22/03/2024
పత్రికా ప్రకటన
*రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల కోడ్ మరియు సెక్షన్ 144 సి.ఆర్.ఏ.సి అమలులో ఉన్నవి. ఏదైనా ప్రచార కార్యక్రమం గాని, రోడ్డు షో లు కానీ, ర్యాలీలు కానీ, మీటింగులు కానీ, సభలు కానీ నిర్వహించుకోవాలన్నా లేదా మైక్ లో ప్రధారం చేసుకోవాలన్న ఎట్టి పరిస్థితుల్లోనూ ముందస్తుగా అనుమతి తీసుకోవాలి అని ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీమతి డి మేరీ ప్రశాంతి IPS వారు వెల్లడి*
ఇటువంటి అనుమతుల కొరకు ఎలక్షన్ కమిషన్ వారు ఏర్పాటు చేసినటు వంటి #సువిధ యాప్ లో ముందుగా పర్మిషన్ కొరకు ఆప్లికేషన్ నమోదు చేసుకోవాలి. అప్లికేషన్లో ఎంతమంది పాల్గొంటారు ఎన్ని వాహనాలు ఉపయోగిస్తారు వాహనాల నంటర్లు, ఎన్ని మైకులు ఉపయోగిస్తారు, ఏ రూట్ లలో వెళ్తారు అనే పూర్తి సమాచారాన్ని అప్లికేషన్ నందు ఖచ్చితంగా పొందుపరచాలి. సదరు అప్లికేషన్ ను సంబందిత అధికారులు పరిశీలించి అనుమతి మంజురు చేస్తారు. ఊరేగింపు యొక్క రూట్ మ్యాప్ ముందుగానే ఇవ్వాలి. ఊరేగింపు ప్రారంభించే ప్రదేశం మరియు ముగించే ప్రదేశం తప్పని సరిగా తెలియపరచాలి.
ఒకే గ్రామంలో ఒకే సమయంలో ఏ రెండు పార్టీలకు అనుమతి ఇవ్వబడదు. అందుకు వీలుగా కనీసం రెండు రోజులు ముందుగా అనుమతి కొరకు అప్లికేషన్ నమోదు చేసుకోవాలి. ఒకే గ్రామంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు అనుమతి కొరకు అప్లై చేసుకున్న ఎడల, ముందుగా అప్లై చేసిన వారికి అనుమతి మంజురు చేయబడుతుంది మిగిలిన వారికి తేదీ మార్పు కొరకు తెలియజేయబడుతుంది.
ప్రార్ధన మందిరాలు, విద్య సంస్థల దగ్గర ఏవిధమైన ప్రధార కార్యక్రమాలు చేయరాదు. ఒక పార్టీ వారు వేరొక పార్టీ వారి యొక్క మీటింగులకు గాని, ర్యాలీలోకి గాని వెళ్ళి వారికి ఆటంకం కలిగించకూడదు. ఏ విధమైన కుల, మత, వర్గ పరమైన రెచ్చగొట్టే ప్రసంగాలు చెయ్యరాదు. రాత్రి 8 గంటల తర్వాత ఏ విధమైన ప్రచార కార్యక్రమాలు చేయరాదు.
ఖచ్చితంగా అనుమతి మంజూరు అయిన తర్వాత మాత్రమే అనుమతికి లోబడీ ఏ విధమైన కార్యక్రమమైనా చేపట్టాలి. అందుకు విరుద్ధంగా ఎటువంటి కార్యక్రమం చేపట్టిన ఎన్నికల సంఘంచే జారీచేయబడిన ఎన్నికల ప్రవర్తన నియమావళి (Model Code of Conduct) కింద వస్తుంది. దానికి సంబంధించి ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇచ్చే రిపోర్టు ఆధారంగా కేసు నమోదు చేయబడుతుంది.
కావున రాజకీయ పార్టీలు అందరూ కూడా సదరు విషయం గమనించి తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందవలసినదిగా కోరడమైనది. ఈ విధంగా సహకరించి ఏ విధమైన ఆవాంచనీయ సంఘటనలు జరగకుండా మరియు శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎన్నికలు సజావుగా జరిగేటట్టు సహకరించవలసినదిగా కోరడమైనది.