PS Dornakal

PS Dornakal Official Page of Dornakal Police Station of Mahabubabad District, Telangana, India.

In Emergency Dial ☎100
To Report Cyber Crimes Dial ☎1930
OR Visit
www.cybercrime.gov.in
Block the IMEI of a lost/stolen Mobile Phone at www.ceir.gov.in

14/10/2025

మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ – వ్యాసరచన పోటీ

పోలీసు విధుల్లో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన పోలీసు సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న “పోలీస్ సంస్మరణ దినోత్సవం (Police Flag Day)”గా నిర్వహించబడుతుంది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ ఆధ్వర్యంలో **ఆన్‌లైన్ వ్యాసరచన పోటీ (Essay Writing Competition)**ని ఆంగ్లం / తెలుగు / ఉర్దూ భాషల్లో నిర్వహించబడుతుంది.

6వ తరగతి నుండి పీజీ (Post Graduation) వరకు చదువుతున్న విద్యార్థులు అందరూ ఈ పోటీలో పాల్గొనవచ్చు.

వ్యాసరచన విషయం:
“మత్తు పదార్థాల సమస్య నిరోధించడంలో పోలీసు పాత్ర మరియు విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధానం”
"DRUGS MENANCE:
ROLE OF POLICE IN PREVENTION AND HOW STUDENTS CAN STAY AWAY FROM DRUGS.".

పోటీ లో పాల్గొనే విధానం:

1. కింది లింక్‌పై క్లిక్ చేయండి:
👉 https://forms.gle/jaWLdt2yhNrMpe3eA

2. మీ పేరు, విద్య, ఇతర వివరాలు నమోదు చేయండి.
3. వ్యాసం పేపర్‌పై రాసి, దాని ఫోటో లేదా PDF రూపంలో అప్‌లోడ్ చేయాలి (500 పదాలకు మించకుండా) మరియు సబ్మిట్ చేయాలి.
4. వ్యాసం సమర్పణకు చివరి తేది: 31-10-2025

జిల్లా స్థాయిలో ప్రతి భాష (తెలుగు, ఆంగ్లం, ఉర్దూ)లో మొదటి, రెండవ, మూడవ బహుమతి పొందిన విజేతలకు మెమెంటోలు / బహుమతులు అందజేయబడతాయి.
ఈ కార్యక్రమానికి స్థానికంగా ప్రసిద్ధులైన సీనియర్ నాయకులు, రిటైర్డ్ ప్రిన్సిపల్స్, హెడ్మాస్టర్స్, రచయితలు, కవులు, సామాజిక సేవకులు వంటి ప్రముఖులను ఆహ్వానించి బహుమతులు అందజేయబడతాయి.

అలాగే, విజేతల వివరాలు మహబూబాబాద్ జిల్లా పోలీసు శాఖ అధికారిక సోషల్ మీడియా పేజీలలో ప్రచురించబడతాయి.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-
సుధీర్ రాంనాధ్ కేకన్, IPS.,
ఎస్పీ మహబూబాబాద్ జిల్లా
-=-=-=-=-=-=-=-=-=-=-=-=-

31/08/2025

డోర్నకల్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా చంద్రమౌళి బాధ్యతలు స్వీకరణ

డోర్నకల్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా చంద్రమౌళిని నియమిస్తూ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చంద్రమౌళి శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్నాథ్ కేకన్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

25/07/2025

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు తెలిపారు. వాగులు, కాలువలు, చెరువులు, రిజర్వాయర్ల వద్దకు వెళ్లవద్దని సూచించారు. వరద నీటిలోకి ప్రవేశించకండి. చెట్ల కింద నిలవవద్దు, పాడైన లేదా శిథిల భవనాల్లో ఆశ్రయం తీసుకోకండి. విద్యుత్ తీగలు తడిగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. ప్రజలు సురక్షితంగా ఉండేందుకు అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, ఇంట్లోనే ఉండాలని కోరారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 కంట్రోల్ రూమ్ ద్వారా సహాయం పొందవచ్చని తెలిపారు.

25/07/2025

మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖకు చెందిన ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు ఇటీవల అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ASI) పదవికి పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా వారు జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

కేసముద్రం పోలీస్ స్టేషన్కు చెందిన శ్రీ ఆర్. సాదయ్య (PC No. 2106), మహబూబాబాద్ రూరల్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న శ్రీ జి. కృష్ణ నాయక్ (PC No. 2178), డిస్ట్రిక్ట్ స్పెషల్ బ్రాంచ్కు చెందిన శ్రీ టి. కుమారస్వామి (PC No. 2067) పదోన్నతిని పొందిన అధికారులు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వారిని అభినందిస్తూ, కొత్త పదవుల్లో నిబద్ధతతో, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలతో మమేకం అవుతూ, నైతిక విలువలు, నిజాయితీతో పనిచేయాలని, పోలీస్ శాఖపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా వ్యవహరించాలని సూచించారు. యువ పోలీసులకు ఆదర్శంగా నిలవాలని, శాంతి భద్రతల పరిరక్షణలో వారు మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు.

15/06/2025

జాతీయ మెగా లోక్ అదాలత్‌లో 8344 కేసుల పరిష్కారం

జూన్ 14 (శనివారం) నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మహబూబాబాద్ జిల్లా పరిధిలో 8344 కేసులు రాజీ మార్గంలో పరిష్కరించబడ్డాయి.

ఈ సందర్భంగా, లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారంలో కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారు అభినందించారు.

వివరాలు:

1. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ మరియు కోర్టు విచారణలో ఉన్న కేసులు – 641
2. సైబర్ క్రైం కేసులు – 27
3. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు – 1124, MV యాక్ట్ కేసులు (ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవి) – 5465
4. ఇతర చిన్నపాటి కేసులు – 1087

కేసుల రాజీ మార్గంలో పరిష్కారం కోసం పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరిస్తూ, నిందితులు మరియు కక్షిదారులకు పూర్తి సమాచారం అందించి, అవగాహన కల్పించారు.

కేసుల పరిష్కారంలో చక్కటి సేవలు అందించిన పోలీస్ అధికారులు, కోర్టు సిబ్బంది, కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు.

అంతేగాక, ఈ కార్యక్రమాన్ని ప్రతి రోజు సమీక్షిస్తూ కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసిన N. తిరుపతి రావు (మహబూబాబాద్ DSP), K. కృష్ణ కిషోర్ (తొర్రూర్ DSP), Y. సత్యనారాయణ (DCRB ఇన్‌స్పెక్టర్), జిల్లా పరిధిలోని CIలు, SIలు, కోర్ట్ మానిటరింగ్ SI జీనత్ గారిని కూడా ప్రత్యేకంగా ప్రశంసించారు.

13/06/2025

లోక్ అదాలత్‌లో కక్షిదారులు రాజీ అవకాశాన్ని వినియోగించుకోవాలి : మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS

ఈ నెల 14న జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనున్న సందర్భంగా కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మహబూబాబాద్ జిల్లా పోలీస్ అధికారి శ్రీ సుధీర్ రాంనాధ్ కేకన్, IPS గారు కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ — లోక్ అదాలత్‌లో పరస్పర అంగీకారంతో పరిష్కరించదగిన కేసులకు రాజీ అవకాశముందని చెప్పారు.

క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, సివిల్ వివాదాలు, ఆస్తి విభజన, కుటుంబ సమస్యలు, వైవాహిక సమస్యలు, బ్యాంకు రుణ రికవరీ, విద్యుత్ చోరీ, చెక్ బౌన్స్ వంటి కేసుల్లో ఇరు పక్షాల సమ్మతితో రాజీ చేసుకునే వీలు ఉంటుందని తెలిపారు.

‘‘రాజీ మార్గమే శ్రేయస్కరం’’ అని ఎస్పీ గారు స్పష్టం చేస్తూ — చిన్న చిన్న సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ విలువైన సమయాన్ని, ఖర్చులను వృథా చేసుకోవద్దని, జుడిషియల్ శాఖ అందిస్తున్న ఈ సదవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని సూచించారు.

జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధుల్లో ఉన్న కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది రాజీ చేయదగిన కేసులను గుర్తించి, సంబంధిత ఇరు పక్షాలను పిలిపించి కౌన్సిలింగ్ ద్వారా అవగాహన కల్పించి, రాజీకి తోడ్పాటునివ్వనున్నట్లు వెల్లడించారు. తమ కేసుల్లో రాజీ చేసుకోవాలనుకునేవారు సమీప పోలీస్ స్టేషన్ లేదా అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితంగా న్యాయం కలిగించడమే లక్ష్యమని ఎస్పీ గారు తెలియజేశారు.

02/06/2025

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు జిల్లా పోలీస్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి, సిబ్బంది మరియు జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

21/05/2025
21/05/2025

ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల్లో సెక్షన్ 163 BNSS అమలు.పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు, పరిసరాలలో పెట్రోలింగ్.

*జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS*

మే 22 నుండి 29 వరకు మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 14 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సందర్భంగా, ప్రతి రోజు ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు భారతీయ నాగరిక సురక్షా సంహిత (BNSS) 2023 లోని సెక్షన్ 163 ను అమలు చేస్తామని జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ IPS గారు తెలిపారు.

ఈ నేపథ్యంలో పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించిన గుంపులు గుంపులుగా చేరడం, సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డిజేలు, ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారాలు నిర్వహించడం నిషిద్ధం అని స్పష్టం చేశారు.

పరీక్ష సమయాల్లో కేంద్రాల చుట్టూ ఉండే ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.

పరీక్షలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు భద్రతా చర్యల భాగంగా సెక్షన్ 163 BNSS అమలు చేస్తున్నట్లు తెలిపారు.

ప్రజలు, రాజకీయ పార్టీలు, సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు.

పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, పోలీస్ పెట్రోలింగ్, నిఘా టీములు ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిఘా పెట్టి, అవసరమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Address

Dornakal
506381

Alerts

Be the first to know and let us send you an email when PS Dornakal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share