I&PR

I&PR Information & Public Relation Department DIPRO_ELURU
Eluru,Andhra Pradesh,India

6.9.2026_*పిజిఆర్ఎస్ సేవలపై  పై క్యూ.ఆర్  కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి -జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి*           ప...
06/09/2026

6.9.2026_*పిజిఆర్ఎస్ సేవలపై పై క్యూ.ఆర్ కోడ్‌ ద్వారా స్పందన తెలియజేయండి -జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి*

పిజిఆర్ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజల అభిప్రాయాలను క్యూ ఆర్ కోడ్ ద్వారా తెలియజేయాలనీ జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి కోరారు. ప్రజలకు మరింత పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన సేవలను అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఈ కార్యక్రమంలో భాగంగా పిజిఆర్ఎస్ ద్వారా అందించే సేవలపై ప్రజలను అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా కోరుతున్నదన్నారు. జిల్లా, మండల స్థాయి పి.జి.ఆర్.ఎస్ కేంద్రాలలో ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాలలో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ.ఆర్ కోడ్ ప్రముఖంగా ప్రదర్శించడం జరిగిందన్నారు. పి.జి.ఆర్.ఎస్ సేవల పొందిన ప్రజలు తమ మొబైల్ ఫోన్‌ల ద్వారా క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి తమ అభిప్రాయాన్ని, సంతృప్తి స్థాయిని తెలియజేయవచ్చన్నారు. క్యూ.ఆర్ కోడ్ ప్రజల స్పందన అధికారిక పి.జి.ఆర్.ఎస్ పోర్టల్‌ చేరుతుందన్నారు. ఆర్జీల స్థితిగతులు తెలుసుకొనుటకు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని తెలిపారు. క్యూ.ఆర్ కోడ్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తూ మరింత మెరుగైన సేవలు అందించుటకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు.

5.9.2026_ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలలో అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించి పరిష్కా...
05/09/2026

5.9.2026_ప్రజాసమస్యల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలలో అధికారులు పరిష్కరించిన అర్జీలకు సంబంధించి పరిష్కార విధానం, అర్జీదారులు సంతృప్తి, అధికారుల ప్రవర్తనలను అర్జీదారులకు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి శనివారం సాయంత్రం నేరుగా అర్జీదారులకు ఫోన్ చేసి
వారి అభిప్రాయాలను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు.

5.9.2026_*విద్యార్థులు  భవిషత్తును బంగారు బాటలుగా  తీర్చిదిద్దుతున్న గురువులు దైవంతో సమానం*.*సమాజ ప్రగతికి బాటలు వేస్తున...
05/09/2026

5.9.2026_*విద్యార్థులు భవిషత్తును బంగారు బాటలుగా తీర్చిదిద్దుతున్న గురువులు దైవంతో సమానం*.

*సమాజ ప్రగతికి బాటలు వేస్తున్న ఉపాధ్యాయులు సేవలు చిరస్మరణీయం, అభినందనీయం*.

*భారతరత్న భారత మాజీ రాష్ట్రపతి డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా వారికి ఘననివాళులు*.

*ఉపాధ్యాయులందరికీ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*.

*జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి* ...

#గురువందనం

3.9.2027_ఏలూరు_*అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిపిన కోచ్ లు, క్రీడాకారులకు అభినందనీయం*.*రూ 4 లక...
04/09/2026

3.9.2027_ఏలూరు_*అమరావతి ఛాంపియన్‌షిప్ లో ఏలూరు జిల్లా రెండవ స్థానంలో నిలిపిన కోచ్ లు, క్రీడాకారులకు అభినందనీయం*.

*రూ 4 లక్షలు ఫ్రైజ్ మనీ, 38 మంది క్రీడాకారులు 38 మెడల్స్ సాధించడం జిల్లాకు ఎంతో గర్వకారణం*.

*విజయం సాధించిన కోచ్ లు, క్రీడాకారులు ఆత్మీయవిందులో జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి పాల్గొని వారిలో మరింత క్రీడా స్పూర్తినింపారు*.

3.9.2026_సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలకల్పనకు  ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వసతిగృహాల వార్డెన్లను జిల్...
04/09/2026

3.9.2026_సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు కనీస సౌకర్యాలకల్పనకు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని వసతిగృహాల వార్డెన్లను జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక అమీనాపేటలోని షెడ్యూల్డ్ కులాలు, వెనుకబడిన తరగతులు, సమీకృత వసతి గృహాలను గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, భోజన మెనూలను పరిశీలించారు.

3.9.2026_*జిల్లాలో "నెట్ జీరో" కార్యక్రమంలో సంక్షేమ వసతి గృహాలలో  మొక్కలను నాటి  సమీకృత పర్యావరణ ప్రాంగణంలా తీర్చిదిద్దా...
03/09/2026

3.9.2026_*జిల్లాలో "నెట్ జీరో" కార్యక్రమంలో సంక్షేమ వసతి గృహాలలో మొక్కలను నాటి సమీకృత పర్యావరణ ప్రాంగణంలా తీర్చిదిద్దాలి*

*సూపర్ ఎల్నినో పరిస్థితులలో రానున్న జూన్ వరకు నీటి ఎద్దడి రాకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి*

*అధికారులతో జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జూమ్ కాన్ఫరెన్స్*

3.9.2026_ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో   క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల...
03/09/2026

3.9.2026_ ఏలూరు జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలపై అందిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎలెక్టోరల్ అధికారి వివేక్ యాదవ్ కు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి చెప్పారు. ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 ముసాయిదా జాబితాలో అందిన క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాల పరిష్కారం, తుది జాబితా తయారీపై గురువారం రాష్ట్ర సచివాలయంలోని ఎన్నికల విభాగ కార్యాలయం నుండి సీఈఓ వివేక్ యాదవ్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఈఓ వివేక్ యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)- 2026 లో ముసాయిదా జాబితాలో క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలపై అందిన దరఖాస్తులకు సంబంధించి అర్జీదారులకు నోటీసులు అందించాలని, నోటీసులు అందుకున్న అర్జీదారుల వద్ద విచారణ చేసి, వారి నుండి వివరాలు తీసుకోవాలన్నారు. వాటిని నిర్దేశించిన సమయంలోగా పరిష్కారానికి చర్యలు తీసుకొని, తుది జాబితా రూపొందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

02/09/2026

1.9.2026_దశాబ్దాల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, గోదావరి జలాలు ఉత్తరాంధ్ర వైపు పరవళ్లు తొక్కబోతున్నాయి.

సెప్టెంబర్ 2, 2026న అనకాపల్లి జిల్లా సీతారాంపురంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ఎడమ ప్రధాన కాలువకు జలహారతి ఇవ్వనున్నారు.

23.44 టీఎంసీల గోదావరి జలాలు విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు నీటి భరోసా అందిస్తూ, 2.87 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, 433 గ్రామాలకు తాగునీటి భద్రత కల్పించనున్నాయి. పారిశ్రామిక అవసరాలకు శాశ్వత నీటి వనరులను సమకూరుస్తూ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపబోతోంది.


02/09/2026

2.9.2026_గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నేటి వరకు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, దూరదృష్టి పాలనతో ఆంధ్రప్రదేశ్‌ను నిరంతరం ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తున్నారు.

#పేదలసేవలో

02/09/2026

1.9.2026_స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకు తమకు నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం కల్పిస్తూ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికల విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

#పేదలసేవలో

Address

Deputy Executive Information Engineer, I&PR Dept.
Eluru
534001

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

08812231061

Website

Alerts

Be the first to know and let us send you an email when I&PR posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share