17/02/2024
*పెదపాడు మండలం ఏపూరులో జరిగిన భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో వైసిపి పాలనలో తమ గోడు వెళ్ల బోసుకున్న పలువురు గ్రామస్థులు*
*మీరు మంజూరు చేస్తే ఇల్లు కట్టుకున్నాము - సగం వరకు డబ్బులు కూడా వచ్చాయి.. ఈ వైసిపి పాలన వచ్చాక మిగతా డబ్బులు రాక, ఇల్లు పూర్తికాక దీన స్థితిలో ఉన్నాం అంటూ వాపోయిన పలు పేద కుటుంబాలు*
*చింతమనేని మంజూరు చేస్తే రూ.లక్ష రూపాయలు వచ్చాయని, ప్రభుత్వం మారాక, మిగతా బిల్లు రావాలంటే ఇంటికి జగన్ బొమ్మ పెట్టాలని వైసిపి వాళ్ళు తమ వద్దే ఎదురు రూ.600/- తీసుకున్నారని, 4ఏళ్ళు దాటినా ఈరోజుకి 1/- కూడా పడలేదంటూ వైసిపి నాయకుల చిల్లర పనులను బహిర్గతం చేసిన ఏపూరు గ్రామస్థులు*
*"నేను భోజనానికి కూర్చోబెట్టి, మీకు ఆకు వేసాను, అన్నం పెట్టాను, పప్పు, కూర వడ్డించాను - మీ భోజనం సగంలో ఉండగా దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారింది - నా తర్వాత వచ్చిన వాడు భాద్యతగా మీకు మిగతా అన్నం వడ్డించాలిగా - మజ్జిగ అన్నము వరకు చూడాల్సిన బాధ్యత లేదా వైసిపి వాళ్ళకి - అర్ధ ఆకలితో ఉంచటం ధర్మమా?.- ఇదే పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి అసలు తీరు అంటూ గ్రామస్థులతోనే వైసిపి ప్రభుత్వ తీరును తప్పు పట్టించిన చింతమనేని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం హల్చల్ చేస్తోంది.*
*మరో 2నెలల్లో టిడిపి- జనసేన కూటమి అధికారంలోకి రాగానే ఎవరెవరికి అయితే ఈ ప్రభుత్వం అన్యాయం చేసిందో వారు అందరికి తొలి ప్రధాన్యతలో ఇంటి నిర్మాణం బిల్లులు పడేలా చర్యలు చేపడతాం అని చింతమనేని ప్రభాకర్ భరోసా ఇవ్వగా, గ్రామస్తులంతా హర్షం వ్యక్తం చేశారు*