్చడం తగదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయాన్ని మార్చుకోకపోతే ప్రజల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు.

ప్రెస్‌మీట్‌లో విడదల రజిని ఇంకా ఏమన్నారంటే..:
అది సంక్షేమ పథకం కాదు:
– పేదల ఆరోగ్యాన్ని కాపాడే సంజీవని లాంటి పథకం ఆరోగ్యశ్రీ. అనారోగ్యంతో బాధ పడుతూ, వైద్యం కోసం అప్పుల పాలవుతున్న పేదలను ఆదుకునేందుకు తెచ్చిన ఒక గొప్ప పథకం.
– ఆరోగ్యశ్రీ పథకాన్ని ఒక సంక్షేమ పథకంగా చూడలేం. దివంగత వైఎస్సార్‌ మానవత్వంతో రూపొందించిన ఆ కార్యక్రమాన్ని ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు.
– తండ్రీ తనయులిద్దరూ రాష్ట్ర ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదే అన్నట్లు భావించి, మానవతా దృక్పథంతో ఆలోచించి పని చేశారు.

ఆరోగ్యశ్రీలో జగన్‌ గారు విప్లవాత్మక మార్పులు:
– 2019లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యే నాటికి ఆరోగ్యశ్రీలో కేవలం 1,059 ప్రొసీజర్లనే అనుమతించారు. కానీ, జగన్‌గారు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను 3257కు పెంచారు. 919 నెట్‌వర్క్‌ ఆస్పత్రులను 2300కు పెంచారు. రూ.1000 ఖర్చు దాటిన ప్రతి వైద్యాన్ని పథకంలో చేర్చారు. పథకంలో కవరేజ్‌ను రూ.25 లక్షల వరకు పెంచారు. పథకంలో అర్హతకు వార్షికాదాయ పరిమితిని రూ.5 లక్షలకు పెంచడంతో, రాష్ట్రంలోని దాదాపు 1.5 కోట్ల కుటుంబాల్లో 95 శాతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చాయి. ఇవన్నీ ఆరోగ్యశ్రీలో జగన్‌గారు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు.
– కోవిడ్‌ను కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి దానికి సంబంధించి దాదాపు 10 ప్రొసీజర్లను పథకంలో అనుమతించిన గొప్ప మనసు జగన్‌గారిది.
– 2019లో చంద్రబాబు దిగిపోతూ, ఆరోగ్యశ్రీ కింద నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రూ.632 కోట్లు బకాయి పెట్టిపోతే ఆ మొత్తం కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వం చెల్లించింది.
– వైద్యం కోసం ఏ ఒక్క నిరుపేద కుటుంబం ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో, జగన్‌గారు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆ స్థాయిలో తీర్చిదిద్ది అమలు చేశారు.

6 నెలల్లోనే ఆరోగ్యశ్రీ నిర్వీర్యం:
– కానీ, టీడీపీ కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే ఆరోగ్యశ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఏకంగా రూ.3 వేల కోట్లు బకాయి పెట్టడంతో, అవన్నీ వైద్యాన్ని నిలిపేశాయి.
– మరోవైపు హైబ్రిడ్‌ విధానంలో పథకాన్ని అమలు చేస్తామంటూ, ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు అప్పగించే పని మొదలు పెట్టారు. ఇది నిరుపేద రోగులకు శాపంగా మారనుంది.
– గత మా ప్రభుత్వంలో ఐదేళ్లలో ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద చేసిన ఖర్చు దాదాపు రూ.13,500 కోట్లు కాగా, 2014–19 మధ్య అందు కోసం టీడీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు కేవలం రూ.5,100 కోట్లు మాత్రమే.

హైబ్రిడ్‌ మోడల్‌తో ప్రజలకు నష్టం:
– మా ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 95 శాతం కుటుంబాలు ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాగా, దాదాపు 90 శాతం కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు మోడల్‌ కింద సేవలందించడం జరిగింది.
– కాగా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రైవేటు ఇన్సూరెన్స్‌ కంపెనీకి పథకాన్ని అప్పగించాలని చూడటం అత్యంత దుర్మార్గం.
– లాభాపేక్షతో పని చేసే ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఆరోగ్యశ్రీ ట్రస్టు పనులు అప్పగిస్తే ప్రజలకు మేలు జరుగుతుందని ఎలా నమ్మగలం?. ఆరోగ్యశ్రీ సంక్షేమ పథకం కాదు.
– గతంలో మహారాష్ట్ర, కేరళలో ఇలాగే హైబ్రిడ్‌ మోడల్‌ను ప్రయత్నించి విఫలం కావడంతో మళ్లీ ట్రస్టు మోడల్‌లోకి వచ్చిన ఉదాహరణలుంటే.. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ప్రభుత్వం ఆ విధానం అమలు చేయడం వెనుక ఉద్దేశం ఏమిటి?.
– ఆపరేషన్‌ తర్వాత, వైద్యులు సూచించినంత కాలం విశ్రాంతి సమయంలో రోగికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలు చెల్లిస్తూ, మా ప్రభుత్వం అమలు చేసిన ఆరోగ్య ఆసరాను కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం నిలిపేసింది.
– ప్రభుత్వం వెంటనే తన నిర్ణయాన్ని సమీక్షించి ఆరోగ్యశ్రీలో హైబ్రిడ్‌ విధానానికి స్వస్తి చెప్పి, ట్రస్టు మోడల్‌నే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తున్నాం.
– ప్రభుత్వం ఇలాగే ఉదాసీనంగా వ్యవహరిస్తే ప్రజల పక్షాన వైయస్సార్‌సీపీ ఉద్యమిస్తుందని మాజీ మంత్రి విడదల రజిని హెచ్చరించారు.

ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగిన APTA KATALYST GLOBAL BUSSINESS CONFERENCE (ఆప్త క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫర...
05/01/2025

ఈరోజు హైదరాబాద్ హైటెక్ సిటీలో జరిగిన APTA KATALYST GLOBAL BUSSINESS CONFERENCE (ఆప్త క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్) సదస్సులో పాల్గొన్న మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.

అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువు..పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటిస్థానంలో నిలిపిన...
21/12/2024

అన్ని వర్గాల ప్రజలకు ఆప్తబంధువు..పేద ప్రజల అభివృద్ధికి బాటలు వేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రంగాలలో మొదటిస్థానంలో నిలిపిన మాజీ ముఖ్యమంత్రి వర్యులు,ప్రజానేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు.

*21-12-2024 శనివారం అనగా రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గా...
20/12/2024

*21-12-2024 శనివారం అనగా రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా రేపు ఉదయం 9:00 గంటలకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు జరుగును...*

*అనంతరం క్రిస్మస్ సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరుగును...*🎄🎁

*మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారి నివాసం వద్ద జరిగే ఈ వేడుకల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు అందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం!*

*ఇట్లు*
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ*
*చిలకలూరిపేట నియోజకవర్గం*

*ఈరోజు గుంటూరులో జరిగిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరి రావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని ను...
20/12/2024

*ఈరోజు గుంటూరులో జరిగిన రాష్ట్ర గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మందపాటి శేషగిరి రావు గారి కుమార్తె వివాహ వేడుకలో పాల్గొని నుతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.*

ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డ...
19/12/2024

ఈరోజు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు.



05-12-2024 అనగా గురువారం ఉదయం 9 గంటలకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు చిలకలూరిపేటలోని వారి నివాసంలో అందుబా...
03/12/2024

05-12-2024 అనగా గురువారం ఉదయం 9 గంటలకు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారు చిలకలూరిపేటలోని వారి నివాసంలో అందుబాటులో ఉంటారు!


కడపలో ఈ నెల 16 నుండి 20 వరకు జరగనున్న కడప అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు..ఈ సందర్బంగా అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ...
13/11/2024

కడపలో ఈ నెల 16 నుండి 20 వరకు జరగనున్న కడప అమీన్‌ పీర్‌ దర్గా ఉర్సు ఉత్సవాలు..ఈ సందర్బంగా అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ హజరత్ ఖ్యాజా సయ్యద్ షా గారి ఆదేశాల మేరకు గురువు గారి ద్వారా వచ్చిన ఆహ్వాన పత్రికను మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారికి అందించారు.

మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడికొండ నియోజక...
10/11/2024

మాజీ ముఖ్యమంత్రి వర్యులు,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత,శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తాడికొండ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి గా నియమితులైన శ్రీ వనమా బలవజ్ర బాబు (డైమండ్ బాబు) గారు మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని గారిని గుంటూరులో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.



గుంటూరు నగర అధ్యక్షులుగా జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమితులైన డైమండ్ బాబు గారి ప్రమాణ స్వీకారం సభ!...
02/11/2024

గుంటూరు నగర అధ్యక్షులుగా జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియమితులైన డైమండ్ బాబు గారి ప్రమాణ స్వీకారం సభ!

టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి మృతిచెందిన సహాన మృతదేహానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళులర్పించి, ...
23/10/2024

టీడీపీ కార్యకర్త రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి మృతిచెందిన సహాన మృతదేహానికి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్ రెడ్డి గారు,మాజీ మంత్రివర్యులు శ్రీమతి విడదల రజిని గారు మరియు పలువురు ప్రజాప్రతినిధులు.





Address

Chilakaluripet

Website

Alerts

Be the first to know and let us send you an email when YSR Congress Party - Chilakaluripeta posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share