14/02/2025
చిత్తూరు లో పాత బస్టాండ్ బాధితుల అంశం రోజు రోజుకు వివాదాస్పదమౌతోంది. దశాబ్దాలుగా చిరు వ్యాపారాలతో పొట్ట పోసుకుంటున్న తమను ఉన్నఫలంగా రోడ్డుకు ఏడ్చటం తగదని బాధితులు ఆవేదన చెందారు. ప్రజల జీవన ప్రమాణాలను మార్చటమే అభివృద్ధి కానీ , పేదల శవాలపై నిర్మించే నిర్మాణాలు అభివృద్ధి కాదని చిరు వ్యాపారులు కన్నీరు మున్నీరయ్యారు. వైసీపీ చిత్తూరు నియోజకవర్గం ఇంచార్జ్ *ఎంసీ విజయానందరెడ్డి* గారి నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు *భూమన కరుణాకర రెడ్డి* గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బాధితులను ఉద్దేశించి భూమన మాట్లాడుతూ చిరువ్యాపారుల కడుపు కొట్టొద్దని, వారికి అండగా వైసీపీ పార్టీ నిలుస్తుందని అన్నారు. ఇప్పటికే ఈ అంశం తమ అధినేత జగన్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. టీడీపీ ప్రభుత్వం తీరు మార్చుకోక పోతే అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు కు వచ్చి బాధితుల పక్షాన నిలుస్తారని భూమన హామీ ఇచ్చారు. వైసీపీ చిత్తూరు ఇంచార్జ్ *ఎంసీ విజయానందరెడ్డి* గారు మాట్లాడుతూ చిత్తూరు స్థానిక ప్రజా ప్రతినిధి వ్యవహారాన్ని తప్పు బట్టారు. పేదల అంశంలో తన పార్టీలోని సీనియర్ల అభిప్రాయాలను తీసుకొని అడుగులు వేయాలను సూచించారు. బడుగు , బలహీన , ముస్లిం ,మైనార్టీ , పేద వర్గాలను రోడ్డుకు ఈడ్చటం తగదన్నారు. ఎక్కడ విలువైన భూమి కనబడితే అక్కడ పసుపు రంగు రేకులతో షెడ్డు వేస్తున్నారని విమర్శించారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విఫలం చేయాలని అధికారులు నిన్నటి నుంచే సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రచారం చేసినా , బాధితులు ఏ మాత్రం భయపడకుండా తమ గోడు వినిపించడానికి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనటం హర్షణీయమని కొనియాడారు. ఆరు నూరైనా తాను బాధితుల పక్షాన నిలుస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, వీధి వర్తకులు , తోపుడు బండ్ల వ్యాపారులు , మహిళలు, వైసిపి సీనియర్ల నాయకులు , యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
MC Vijayananda Reddy
Abhinay Bhumana
YSRCP Chittoor