Rajanagaram YSRCP

Rajanagaram YSRCP RAJANAGARAM, EASTGODAVARI , ANDHRA PRADESH.

23/08/2024

అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో 30 కంపెనీలు (జగన్ తెచ్చినవి) క్రెడిట్ తన ఖాతాలో వేసుకున్నాడు
తన హయాంలో తెచ్చిన కంపెనీలో ప్రమాదం జరిగితే.. గత పాలకుల నిర్లక్ష్యం అంటూ క్రెడిట్ జగన్ ఖతాలో వేశాడు...

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా మరోసారి నియమితులైన మా అన్నయ్య   గారికి హృదయపూర్వక శుభాకాంక...
23/08/2024

వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా మరోసారి నియమితులైన మా అన్నయ్య గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ...

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ♥️
19/08/2024

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ♥️




వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచ...
05/08/2024

వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు.

వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్‌లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలు

చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి రోడ్డున పడిన లక్షలాది మంది వాలంటీర్లు.

#

గడప వద్దకే పింఛను అని నారా చంద్రబాబు నాయుడు  కబుర్లు చెప్తున్నాడు. వాస్తవానికి టీడీపీ నేతల హడావుడితో ఊరూరా అవ్వాతాతలకి త...
04/08/2024

గడప వద్దకే పింఛను అని నారా చంద్రబాబు నాయుడు కబుర్లు చెప్తున్నాడు. వాస్తవానికి టీడీపీ నేతల హడావుడితో ఊరూరా అవ్వాతాతలకి తిప్పలు తప్పడం లేదు.

కొన్ని చోట్ల సచివాలయం దగ్గరికి, మరికొన్ని చోట్ల ఊరు రచ్చబండ దగ్గరికి పింఛనుదారులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి.

తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీ పబ్లిసిటీ పిచ్చితో పండుటాకులకి తప్పని తిప్పలు

#

నారా లోకేష్ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీల ఉన్మాదంవైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారి ప్రెస్‌మీట్‌కు వచ్చిన రిపోర్టర్ల పేర్లు, వారి ఫ...
27/07/2024

నారా లోకేష్ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీల ఉన్మాదం
వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి గారి ప్రెస్‌మీట్‌కు వచ్చిన రిపోర్టర్ల పేర్లు, వారి ఫోన్‌ నంబర్లు జాబితాను పోస్ట్‌చేసి ఉన్మాదం చాటుకున్న వైనం
జగన్‌గారికి కేటాయించిన భద్రతా సిబ్బంది నుంచి నేరుగా లోకేష్‌ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలకు వివరాలు
దీంతో వైయస్‌ జగన్‌ గారికి ప్రభుత్వం కేటాయించిన భద్రతా వ్యవస్థలోనూ బయటపడ్డ లోపాలు
మాజీ ముఖ్యమంత్రి భద్రతకు ముప్పు
ఆ ఫోన్‌ నంబర్ల ఆధారంగా నిన్నటి నుంచి సంబంధిత రిపోర్టర్లకు వేధింపులు

రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, ఇతర ప్రజాసంబంధిత అంశాలపై మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి నిన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను కవర్‌చేస్తున్న బీట్‌ రిపోర్టర్లను ఈ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు ఆహ్వానించడం జరిగింది. పార్టీ కార్యాలయం నుంచి కొన్నేళ్ల క్రితమే బహిష్కరించినందున సహజంగానే ఈటీవీ, టీవీ-5, ఏబీఎన్‌, ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ఎల్లోమీడియాను ఈ సమావేశానికి ఆహ్వానించలేదు. టీడీపీకూడా చాలా మీడియా సంస్థలపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాతకూడా వాటిపై నిషేధాన్ని కొనసాగిస్తోంది. ఇటీవల ఆ ఛానళ్లు రాకుండా కేబుల్‌ ఆపరేటర్ల ద్వారా బ్యాన్‌కూడా చేయించిన విషయం అందరికీ తెలిసిందే.
జగన్‌గారి పత్రికా సమావేశానికి వచ్చే రిపోర్టర్లకు ఎంట్రీ విషయంలో ఎలాంటి ఇబ్బందిరాకుండా ఉండాలనే ఉద్దేశంతో వారి జాబితాను, ఫోన్‌ నంబర్లను పార్టీ కార్యాలయ సిబ్బంది గేటు వద్దనున్న సెక్యూరిటీకి ఇవ్వడం జరిగింది. ఈ జాబితానే నేరుగా ఫొటో తీసి లోకేష్‌ మనుషులకు, అక్కడనుంచి టీడీపీ, లోకేష్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలకు విడుదలచేశారు. వారు తమ సోషల్‌మీడియా అకౌంట్ల లోనూ, వారి సోషల్‌ మీడియా మనుషులతోనే ఈజాబితాలను బహిర్గతంచేస్తూ అమానవీయమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన రిపోర్టర్ల ఫోన్‌ నంబర్లు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయడంతో నిన్నటినుంచి టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులు ఇష్టానుసారంగా వారికి ఫోన్లు చేసి వేధింపులకు దిగారు. ఈ పత్రికా సమావేశానికి హాజరైన వారిలో మహిళా జర్నలిస్టులు కూడా ఉన్నారు. వారి ఫోన్లకు గడచిన 36 గంటలుగా అసభ్య మెసేజ్‌లు, కాల్స్‌ వెల్లువెత్తుతున్నాయి. నారా లోకేష్‌ ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీ ఉన్మాదాలు ఈస్థాయిలో ఉన్నాయంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమపై వేధింపులకు ప్రభుత్వం లైసెన్స్‌ ఇచ్చినట్టుగా ఈ ఘటన కనిపిస్తోందన్న వ్యాఖ్యలు జర్నలిస్టులనుంచి వినిపిస్తున్నాయి.

ఇటు టీడీపీకూడా కొన్ని మీడియా సంస్థలకు చెందిన వ్యక్తులను తమ పార్టీ కార్యాలయానికి గాని, ముఖ్యమంత్రి నిర్వహించే పత్రికా సమావేశాలకుగాని రానివ్వడం లేదు. జగన్‌గారి మీడియా సమావేశాలకు ఆహ్వానించకపోతే దాన్ని పాత్రికేయులను నియంత్రించినట్టుగానూ, చంద్రబాబు ఆహ్వానించకపోతే దాన్ని ప్రజాస్వామ్యంగా చూపించే ప్రయత్నాన్ని ఈఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలు నిన్నటినుంచి ఆ జాబితాను పోస్టు చేస్తూ కామెంట్‌ చేస్తున్నాయి.

నిజానికి ప్రతిపక్షంలోనైనా, ఇప్పుడు అధికారం పక్షంలోనైనా కొంతమంది రిపోర్టర్లే చంద్రబాబు, టీడీపీ బీట్లు చూస్తారు. విషయం ఏంటంటే… వీరంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వారే. ఏబీఎన్‌ నుంచి ఉన్న రామారావు, టీవీ-5 నుంచి ఉన్న రాకేష్‌, ఈటీవీ తరపున ఉన్న కృష్ణ, టెన్‌ టీవీ నుంచి ఉన్న రవిచంద్ర, ఆంధ్రజ్యోతి భార్గవ, ఈనాడు బ్యూరో చీఫ్‌ కనపర్తి శ్రీనివాస్‌, మహాటీవీనుంచి అనిల్‌ వీరంతా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందినవారు విశేషం. ఇది ఆ జర్నలిస్టుల తప్పుకూడా కాదు. తనకి సంబంధించిన వాళ్లే తనచుట్టూ ఉండాలన్న చంద్రబాబు ఆలోచనా ధోరణివల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయి. కానీ జగన్‌గారు ఏనాడూ కూడా తన సామాజిక వర్గానికి చెందిన రిపోర్టర్లు మాత్రమే తన వెనుక ఉండాలని అనుకోలేదు.

అన్నిటికంటే కీలక అంశం ఏంటంటే.. జగన్‌గారికి కేటాయించిన సెక్యూరిటీ సిబ్బంది, ఆయన రక్షణకోసం ఉన్నట్టుగా కనిపించడంలేదు. ఆయన్ని కలవడానికి వచ్చేవారి వివరాలు ఇలా వెల్లడిస్తూ ఆయన భద్రతకు ముప్పుతెచ్చేలా వ్యవహరిస్తున్నారు. లేకపోతే ఈ జాబితా ఎలా బయటకు వెళ్లింది? అనే దానిపై తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

చంద్రబాబు తప్పుడు లెక్కలతో విడుదల చేసిన శ్వేతపత్రాలపై వాస్తవాలను చెబుతూ.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో సుద...
27/07/2024

చంద్రబాబు తప్పుడు లెక్కలతో విడుదల చేసిన శ్వేతపత్రాలపై వాస్తవాలను చెబుతూ.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడిన వైయస్ జగన్ గారు.

27/07/2024

మేము సామాన్యులకు కూడా అర్థమయ్యేలా చెప్తే కథ చెప్పాం అంటారు

కొండను ఎత్తి నా నెత్తి మీద పెట్టండి అప్పుడే నేను మోస్తానని చెప్పినట్టుంది.. చంద్రబాబు సూపర్ 6 హామీల కథ కూడా.

-బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ ఆర్ధిక మంత్రి

Address

East Godavari

Website

Alerts

Be the first to know and let us send you an email when Rajanagaram YSRCP posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share