Our Konaseema

Our Konaseema Like and follow for konaseema beautiful photos and News and More

గూడ్స్ ఆటోను  ఢీకొన్న స్పోర్ట్స్ బైక్  యువకుడు మృతి..  అమలాపురం రోళ్ల పాలెం హైవే రోడ్ లో  బైక్ పై వెళుతున్న తోట వినయ్ (2...
17/12/2025

గూడ్స్ ఆటోను ఢీకొన్న స్పోర్ట్స్ బైక్ యువకుడు మృతి.. అమలాపురం రోళ్ల పాలెం హైవే రోడ్ లో బైక్ పై వెళుతున్న తోట వినయ్ (23) చికిత్స పొందుతూ రాజమండ్రి లోని బొల్లినేని హాస్పటల్లో మృతి..
బైక్ పై వెళుతున్న మరో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో అమలాపురం శ్రీనిధి హాస్పిటల్ చికిత్స పొందుతున్నారు..

మన కోనసీమలో ప్రభుత్వ ఆధ్వర్యంలో Job Mela 765+ ఉద్యోగాలు 🎓 అర్హత: SSC నుంచి B.Tech వరకు🕘 వయస్సు: 18–45 సంవత్సరాలు📅 16-12-...
14/12/2025

మన కోనసీమలో ప్రభుత్వ ఆధ్వర్యంలో Job Mela 765+ ఉద్యోగాలు
🎓 అర్హత: SSC నుంచి B.Tech వరకు
🕘 వయస్సు: 18–45 సంవత్సరాలు
📅 16-12-2025
📍 Chaitanya Pvt ITI, Sivakodu
కెరీర్ స్టార్ట్ చేయడానికి ఇదే సరైన సమయం!

13/12/2025

పదో తరగతి విద్యార్థిని గుండెపోటుతో మృతి.
రామచంద్రపురం, అంబేద్కర్ కోనసీమ జిల్లా:
స్థానికంగా కలకలం రేపిన ఘటనలో ఓ ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని మృతి చెందింది.
పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి (14) రామచంద్రపురంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 10వ తరగతి చదువుతోంది. గురువారం పాఠశాలలో ఉండగానే ఆమె ఒక్కసారిగా సృహ తప్పి పడిపోయింది. విషయం గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే ఆమెను రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమికంగా గుండెపోటుతోనే మృతి చెందినట్లు వైద్యులు భావిస్తున్నారు.
సమాచారం అందుకున్న రామచంద్రపురం పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు.
బాలిక ఆకస్మిక మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

09/12/2025

మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

ముమ్మిడివరంలోని గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తితో పాటు అతనికి సహకరించిన మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు అమలాపురం డి.ఎస్.పి. టి ఎస్ ఆర్ కే ప్రసాద్ తెలిపారు. జిల్లాలో తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను మంగళవారం ఆయన మీడియాకు వివరించారు. కాట్రేనికోన మండలంలో ఓ గ్రామంలో బాలిక ఇంటి సమీపంలో నివసిస్తున్న మోకా గిరిబాబు, నేరేడుమిల్లి అర్చనా దేవి ఈనెల 3 వ తేదీన హాస్టల్‌కు వెళ్లి.. అక్కడి సిబ్బందికి బాబాయిగా నమ్మబలికి ఆసుపత్రి నెపంతో బాలికను వారి వెంట తీసుకువెళ్లారన్నారు. అనంతరం అమలాపురంలోని గణపతి లాడ్జ్ చేరుకుని లాడ్జ్ గుమాస్తా నాగవరపు వెంకటరమణ సహకారంతో బాలికపై గిరిబాబు అత్యాచారానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. ముమ్మిడివరం సిఐ మోహన్ కుమార్, ఎస్సై జ్వాలా సాగర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలతో బాలిక ఆచూకీ గుర్తించామన్నారు. బాధిత బాలిక ఇచ్చిన వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసి నిందితుడు గిరిబాబుతో పాటు అతనికి సహకరించిన అర్చనాదేవి, వెంకటరమణలను సోమవారం అరెస్ట్ చేశామని, మంగళవారం కోర్టులో హాజరపరిచామన్నారు.

ఫోటోలో ఉన్న వ్యక్తి రామరాజు లంక గ్రామ కాపురస్తులు బొరుసు పండు (కొలుపు మేస్త్రి) గారి అబ్బాయి బాలు గారికి యాక్సిడెంట్ అయ్...
09/12/2025

ఫోటోలో ఉన్న వ్యక్తి రామరాజు లంక గ్రామ కాపురస్తులు బొరుసు పండు (కొలుపు మేస్త్రి) గారి అబ్బాయి బాలు గారికి యాక్సిడెంట్ అయ్యి కాలు నాలుగు చోట్ల విరగడం అయినది ఆపరేషన్ చేయాలి అన్నారు వారి ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా మిమ్మల్ని అందరిని ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము.
ఈయన ప్రస్తుతం తిరుపతి ఆసుపత్రిలో ఉన్నారు ఆయనకి వైద్యం నిమిత్తం 6 లక్షల రూపాయలు వరకు ఖర్చు అవుతుందని అంచనా
ఇతనికి ఆపరేషన్ జరిగి అన్ని బాగున్నా కూడా కొంతకాలం వరకు ఏ విధమైన పనులు చేసుకోలేని పరిస్థితి దానిని అర్థం చేసుకుని సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను.

Muddala Sri Rama Venkata Prabhakara Rao

Phone pay no 9553256666

Account Details
చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్
A/C no. 719910100013205
IFSC_ UBINOCG7199
రామరాజు లంక

కామనగరువు బైపాస్ పై మూడు రోజులు రాకపోకలు బంద్.....8, 10, 12 తేదీల్లో బైపాస్ మూసివేత...అమలాపురం టౌన్ మీదుగా ట్రాఫిక్ మళ్ల...
07/12/2025

కామనగరువు బైపాస్ పై మూడు రోజులు రాకపోకలు బంద్.....

8, 10, 12 తేదీల్లో బైపాస్ మూసివేత...

అమలాపురం టౌన్ మీదుగా ట్రాఫిక్ మళ్లింపు....

కామనగరువు ప్లై ఓవర్ బ్రిడ్జి మరమ్మత్తుల దృష్ట్యా అంటున్న అధికారులు....

పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో.....

22/11/2025

వాడపల్లి ఆలయ ప్రవేశ మార్గంలో వ్యాపారుల వీరంగం*
*అడిగిన భక్తులపై దురుసు ప్రవర్తనతో కలకలం*
కోనసీమ తిరుమలగా ఖ్యాతిగాంచిన ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం భక్తుల రద్దీతో రోజురోజుకు కిక్కిరిసిపోతుంది. దేశం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వచ్చే ఈ పవిత్ర క్షేత్రంలో వారం చివరల్లో అయితే భక్తుల రద్దీ తిరుమల నడకదారులను తలపిస్తుంది. గోదావరి జిల్లాలకు, ముఖ్యంగా కోనసీమ ప్రాంతానికి గౌరవ మర్యాదలు ప్రత్యేక గుర్తింపు. అయితే ఇదే నేలలో కొంతమంది వ్యాపారుల దురుసు ప్రవర్తన భక్తులను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది.
పార్కింగ్ స్థలం నుంచి ఆలయ మాడవీధి వరకు వెళ్లే ప్రధాన ప్రవేశ మార్గం మొత్తం మొబైల్ కూల్‌డ్రింక్ వాహనాల ఆక్రమణకు గురై భక్తుల రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. మధ్యాహ్న సమయంలో భోజనాల కోసం క్యూలైన్లు, తిరుగుతున్న భక్తులు అంతా ఒకే చోట గుంపుకి గురవ్వడంతో చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
*"మేము వేలంలో లక్షలు పెట్టాము… మీరు ఎవరు అడగటానికి?"*
శనివారం గూడూరు నుంచి వచ్చిన మహిళా భక్తులు మార్గం ఖాళీ చేయాలని మొబైల్ కూల్‌డ్రింక్ వ్యాపారులను కోరగా, వారు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా, “మేము లక్షలు పెట్టి వేలంలో ఈ స్థలం తీసుకున్నాం. మేము ఇక్కడే ఉంటాం… మీరు వస్తారు, పోతారు… మమ్మల్ని అడగడానికి మీరెవరండి? ఏమైనా ఉంటే అధికారులను అడిగండీ!” అంటూ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ధోరణి చూసి భక్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఇంతలో సంఘటితాన్ని చిత్రీకరిస్తున్న ఒక విలేకరి సెల్‌ఫోన్‌ను లాక్కునేందుకు వ్యాపారి ప్రయత్నించడం అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా మారిందో స్పష్టంగా తెలిపింది.
భక్తులతో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే ఇటువంటి వ్యాపారుల వల్ల ఆలయ ప్రతిష్టే దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు జోక్యం చేసుకోవాలంటూ భక్తుల డిమాండ్
ఆత్మీయతతో చూసుకోవాల్సిన దూర ప్రాంతాల నుంచి వచ్చేవారి మీద ఇలాంటి ప్రవర్తన అనవసర ఉద్రిక్తతలకు దారి తీస్తుందని భక్తులు హెచ్చరిస్తున్నారు. వెంటనే ఆలయ అధికారులు, సంబంధిత శాఖలు సకాలంలో చర్యలు తీసుకుని ఆలయ ప్రధాన ప్రవేశ మార్గంలో ఉన్న ఆక్రమణలను తొలగించాలని వారు కోరుతున్నారు. అలాగే వేలం ద్వారా వ్యాపారం చేసే వారికి ప్రత్యేక అవగాహన సమావేశం ఏర్పాటు చేసి, భక్తులతో ఎలా ప్రవర్తించాలో స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరాన్ని వారు నొక్కి చెబుతున్నారు.

దూసుకువస్తున్నా సేన్యార్ తుఫాన్...ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతోంది, అనేది దాని గురించి ఇంకా క్లారిటీ ఐతే లేదు, అక్టోబర్...
22/11/2025

దూసుకువస్తున్నా సేన్యార్ తుఫాన్...

ఈ తుఫాన్ ఎక్కడ తీరాన్ని దాటుతోంది, అనేది దాని గురించి ఇంకా క్లారిటీ ఐతే లేదు, అక్టోబర్ లో వచ్చే తుఫాన్లను అంచనా వెయ్యగలం, నవంబర్ లో వచ్చే తుఫాన్ అంచనా వైయడం కష్టం కాకపోతే మనకు సమయం దగ్గర కి వచ్చాక తీరాన్ని దాటే సూచనలు అధికంగా ఉంటాయి.

సేన్యార్ తుఫాన్ అండమాన్ నుంచి ఒక పిడనం గా ఏర్పడింది, రేపటికి అల్పపీడనం గాను, 24 నాటికీ వాయుగుండం గా బలపడి 26 నాటికీ తుఫాన్ మారే సూచనలు 100% గాలులు తీవత్ర ఉంటుంది... 26, 27, 28, 29, 30 డిశంబర్ 1, 2 తేదీల్లో చాలా చాలా ముఖ్యం....

తమిళనాడు - చెన్నై, ఆంధ్రప్రదేశ్ - నెల్లూరు ==== కాకినాడ మధ్య ఒడిస్సా- పశ్చిమబెంగాల్, బాంగ్లాదేశ్ ఎక్కడైనా తీరాన్ని దాటొచ్చు....

ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు,( రైతులు ముక్యంగా) వరి పండించిన రైతులు తమ ధాన్యన్ని జాగ్రత్త పరుచుకోవాలి,రోడ్లు పైనా,కాళీ స్థలాల్లో అరబెట్టిన ధాన్యన్ని జాగ్రత్త చేయండి..

తుఫాన్ వల్ల ఆస్థి నష్టం,ప్రాణనష్టం, రోడ్లపై వున్నా అనుమానం వున్నా ఎత్తైన చెట్లనునరికించడం ముందుగానే చర్యలు తీసుకోవాలి. అక్టోబర్ చివరి వచ్చిన మంతా తుఫాన్ ఏఫెక్ట్ చెట్టు, విద్యుత్ స్తంబాలు నే లకు వరగడంకరెంట్ కోత గురి కావడం ఎన్నో చూసాం, (మొత్తం రికవరీ అవ్వడానికి 24 గంటల పైనే సమయం పట్టింది))అలా జరగకుండా ముందుగానే జాగ్రత్త లు తీసుకోవాలి. విద్యుత్ తీగలపై వేలాడే చెట్ల కొమ్మలు తొలిగించాలి. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలి..

సేన్యార్ తుఫాన్ ఎక్కడైనా తీర్రాన్ని దాటొచ్చు...

22/11/2025

డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, గెయిల్ తాటిపాక లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కమాండో విభాగమైన ఆక్టోపస్ ఆధ్వర్యంలో "ఆపరేషన్ డ్రాగన్" పేరుతో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. డ్రిల్ ప్రణాళిక ప్రకారం, ఐదు మంది ఉగ్రవాదులు ఆయుధాలతో గెయిల్ లోపలికి చొరబడి, బహిరంగంగా ఉన్న కొందరిపై కాల్పులు జరిపి, అనంతరం లోపలికి ప్రవేశించి కొందరిని బందీలుగా ఉంచారు అనే సమాచారం తొ ఆంధ్రప్రదేశ్ ఆక్టోపస్ బలగాలు స్పందించి వ్యూహాత్మకంగా ఆపరేషన్‌ను ప్రారంభించి, ఉగ్రవాదులను "న్యూట్రలైజ్" చేసి, వారి చేతిలో బందీగా ఉన్న వారిని సురక్షితంగా రక్షించారు.ఈ డ్రిల్‌ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ గారి మార్గదర్శకత్వంలో నిర్వహించబడింది. డ్రిల్‌ సజావుగా కొనసాగేందుకు ముందు నుంచే సమన్వయాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో ప్రత్యేక కోఆర్డినేషన్ మీటింగ్ నిర్వహించబడింది. ఈ సమావేశంలో గెయిల్ జీఎం కేబి నారాయణ గారూ, గెయిల్ డిజీఎం ఎస్వీ మూర్తి గారు , డీ జి ఎం ప్రభాకర్ దీవి , సెక్యూరిటీ అధికారి సాగర్ కుమార్ పెంటకోట , ఆక్టోపస్ డి.ఎస్.పి రాంబాబు, నగరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ చైతన్య కుమార్, ఆక్టోపస్ ఇన్స్పెక్టర్ జి.శివ ప్రసాద్, శివాజీ , నీలకంఠ గారు మరియు ఫైర్, రెవెన్యూ, మెడికల్, సేఫ్టీ, ఎస్ బి విభాగాల అధికారులు పాల్గొన్నారు.
ఈ మాక్ డ్రిల్‌లో కోనసీమ జిల్లా ఏఆర్ విభాగానికి చెందిన బీడీ (బాంబ్ డిస్పోజిబుల్) టీం, డాగ్ స్క్వాడ్, మరియు ఇతర పోలీసు బలగాలు సైతం పాల్గొని ప్రావీణ్యం ప్రదర్శించారు...

Address

Amalapuram
East Godavari
533249

Website

Alerts

Be the first to know and let us send you an email when Our Konaseema posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share