Bennavolu boys

Bennavolu boys Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Bennavolu boys, Landmark & historical place, bennavolu, Chodavaram.

17/05/2017

Story time ☺
అనగనగా ఒక వూళ్లొ రామన్న అనే యువకుడు ఉండేవాడు. అతని తల్లి రెండు మూడు ఇళ్లల్లో పాచిపని చేసి డబ్బులు సంపాదించేది. రామన్నకి కూలీనాలీ పనులు చేసి సంపాదించాలంటే ఇష్టం ఉండేది కాదు. పేదరికానికి విసిగిపోయి, రాజుగారి కొలువులో ఏదో ఒక పనిని సంపాదించి తల్లిని సుఖపెట్టాలనే నిర్ణయానికి వచ్చాడు.
ఒకరోజు ఉదయాన్నే లేచి రాజుగారి దగ్గరికి బయల్దేరాడు. అతనికి తల్లి దారిలో తినడానికి చద్దన్నం మూటకట్టి ఇచ్చింది. చాలా దూరం నడిచాక మధ్యాహ్నం ఓ చెట్టు కింద కూర్చుని అన్నం తినబోతుండగా ఒక నడివయసు వ్యక్తి అక్కడికి కుంటుకుంటూ వచ్చాడు. అతని పాదం నుంచి రక్తం కారుతూ ఉంది. రామన్నకి జాలి వేసి అతడికి తన అన్నం పెట్టి, అతడి కాలికి చెట్ల ఆకులతో పసరు చేసి కట్టుకట్టాడు.
ఇంతలో దూరంగా గుర్రపు డెక్కల శబ్దం వినిపించింది. ఆ వ్యక్తి గాభరాగా ‘నాపేరు గంగూ. నేనొక గజదొంగని. రాజు, భటులు నన్ను వెంబడిస్తున్నారు. నా పాదానికి గాయం కావడం వల్ల పరిగెత్తలేను. ఈ చెట్టు ఎక్కి దాక్కుంటాను. ఎవరికీ చెప్పకు. నీకు కావలసినంత ధనం ఇస్తాను’ అంటూ చెట్టు ఎక్కి దాక్కున్నాడు. ఇంతలో అక్కడికి రాజు, ఇద్దరు భటులు గుర్రాల మీద ఆ చోటుకి వచ్చారు.
‘ఎవరైనా ఇటు వచ్చారా?’ అని అడిగాడు రాజు. రామన్న లేదన్నాడు. రాజుకు అనుమానం వచ్చి, ‘ఇదిగో మేం గజదొంగ కోసం వెతుకుతున్నాం. నీకు తెలిసీ చెప్పకపోతే తప్పు చేసినవాడివి అవుతావు’ అంటూ గద్దించాడు. రామన్న ఏం చేయాలా అని ఆలోచిస్తుండానే గంగూ గబుక్కున చెట్టు మీంచి దూకి రామన్న కంఠానికి కత్తి ఆనించి ‘నన్ను బంధించాలని చూసారో ఈ రామన్న ప్రాణాలు తీస్తాను’ అంటూ రాజుని హెచ్చరించాడు. రామన్న నిర్ఘాంతపోయాడు. ఆకలేస్తోందంటే అన్నం పెట్టి, గాయానికి కట్టుకడితే గంగూ ఇలా చేయడంతో రామన్నకి జ్ఞానోదయమైంది. వెంటనే గంగూ కాలికి గాయమైన చోట తన కాలితో తొక్కాడు. గంగూ ‘అబ్బా...’ అనుకునేంతలోనే అతడి చేతిలో ఉన్న కత్తిని లాగేసుకున్నాడు. వెంటనే రాజభటులు గంగూని పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. రామన్న వెంటనే రాజుగారి కాళ్లమీద పడి, ‘మానవత్వమనుకుని నీచుడికి సాయపడాలనుకుంటే ఏమవుతుందో తెలుసుకున్నాను. నన్ను క్షమించండి’ అన్నాడు. రాజు రామన్నని క్షమించడమే కాక, అతడి కథ తెలుసుకుని తన కొలువులో తగిన ఉద్యోగం ఇచ్చి ఆదరించాడు.

12/09/2015
hi
12/09/2015

hi

good morning frnds
12/09/2015

good morning frnds

hi frds
12/09/2015

hi frds

25/08/2015

hi frnds

17/07/2015

Address

Bennavolu
Chodavaram
531036

Telephone

9440446886

Website

Alerts

Be the first to know and let us send you an email when Bennavolu boys posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share