07/01/2024
*చిత్తూరు జనసేన పార్టీ కమిటీల పై శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో చర్చ*
ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు Dr. పసుపులేటి హరిప్రసాద్ గారి ఆదేశాల మేరకు, చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మరియు కార్యకర్తలు గౌరవనీయులు PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారిని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో కలిసి దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని చిత్తూరు నియోజకవర్గ మరియు నగర సమస్యలు, ధౌర్జన్యాలు, భూ అక్రమణల పై వారి దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కార మార్గాలు నియోజక వర్గ అభివృద్ధి ప్రాణాలికలను వారితో చర్చించడం తో పాటు చిత్తూరు నియోజకవర్గం మరియు నగర కమిటీల పై వారి ఆదేశాలు తీసుకొని రావడం జరిగింది.
అనంతరం చిత్తూరు ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకులు Dr.డి. బి. రాజేంద్ర నాయుడు గారిని PAC చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో జనసేన పార్టీ లోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి మరియు చిత్తూరు POC ఆరణి కవిత, రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ వుయ్యాల శ్రీనివాస్, రాష్ట్ర కార్యక్రమ నిర్వహణ కార్యదర్శి ఎ. కె శరవణ, చిత్తూరు జిల్లా సంయుక్త కార్యదర్శి నెహ్రూ రాయల్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు డేగల యుగంధర్, నానబాల లోకేష్, ఆవుల రమేష్, చిత్తూరు జనసేన నాయకులు శ్రీ రామ్ లోచన్, ధీరజ్ దుద్ధి, వీరం వినోద్, దీపక్ రాయల్ పాలుగొన్నారు.
--జనసేన పార్టీ
చిత్తూరు