Mepma Eluru Official

Mepma Eluru Official Official page of MEPMA Eluru
📌 Daily updates
🌸 Women Empowerment
🌍 Community Development

12/08/2026

Happy independence day 2026
AP Official News MEPMA Andhra Pradesh

🤝 Happy Friendship Day! 💛స్నేహం అంటే కేవలం పరిచయం కాదు... జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే అమూల్యమైన బంధం.మన జీవితాన్ని ఆనం...
02/08/2026

🤝 Happy Friendship Day! 💛
స్నేహం అంటే కేవలం పరిచయం కాదు... జీవిత ప్రయాణంలో తోడుగా నిలిచే అమూల్యమైన బంధం.
మన జీవితాన్ని ఆనందంగా, అర్థవంతంగా మార్చే ప్రతి స్నేహితునికి హృదయపూర్వక Happy Friendship Day శుభాకాంక్షలు. 💐
స్నేహం విశ్వాసాన్ని పెంపొందిస్తుంది...
సహకారాన్ని బలోపేతం చేస్తుంది...
సమాజంలో ఐక్యతను, అనుబంధాన్ని మరింత బలపరుస్తుంది.
MEPMA – ELURU తరఫున ప్రతి ఒక్కరికీ Friendship Day శుభాకాంక్షలు! 🌸

CommunityDevelopment MunicipalCorporationEluru Eluru

📢 హేలాపురి పట్టణ సమైఖ్య సమావేశం విజయవంతంగా నిర్వహణ | 25 జూలై 202625 జూలై 2026 న గాంధీ ధ్యాన మందిర్, ఏలూరులో హేలాపురి పట్...
28/07/2026

📢 హేలాపురి పట్టణ సమైఖ్య సమావేశం విజయవంతంగా నిర్వహణ | 25 జూలై 2026
25 జూలై 2026 న గాంధీ ధ్యాన మందిర్, ఏలూరులో హేలాపురి పట్టణ సమైఖ్య సమావేశం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ సమావేశంలో CMM మేడమ్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు (COs), ఆర్‌పీలు (RPs), ECలు మరియు OBలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పట్టణ సమైఖ్య అధ్యక్షురాలికి ఘన స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు. అనంతరం సమైఖ్య కార్యకలాపాలు, ఈ నెల తీర్మానాలు, మాస నివేదికలు, పొదుపు–అప్పుల పురోగతి, రుణ దరఖాస్తులు మరియు భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించి అవసరమైన సూచనలు అందించారు.
"బలమైన సమైఖ్యలు – సాధికార మహిళలు – అభివృద్ధి చెందిన సమాజం." 🌸

Eluru APGovernment

♻️ స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహణ 🌿18 జూలై 2026 న స్థానిక 12వ డివిజన్, మార్కండేయ స్వామి వారి ...
28/07/2026

♻️ స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహణ 🌿
18 జూలై 2026 న స్థానిక 12వ డివిజన్, మార్కండేయ స్వామి వారి ఆలయం వద్ద స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర (SASA) కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో బల్క్ వేస్ట్ జనరేటర్స్ (BWGs) ఎన్యుమరేషన్, పరిశుభ్రత, ఘన వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించబడింది. అధికారులు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు, ప్రజాప్రతినిధులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
"పరిశుభ్రమైన పరిసరాలు... ఆరోగ్యకరమైన సమాజానికి పునాది." 🌱

BulkWasteGenerators WasteManagement SHG MunicipalCorporationEluru APGovernment

📢 MDML యాప్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహణఏలూరు నగరంలోని గాంధీ ఙ్ఞాన మందిర్‌లో వన్ టౌన్ (13.07.2026) మరియు టూ టౌన్...
14/07/2026

📢 MDML యాప్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహణ

ఏలూరు నగరంలోని గాంధీ ఙ్ఞాన మందిర్‌లో వన్ టౌన్ (13.07.2026) మరియు టూ టౌన్ (14.07.2026) ఆర్‌పీలకు MDML యాప్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ శిక్షణలో PD గారు, CMM గారు, జిల్లా కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు పాల్గొని, MDML యాప్ వినియోగం, అమలు విధానం, ఫీల్డ్ స్థాయి పనితీరు మరియు సందేహాలపై సమగ్ర అవగాహన కల్పించారు. పాల్గొన్న ఆర్‌పీల సందేహాలను నివృత్తి చేస్తూ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించే విధానాన్ని వివరించారు.
ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగిస్తూ మహిళా సాధికారత దిశగా MEPMA మరో ముందడుగు వేసింది.
MEPMA Eluru Official
Municipal Corporation Eluru
Eluru MunicipalCorporationEluru AndhraPradesh

🌸 త్రుప్తి క్యాంటీన్‌ను సందర్శించిన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు 🌸ఏలూరులో MEPMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రుప్తి క్య...
05/07/2026

🌸 త్రుప్తి క్యాంటీన్‌ను సందర్శించిన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు 🌸
ఏలూరులో MEPMA ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న త్రుప్తి క్యాంటీన్ ను గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి గారు సందర్శించి, అక్కడ మహిళా సంఘ సభ్యులు తయారు చేసిన ఆహారాన్ని స్వయంగా రుచి చూసి అభినందించారు. 🙏
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ మేడమ్ గారు, MEPMA PD గారు, CMM మేడమ్ గారు మరియు అధికారులు పాల్గొని మహిళా సాధికారతకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ప్రశంసించారు. ✨
స్వయం ఉపాధి ద్వారా మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావడం ఆనందదాయకం. 💪🌸
MEPMA Andhra Pradesh





EluruMunicipalCorporation
APGovernment
SHGWomen
MEPMA

🌸 PM SVANidhi లోక కళ్యాణ మేళా విజయవంతంగా నిర్వహించడం జరిగింది 🌸జూన్ 29 న ఏలూరు పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ...
04/07/2026

🌸 PM SVANidhi లోక కళ్యాణ మేళా విజయవంతంగా నిర్వహించడం జరిగింది 🌸
జూన్ 29 న ఏలూరు పట్టణంలోని మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన PM SVANidhi లోక కళ్యాణ మేళా కార్యక్రమం ఘనంగా జరిగింది. 🎉
ఈ కార్యక్రమంలో వీధి విక్రయదారుల కోసం అవగాహన కార్యక్రమాలు, రుణ సేవలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహం నిర్వహించబడినవి. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్య ప్రదర్శనలు మరియు మ్యూజికల్ చైర్ పోటీలు ఆకట్టుకున్నాయి. 💃🎶
కార్యక్రమానికి బ్యాంకర్స్, PD గారు, CMM గారు, జిల్లా కోఆర్డినేటర్లు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు మరియు వీధి విక్రయదారులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. 🤝
స్వయం ఉపాధి – ఆర్థిక సాధికారత – డిజిటల్ అభివృద్ధి దిశగా PM SVANidhi ఒక గొప్ప అడుగు. ✨
DigitalPayments WomenEmpowerment Eluru MunicipalCorporationEluru SelfEmployment AndhraPradesh

Address

Eluru Municipal Office
Eluru
534001

Website

Alerts

Be the first to know and let us send you an email when Mepma Eluru Official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share