District Collector, Chittoor

District Collector, Chittoor District Collector, Chittoor has opened this account for taking the suggestions from the public

ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో కీలకం– జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్చిత్తూరు, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి కేవల...
05/09/2026

ఉపాధ్యాయుల పాత్ర సమాజ నిర్మాణంలో కీలకం
– జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్
చిత్తూరు, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, సమాజ రూపురేఖలను మార్చే శక్తి అని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు.
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా చిత్తూరు జెడ్పీ కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎమ్మెల్సీ, విప్ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పాఠ్యాంశాలతో పాటు విలువలు, క్రమశిక్షణను బోధించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని అన్నారు.
కార్యక్రమంలో డీఈఓ లక్ష్మీనారాయణ, ఎస్‌ఎస్‌ఏ పీడీ వెంకటరమణ, జడ్పీ సీఈఓ రవి ప్రకాష్ నాయుడు, అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్చిత్తూరు, సెప్టెంబర్ 01: జిల్ల...
01/09/2026

రోడ్డు ప్రమాదాల నివారణకు సమన్వయంతో చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్

చిత్తూరు, సెప్టెంబర్ 01: జిల్లా కలెక్టర్ మరియు జిల్లా రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ సుమిత్ కుమార్, ఐఏఎస్ అధ్యక్షతన కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి రోడ్డు భద్రతా కమిటీ సమావేశం నిర్వహించారు.

జిల్లాలో అధిక ప్రమాదాలు నమోదవుతున్న NH-69 (బెంగళూరు–పలమనేరు–చిత్తూరు–చెన్నై), NH-140 (చిత్తూరు–తిరుపతి), NH-42 (కుప్పం–పలమనేరు) రహదారులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రమాదాల నివారణకు అవసరమైన తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

జాతీయ రహదారులపై తగిన లైటింగ్, రహదారి భద్రతా ప్రమాణాలు, ప్రమాదకర ప్రాంతాల్లో అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలోని అన్ని జాతీయ రహదారులపై నిర్వహించిన సంయుక్త తనిఖీలలో గుర్తించిన లోపాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి, సరిదిద్దాల్సిన చర్యలతో నివేదిక సమర్పించాలని సంబంధిత NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు.

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను విశ్లేషించి, అవి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. PM-RAHAT పథకం అమలు, ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం, 104/108 అత్యవసర సేవల పనితీరుపై కూడా సమీక్షించారు.

రోడ్డు భద్రతపై ప్రజల నుంచి వస్తున్న సూచనలు, ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రోడ్డు ప్రమాదాలను, ముఖ్యంగా ప్రాణాంతక ప్రమాదాలను తగ్గించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో ఎస్పీ, డీటీసీ, డీఎఫ్‌ఓ, ఎస్‌ఈ ఆర్‌అండ్‌బీ, NHAI ప్రాజెక్ట్ డైరెక్టర్లు/ఈఈలు, డీఈఓ, డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్, మున్సిపల్ కమిషనర్లు, ఆర్టీసీ ఆర్‌ఎం, డీపీఓ, మైన్స్ అండ్ జియాలజీ అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఏపీఎస్‌పీడీసీఎల్, 104/108, ఐఆర్‌ఏడీ, ఇన్సూరెన్స్, ఎన్టీఆర్ వైద్యసేవ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం 🤝🛵చిత్తూరు కలెక్టరేట్‌లోని PGRS సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ...
28/08/2026

దివ్యాంగులకు అండగా ప్రభుత్వం 🤝🛵

చిత్తూరు కలెక్టరేట్‌లోని PGRS సమావేశ మందిరంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో 59 మంది దివ్యాంగులకు మూడు చక్రాల స్కూటర్లను ఉచితంగా పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, చుడా చైర్మన్ కటారి హేమలత, మున్సిపల్ డిప్యూటీ మేయర్ రాజేష్, వికలాంగుల చైర్మన్ నారాయణస్వామి, అధికారి వినోద్ తదితరులు పాల్గొన్నారు.
స్వావలంబనకు తోడ్పాటు.. దివ్యాంగుల సాధికారతే లక్ష్యం..

*చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*చిత్తూరు, ఆగస్టు 15: 80వ స్వాతంత్ర్య దినోత్స...
15/08/2026

*చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు*

చిత్తూరు, ఆగస్టు 15:

80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా చిత్తూరు పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో శుక్రవారం జాతీయ పతాకాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మరియు వైద్య విద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ బలగాల గౌరవ వందనాన్ని స్వీకరించారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ తుషార్ డూడి, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కే. మురళీమోహన్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్గాన్ డొనేషన్‌పై చైతన్యం పెరగాలి: కలెక్టర్ సుమిత్ కుమార్అపోలోలో ఘనంగా ఆర్గాన్ డొనేషన్ డే – భారీ అవగాహన ర్యాలీచిత్తూరు,...
13/08/2026

ఆర్గాన్ డొనేషన్‌పై చైతన్యం పెరగాలి: కలెక్టర్ సుమిత్ కుమార్
అపోలోలో ఘనంగా ఆర్గాన్ డొనేషన్ డే – భారీ అవగాహన ర్యాలీ
చిత్తూరు, ఆగస్టు 13: సమాజంలో ఆర్గాన్, బాడీ డొనేషన్‌పై ప్రజల్లో మరింత అవగాహన పెరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. ప్రపంచ ఆర్గాన్ డొనేషన్ డే సందర్భంగా అపోలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (AIMSR), అపోలో యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రసంగించారు.
రాష్ట్రంలో కిడ్నీ మార్పిడి కోసం సుమారు 4,800 మంది ఎదురుచూస్తుండగా, సంవత్సరానికి కేవలం 350 మందికి మాత్రమే ట్రాన్స్‌ప్లాంటేషన్ జరుగుతోందని తెలిపారు. మరిన్ని ట్రాన్స్‌ప్లాంటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
అనంతరం కలెక్టర్ సుమిత్ కుమార్ జెండా ఊపి ఆర్గాన్, బాడీ డొనేషన్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అపోలో విద్యార్థులు, అధ్యాపకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్లకార్డులు, నినాదాలతో ప్రజలకు అవగాహన కల్పించారు. అపోలో నాలెడ్జ్ సిటీ నుంచి మురకంబట్టు సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.

శిశు విహార్‌లో సౌకర్యాల పరిశీలన – అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశంచిత్తూరు, ఆగస్టు 13: చిత్తూరు కలెక్టరే...
13/08/2026

శిశు విహార్‌లో సౌకర్యాల పరిశీలన – అభివృద్ధి పనులు వెంటనే చేపట్టాలని కలెక్టర్ ఆదేశం

చిత్తూరు, ఆగస్టు 13: చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని శిశు విహార్‌ను జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ సందర్శించి అక్కడి సౌకర్యాలు, సేవలను పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి వారి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా దత్తత రికార్డులు, మిషన్ వాత్సల్య పోర్టల్‌లో దత్తతకు సంబంధించిన డేటా నమోదును కలెక్టర్ తనిఖీ చేశారు. శిశు విహార్‌లో భవనానికి పెయింటింగ్, వైరింగ్, కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, ఓపెన్ కారిడార్ పైకప్పుపై ఇనుప గ్రిల్ ఏర్పాటు వంటి అభివృద్ధి, భద్రతా పనులను తక్షణమే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పిల్లల ఆరోగ్య పరీక్షల కోసం పీడియాట్రిషియన్‌ను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డిని ఆదేశించారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పనులను ప్రాధాన్యతా ప్రాతిపదికన పూర్తి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను సూచించారు.

శిశు విహార్‌లోని పిల్లలకు మిల్క్ పౌడర్ ప్యాకెట్ల కొనుగోలుకు జిల్లా కలెక్టర్ నిధుల నుంచి రూ.25,000లను తక్షణమే విడుదల చేశారు. పిల్లల సంరక్షణ, ఆరోగ్యం, సర్వతోముఖ అభివృద్ధికి సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా శిశు సంక్షేమ సాధికారత అధికారిణి వెంకటేశ్వరి, డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగశశిభూషణ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, సూపరింటెండింగ్ ఇంజనీర్ (పంచాయతీరాజ్) కె. మల్లికార్జున మూర్తి, డీసీపీఓ సుబ్రమణ్యం, ప్రొటెక్షన్ ఆఫీసర్లు రాధ, శివశంకర్, లీగల్ ఆఫీసర్ వెంకటేశులు, శిశు విహార్ మేనేజర్ రమ్య తదితరులు పాల్గొన్నారు.

రూ.52 లక్షలతో నిర్మించిన నూతన పార్క్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్చిత్తూరు, ఆగస్టు 13: కలెక్టరేట్‌ వద్ద రూ.52 లక్షల వ్...
13/08/2026

రూ.52 లక్షలతో నిర్మించిన నూతన పార్క్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

చిత్తూరు, ఆగస్టు 13: కలెక్టరేట్‌ వద్ద రూ.52 లక్షల వ్యయంతో 1 ఎకరా 50 సెంట్ల విస్తీర్ణంలో నూతనంగా నిర్మించిన పార్క్‌ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ గురువారం పరిశీలించారు.

పార్క్‌లో చేపట్టిన అభివృద్ధి పనులు, మౌలిక వసతులను పరిశీలించిన కలెక్టర్, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు 15న నూతన పార్క్‌ను ఘనంగా ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. పార్క్‌ను ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు తెలిపారు .

సీఎంఓ నుంచి వచ్చిన నాలుగు ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తక్షణ స్పందనచిత్తూరు, ఆగస్టు 6: ముఖ్యమంత్రి కార్యాలయ...
06/08/2026

సీఎంఓ నుంచి వచ్చిన నాలుగు ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తక్షణ స్పందన

చిత్తూరు, ఆగస్టు 6: ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి అందిన నాలుగు ప్రజా ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ స్వయంగా స్పందించారు.

ఫిర్యాదుదారులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తెలుసుకుని, అనంతరం సంబంధిత శాఖల అధికారులతో వివరాలు సమీక్షించారు.
క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలన చేపట్టి, అర్హత మేరకు తగిన చర్యలు తీసుకుని సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును అత్యంత ప్రాధాన్యంతో తీసుకుని, నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

పరిశీలించిన ఫిర్యాదులు:

శ్రీ సి. జనార్ధన్ రెడ్డి – పెద్దపల్లె, వి.కోట మండలం.

శ్రీమతి ముప్పిరెడ్డి దీప నారాయణి – రొంపిచర్ల మండలం.

శ్రీ జి. మురుగేష్ – పండ్యాలమడుగు, రామకుప్పం మండలం.

శ్రీ రాజప్ప – వెర్నమల్ల గ్రామం, రామకుప్పం మండలం.

ఈ నాలుగు ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, అవసరమైన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

కుప్పంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్కుప్పం, ఆగస్టు 4: కుప్పం నియోజకవర్గంలోన...
04/08/2026

కుప్పంలో ఇస్కాన్ ఆలయ నిర్మాణానికి ప్రతిపాదిత స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

కుప్పం, ఆగస్టు 4: కుప్పం నియోజకవర్గంలోని పెద్దబంగారు నత్తం, బేవనపల్లి రెవెన్యూ విలేజ్ పరిసర ప్రాంతాల్లో ఇస్కాన్ (ISKCON) ఆలయ నిర్మాణానికి ప్రతిపాదించిన భూములను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా పీడీ కడా వికాస్ మర్మత్, APSRTC వైస్. చైర్మన్ పి.ఎస్ మునిరత్నం, ఇస్కాన్ ప్రతినిధులతో కలిసి ప్రతిపాదిత స్థలాలను సందర్శించి, ఆలయ నిర్మాణానికి అనువైన పరిస్థితులు, భూమి విస్తీర్ణం, చేరుకునే మార్గాలు, అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాలు తదితర అంశాలను పరిశీలించారు.

ఆలయ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలను నిబంధనల మేరకు పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు.

పూతలపట్టు, ఆగస్టు 4: ఐరాల మండలంలోని మొరంపల్లి గ్రామ ప్రాథమిక విద్యాశాఖ పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్...
04/08/2026

పూతలపట్టు, ఆగస్టు 4: ఐరాల మండలంలోని మొరంపల్లి గ్రామ ప్రాథమిక విద్యాశాఖ పాఠశాల పునఃప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఐఏఎస్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు కె. మురళీమోహన్ పాల్గొని పాఠశాలను ప్రారంభించారు.

Address

Collecterate
Chittoor
517002

Alerts

Be the first to know and let us send you an email when District Collector, Chittoor posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share