Citizens for Plastic free Eluru and Healthy Life

Citizens for Plastic free Eluru and Healthy Life Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Citizens for Plastic free Eluru and Healthy Life, Government Organization, Eluru Municipal Corporation, Eluru.

This page is created by the office of the commissioner, Eluru municipal corporation to facilitate the community outreach programs for effective implementation of single use plastic ban as per the mandate given by the central pollution control board(CPCB).

కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్, గ్రామదీప్ ఫౌండేషన్ మరియు సర్ సి. ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ సమ్యుక్త ఆధ్వర్యం లో ఈ...
26/11/2022

కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్, గ్రామదీప్ ఫౌండేషన్ మరియు సర్ సి. ఆర్. రెడ్డి పబ్లిక్ స్కూల్ సమ్యుక్త ఆధ్వర్యం లో ఈ రోజు, 26 నవంబర్ 2022 వ తేదీన పబ్లిక్ స్కూల్ లో విద్యార్ధులు- తల్లితండ్రులకు కూరగాయ నారుల అమ్మకం కార్యక్రమాన్ని నిర్వహించారు. పెరటి తోటల అభివ్రుద్ధి ద్వారా ఆరోగ్యకర, సురక్షిత ఆహారాన్ని కుటుంబానికి అందించటం, పిల్లలకు చిన్ననాటి నుండే మొక్కల పెంపకం, హ్యాండ్స్ ఆన్ లర్నింగ్, సొంత ఆహారాన్ని పెంచుకోవటం లో బాధ్యత తీసుకోవటం వంటివి ఎన్నో విలువలు నేర్చుకోవటం లో ఈ కార్యక్రమం దోహదపడుతుంది. కమీషనర్ గారి కార్యాలయం, గ్రామదీప్ ఫౌండేషన్ మరియు ఏలూరు నగరం లోని విద్యాసంస్థలతో ఒప్పందం చేసుకుని ప్లాస్టిక్ రహిత ఏలూరు, సురక్షిత నీరు, ఆరోగ్యకర జీవనం కై చేస్తున్న పౌర ఉద్యమం లో నిర్వహిస్తున్న విభిన్న కార్యక్రమం
లో ఇది ఒకటి.

ఏలూరు నగర కమీషనర్, షాహిద్ షేక్ గారు, స్టాల్స్ ను సందర్శించి, కొన్ని నారులను వారి చేతుల మీదుగా విద్యార్ధులు- తల్కితండ్రులకు అందించారు. చేపట్టబోయే మరిన్ని విభిన్న కార్యక్రమాలను వివరించారు.
పాఠశాల విద్యార్ధులు, ముఖ్యం గా ఎన్.సి.సి విద్యార్ధులు ఈ కార్యక్రమ నిర్వహణ కమీషనర్ గారికి- గ్రామదీప్ కు తోడై, మంచి స్వచ్చంద సేవలు అందించి విజయవంతం చేసారు. ఇదే వేదిక వద్ద ప్లాస్టిక్ పైంకూడా అవగాహబ పోస్టర్ లు ప్రదర్శించారు. నాలుగవ తరగతి చదువుతున్న ప్రసస్థ తను చేసిన పేపర్ పెన్స్ ను ప్రదర్శించి, అమ్మకమూ చేయటమయినది. గ్రామదీప్ లో సభ్యురాలైన శ్రీమతి చళ్ళగుళ్ళ సత్యవాణి గారు మరియు, విద్యార్దులు విరాజ్- కణవ్ క్యాష్ కౌంటర్ వద్ద సేవలు అందించారు. సర్ సి. ఆర్. రెడ్డి యాజమాన్యానికి అభినందనలు. కొన్ని చేతి సంచులను ఈ వేదిక పై అమ్మటం జరిగింది.

24/11/2022
24/11/2022
కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ స్వచ్చంద సంస్థ సమ్యుక్త ఆధ్వర్యం లో,ఏలూరు ని సింగిల్ యూజ్ ప్లాస్టిక...
17/11/2022

కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ స్వచ్చంద సంస్థ సమ్యుక్త ఆధ్వర్యం లో,ఏలూరు ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా చేసే దిశగా, నగర పరిధి లోని వివిధ వ్యాపార సంస్థల ప్రతినిధులతో, నవంబర్ 15, 2022 స్థానిక సర్ సి. ఆర్. రెడ్డి డిగ్రీ కళాశాల ఆడిటోరియుం లో సమావేశమయ్యారు. నగరం లోని వివిధ వరక సంఘాల ప్రతినిధులు- హోటల్స్, రెస్టారంట్స్, కర్రీ పాయుంట్స్, ఆసుపత్రులు, సినిమా హాల్స్, స్వీట్ షాప్స్, మాల్స్, కూరగాయలు, స్టేషనరీ, మెడికల్ మొదలగు దుకాణదారులు ఈ సమావేశం లో పాల్గొన్నారు.

నిషేధించిన వివిధ ప్లాస్టిక్ వస్తువులకు ఉన్న సహజ పధార్ధాలతో చేసిన హానిచేయని ప్రత్యామ్నాయాలను, కార్న్ స్టార్చ్ తో తయారు చేసిన వివిధ సైజుల క్యారీ బ్యాగ్స్, కర్రీ పౌచస్, కట్లరీ, పార్సెల్ ఐటంస్ మొదలగు వస్తువులతో ఆ కంపెనీలు- డీలర్ల ప్రతినిధుకను వారికి కనెక్ట్ చేయటమయినది.
ఈ సమావేశం లో, కమీషనర్ షాహిద్ షేక్ గారు, గ్రామదీప్ వ్యవస్థాపకురాలు, డా. మనోహరి, హెల్త్ ఆఫీసర్- గోపాల క్రిష్ణ నాయక్ గారు, ట్రస్టీ శ్రీమతి చలసాని అరుణ కుమారి గారు, సి.ఆర్.ఆర్ సంస్థల సెక్రెటరి, ప్రసాద్ గారు, ప్రిన్సిపల్, అచ్యుత రామ రాజు గారు పాల్గొని ప్రసంగించారు. ట్రైనీ కలక్టర్ అపూర్వ భరత్ గారు కూడా పాల్గొన్నారు. మునిసిపల్ రెవెన్యూ అధికారి సిరాజుద్దిన్ గారు సభను నిర్వహించారు. సచివాలయ కార్యదర్శులు, కళాశాల విద్యార్ధులు సమావేశం
లో పాల్గొన్నారు.

List of banned single use plastic items…..!
17/11/2022

List of banned single use plastic items…..!

కమీషనర్,ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ సంస్థ తో ఎం ఓ యు చేసుకుని, ఏలూరు ను ప్లాస్టిక్ రహితం చేయటం లో భాగస్వ...
09/11/2022

కమీషనర్,ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ సంస్థ తో ఎం ఓ యు చేసుకుని, ఏలూరు ను ప్లాస్టిక్ రహితం చేయటం లో భాగస్వామ్యమైన సర్ సి.ఆర్.రెడ్డి పబ్లిక్ స్కూల్, శ్రీ శర్వాణి స్కూల్ మరియు సర్ సి.ఆర్.రెడ్డి మహిళా కళాశాల ల్లో కమీషనర్ మరియు గ్రామదీప్ అందిoచిన అవగాహన పోస్టర్లు, ప్రతిజ్ఞతో విద్యార్ధులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సి.ఆర్ ఆర్ మహిళా కళాశాల విద్యార్ధినులు, పోస్టర్స్ మరియు ప్రతిజ్ఞను పేదవేగి మండలం లోని అమ్మపాలెం, పెదపాడు మండలంలోని భోగాపురం, దెందులూరు మండలం లోని చల్లచింతలపూడి, సోమవరప్పాడు గ్రామాలలో సైతం అక్కడి ప్రజలకు, పాఠశాల విద్యార్దులకు ప్లాస్టిక్ హానికర ప్రభావాలు పై అవగాహన కలిగించి, ప్లాస్టిక్ పై ప్రతిజ్ఞను చేయించారు. గ్రామస్తులకు చేతి సంచులను అందించి, ప్లాస్టిక్ బదులు సహజ ప్రత్యామ్నాయాలు వాడాలని సూచించారు.

కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ , గ్రామదీప్ స్వచ్చంద సంస్థ ఏలూరు విద్యాసంస్థలతో భాగాస్వామ్యమై నిర్వహిస్తున్న ప్లాస్...
08/11/2022

కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ , గ్రామదీప్ స్వచ్చంద సంస్థ ఏలూరు విద్యాసంస్థలతో భాగాస్వామ్యమై నిర్వహిస్తున్న ప్లాస్టిక్ అవగాహనా కార్యక్రమాలలో భాగం గా, సర్ సి.ఆర్.ఆర్ పాలిటెక్నిక్ లో జరిగిన శ్రమదాన కార్యక్రమం - రీసైక్లబుల్ ప్లాస్టిక్ సేకరణ; శ్రీ శర్వాణి స్కూల్ లో కమీషనర్ మరియు గ్రామదీప్ అందించిన పొస్టర్స్, ప్రతిజ్ఞ ల తో వారి పాఠశాలలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై మీడియా కవరేజ్.

ప్లాస్టిక్ రహిత సమాజంగా తీర్చిదిద్దడంపై అవగాహనా కార్యక్రమాలు

ఏలూరు ను ప్లాస్టిక్ రహితం చేయడం లో, భూమిని,  నీటి వనరులను సురక్షితం గా ఉంచుతూ ఆరోగ్యకర జీవనానికి, ఏలూరు నగరం లో విద్యాసం...
05/11/2022

ఏలూరు ను ప్లాస్టిక్ రహితం చేయడం లో, భూమిని, నీటి వనరులను సురక్షితం గా ఉంచుతూ ఆరోగ్యకర జీవనానికి, ఏలూరు నగరం లో విద్యాసంస్థలతో కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్- గ్రామదీప్ కలిసి ఒప్పందం చేసుకుని ముందుకు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్యాంపెయిన్ లో భాగంగా, ఈ రోజు నవంబర్ 5, 2022 వ తేదీన సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ విద్యార్ధులు ముందుగా, వారి ప్రాంగణాన్ని ప్లాస్టిక్ రహితం చేసే దిశగా 75 మంది విద్యార్ధులతో శ్రమదాన కార్యక్రమాన్ని కలిసి నిర్వహించారు. మునిసిపల్ కార్పొరేషన్ మరియు గ్రామదీప్ అందించిన ప్రారంభ అవగాహన సెషన్ మరియు ఈ రోజు సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మరియు ప్లాస్టిక్ వేస్ట్ ను, ఆర్గానిక్ వేస్ట్ ను వేరు చేయడంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలపై ప్రత్యేక సెషన్ గ్రామదీప్- మునిసిపల్ కార్యాలయం నిర్వహించింది. ఈ ఒప్పందం లో భాగంగా రీసైకిల్ వేస్ట్ ను వేరు చేసి, మెటల్ కేజ్ లో ప్రిన్సిపల్ శివకుమార్ గారు ముందుగా డంప్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని రూపొందించిన వెంటనే, రికమెండ్ చేయగానే, కళాశాల యాజమాన్యం స్వయంగా నిధులు సమకూర్చి, దీన్ని సిద్ధం చేయడం అభినందనీయం.

మిగిలిన రీసైక్లబుల్ చెత్త తో పాటు, కనీసం 1100-1200 సీసాలు కళాశాల ప్రాంగణం నుండి విద్యార్ధులు శ్రమదానం చేసి సేకరించారు. ఆర్గానిక్ చెత్తను సేకరించి ఆవరణలోనే కంపోస్ట్ కుప్పగా తయారు చేశారు. శ్రమదాన్ కార్యక్రమంలో ఎంతో చురుగ్గా పాల్గొన్న విద్యార్థులు, సిబ్బందికి అభినందనలు.

Media coverage of Awareness Workshop at C. R. Reddy Polytechnic, Eluru.
02/11/2022

Media coverage of Awareness Workshop at C. R. Reddy Polytechnic, Eluru.

ఈ రోజు ఏలూరు సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ లో కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ సంస్థ ఆధ్వర్యం లో ...
01/11/2022

ఈ రోజు ఏలూరు సర్ సి. ఆర్. రెడ్డి పాలిటెక్నిక్ లో కమీషనర్, ఏలూరు మునిసిపల్ కార్పోరేషన్ మరియు గ్రామదీప్ సంస్థ ఆధ్వర్యం లో కళాశాల తో సమ్యుక్తం గా విద్యార్ధులకు ప్లాస్టిక్ వల్ల హానికర ప్రభావాలు, నీటివనరుల రక్షణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, మన బాధ్యత పై అవగాహన వర్క్ షాప్ జరిగింది. ఈ కార్యక్రమం లో ఏలూరు నగర కమీషనర్, షాహిద్ షేక్ గారు, గ్రామదీప్ వ్యవస్థాపకురాలు డా. మనోహరి, కళాశాల కరస్పాండెంట్ జయప్రకాష్ గారు, ప్రిన్సిపల్ శివకుమార్ గారు, హెల్త్ ఆఫీసర్స్, డా. మాలతి, డా. గోపాలక్రిష్ణ నాయక్, రెవెన్యూ ఆఫీసర్ సిరాజుద్దీన్ గారు పాల్గొన్నారు. విద్యార్దులు ప్లాస్టిక్ రహిత ఏలూరు కు క్రుషి చేస్తామని ప్రతిజ్ఞ చేసారు. సహజ పదార్ధాలతో చేసిన వస్తువులను వివరించి ప్రదర్శించటమయినది.

Address

Eluru Municipal Corporation
Eluru

Website

Alerts

Be the first to know and let us send you an email when Citizens for Plastic free Eluru and Healthy Life posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share