08/07/2026
8.7.2026_ఏలూరు_జిల్లాలో ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా రైతులకు, ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ద్వారా అమలు జరుగుతున్న ఆర్డిఎస్ఎస్ పధకం అమలుపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ డైరెక్టర్ టి. వనజ, సిజిఎం బి. అశోక్ కుమార్ , ఎమ్మెల్యే లు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, సొంగా రోషన్ కుమార్ లతో కలిసి ఎంపీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో ఏలూరు జిల్లాలోని ఆయిల్ పామ్ తోటల మీదుగా విద్యుత్ లైన్లు వెళ్లడంతో , గెలలు కోసే సమయంలో ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ఆయిల్ పామ్ తోటలలో ప్రమాదాలు మరియు విద్యుత్ అంతరాయాలను నివారించడానికి లో వోల్టేజ్ సమస్యల పరిష్కారానికి 'కవర్డ్ కండక్టర్' తో కూడిన 400 కిలోమీటర్ల మేర 11 కెవి లైన్లు, 200 కిలోమీటర్ల మేర 33 కెవి లైన్లు మంజూరు చేయాలని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా కు అవసరమైన గ్రామాలకు విద్యుత్ సబ్ స్టేషన్లు మంజూరు చేయాలనీ కోరారు. జిల్లాలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయని, వాటిని నివారించడానికి ట్రాన్స్ఫార్మర్ల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటుచేయాలని, తక్కువ వోల్టేజ్ సమస్యను నివారించడానికి మరియు ప్రజల్లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి అన్ని సబ్‌స్టేషన్లు మరియు మండల ప్రధాన కార్యాలయాల వద్ద 250 3-ఫేజ్ ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని, రైతులకు విద్యుత్ సరఫరాకు సంబంధించి లైన్, పోల్స్ షిఫ్టింగ్ చార్జీలను 2 శాతానికి తగ్గించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండి ఇమ్మడి పృద్వీతేజ కు ఫోన్ చేసి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కోరారు.