14/03/2026
*చీరాలలో జరిగిన జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు*
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలనుసారం ఈరోజు చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీ చీరాల నియోజకవర్గ పరిశీలికులు మరియు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ మెంబర్ అలా అనిల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగినటువంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఈ వేడుకలలో మొదటగా వేటపాలెం రావూరు రోడ్డు వద్ద గల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం ర్యాలీగా చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం(దేశాయిపేట)లో జండా ఆవిష్కరించడం జరిగినది. సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అనిల్ కుమార్ గారు మాట్లాడుతూ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలోను, చీరాల పట్టణ వాడరేవు బస్టాండ్ వద్ద ఉన్న జనసేన దిమ్మ వద్ద ఏర్పాటు చేసిన జెండా ఆవిష్కరణను, ఏరియా హాస్పిటల్ నందు బాలింతలకు పండ్లు వితరణ చేయడంతో పాటు, కొత్తపేట గ్రామం నందు ఏర్పాటుచేసిన జనసేన దిమ్మ వద్ద జండా ఆవిష్కరణతో పాటు తోట వారి పాలెం వద్ద జనసేన జెండా ఆవిష్కరణ మరియు ఏర్పాటు చేసిన సభతో ఈ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగినవి అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చీరాల నియోజకవర్గంలో వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొని అత్యంత విజయవంతం చేయడమైనది అని ప్రత్యేకం గా కోనీయాడడం జరిగినది.
JanaSena Party
Pawan Kalyan
Nadendla Manohar
Naga Babu
Anil Ala
R K Naidu
Patsamatla Dharmaraju-PDR
Bhupathi Manoj Naidu
Harsha Pspk
Thota Ashok Chakravarthi
Chillapalli Srinivasarao
Janasena Party Chirala Constituency
Lalith Kumar Doguparthi
జనసేన పార్టీ చీరాల నియోజకవర్గం