18/01/2023
తెలుగువారి ఆరాధ్య దైవం,
తెలుగు వారి పౌరుషానికి ప్రతీక,
తెలుగువారి ఔన్నత్యాన్ని , కీర్తి చంద్రికలను నలు దిశల విశ్వవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు...!
మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో రెండు చరిత్రలు సృష్టించిన శకపురుషుడు ఎన్టీఆర్. ప్రజాహిత పాలనకు, సంక్షేమ పథకాలకు ఆద్యుడిగా... తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా... జాతీయ రాజకీయాలకు సరికొత్త దిశా నిర్దేశం చేసిన ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులు.
రాజకీయాల్లో మహిళల, బడుగు వర్గాల ప్రాతినిధ్యాన్ని పెంచేందుకు, అట్టడుగు వర్గాలకు సంక్షేమాన్ని అందించేందుకు... మహిళలకు ఆస్తి హక్కు, బీసీలకు రిజర్వేషన్లు, రెండు రూపాయలకే కిలో బియ్యం వంటి పథకాలతో సమసమాజ స్థాపనకు బాటలు వేసిన ఎన్టీఆర్ ఆశయ సాధనకు మనందరం కృషిచేద్దాం...