15/08/2026
తూర్పుగోదావరి జిల్లా..
డాక్టర్ ప్రియాంక ఘటనపై రాజమండ్రి ప్రసాదిత్య మాల్ వద్ద తీవ్ర నిరసన వ్యక్తం చేసిన వైయస్ఆర్ సీపీ నేతలు..కొవ్వొత్తులు వెలిగించి ప్రియాంకకు ఘన నివాళులు అర్పించిన మాజీ మంత్రులు కన్నబాబు గారు, తానేటి వనిత గారు, వేణుగోపాలకృష్ణ గారు, మాజీ ఎంపీ భరత్ రామ్ గారు, చింతా అనురాధ గారు, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా గారు, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారు, ధనలక్ష్మి గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి గారు, వైయస్ఆర్ సీపీ నేతలు
నిందితులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్..నిందితులను కాపాడిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు
డాక్టర్ ప్రియాంక ఘటనపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు దారుణమని అభిప్రాయపడిన వైయస్ఆర్ సీపీ నాయకులు. ప్రియాంక తండ్రి తన ఆవేదనను వెల్లడించుకునే వరకు ప్రభుత్వం స్పందించకపోవడం
అమానవీయమన్న నేతలు
ప్రియాంక ఘటనపై న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న మాజీ ఎంపీ భరత్. గత ప్రభుత్వం అమలు చేసిన దిశ చట్టాన్ని ఎందుకు ఇప్పటి ప్రభుత్వం అమలు చేయలేకపోతుందో చెప్పాలన్న నాయకులు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకోనున్న పవన్ కళ్యాణ్ ఎక్కడ అని ప్రశ్నించిన వైయస్ఆర్ సీపీ మహిళా నేతలు..ప్రియాంక ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడంపై తీవ్రస్థాయిలో నిరసన.