Team bandla krishnamohanreddy yuva sena

Team bandla krishnamohanreddy yuva sena MLA GADWAL .79 GADWAL CONSTITUENCY . JOGULAMBA GADWAL DIST!

*గృహప్రవేశం మహోత్సవం , నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారు** ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలో  నూతన...
26/11/2025

*గృహప్రవేశం మహోత్సవం , నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే గారు**

ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలో నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు*.

అదే విధంగా గద్వాల నియోజకవర్గం గట్టు మండలం కేంద్రంలో నూతన గృహప్రవేశానికి *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* సత్యనారాయణ స్వామి వారి దర్శించుకుని యజమానికి హార్థిక శుభాకాంక్షలు తెలిపారు.



👉ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్ , PACS ఛైర్మన్ వెంకటేష్ , మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు, వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ బజారి నాయకులు రామకృష్ణ రెడ్డి, రాముడు, సంతోష్ , హనుమంతు రెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*మహిళలకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం...*  *మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.*  *ప్రతి సంక్ష...
25/11/2025

*మహిళలకు పెద్దపీట వేసిన రాష్ట్ర ప్రభుత్వం...*

*మహిళలు ఆత్మగౌరవంతో బతికేలా రుణాలు సద్వినియోగం చేసుకోవాలి.*

*ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే గారు*

*ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇస్తున్న రుణాలను సభ్యులందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఫలితంగా మహిళలు ఆత్మగౌరవంతో బతికేందుకు, ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఉందని*

ఈరోజు గద్వాల జిల్లా జిల్లా కలెక్టర్ ఐడిఓసి లోని సమావేశపు మందిరంలో సేర్ప్ ఆధ్వర్యంలో ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘాల సభ్యులకు అట్టహాసంగా జరిగిన వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా *ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ గారు* హాజరయ్యారు.

ఇంద్ర మహిళా శక్తి

*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ* .....

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ ప్రతి సంక్షేమ పథకంలో మహిళల ద్వారా అందించడం జరుగుతుంది.

మహిళా సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యురాలికి గుర్తింపు, గౌరవం ఉండాలని ప్రభుత్వం ఇందిరమ్మ చీరలను అందజేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ, వచ్చిన ఆదాయాన్ని పొదుపు చేస్తూ కుటుంబ అవసరాలకు వినియోగిస్తుండడంతో కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదుగుతున్నారని కొనియాడారు. పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, ఇంటి నిర్మాణాలకు, ఇతర కుటుంబ అవసరాలకు గతంలో ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేసి వడ్డీలు కట్టేందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చేదని, ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న వడ్డీ లేని రుణాలతో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేందుకు ఆస్కారమేర్పడిందన్నారు. ఇదివరకు కరువు కాటకాలకు నిలయంగా ఉన్న గద్వాల ప్రాంతంలో ప్రస్తుతం సాగునీరు పుష్కలంగా ఉండడంతో మంచి పంటలు పండుతున్నాయని, ఆ పంటలను ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మహిళల ద్వారానే ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు.

కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ సంకల్పమని, అందులో భాగంగానే అనేక సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేలా మహిళలు తీసుకున్న రుణాలతో వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని, రూ.10 కోట్లకు అధిపతులు కావాలని ఆకాంక్షించారు.

మహిళలు అభివృద్ధి చెందితేనే వారి గ్రామాలు, జిల్లా, రాష్ట్రం కూడా ప్రగతి పథంలో ముందుకు దూసుకెళ్తుందన్నారు.

త్వరలోనే మహిళలకు వివిధ వ్యాపార రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు గద్వాలలో మహిళ శిక్షణ కేంద్రం నిర్మాణంలో ఉందని, రెండు నెలల్లోనే ప్రారంభించనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలబ బస్సు ప్రయాణం, సంక్షేమం కోసం సన్న బియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత కొత్త రేషన్ కార్డులు, కళ్యాణ లక్ష్మి వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో ప్రభుత్వం ముందుకెళ్తోందనీ పేర్కొన్నారు.

*జిల్లా కలెక్టర్ గారు మాట్లాడుతూ* ....

గత శనివారం గద్వాల మండలం గోనుపాడు గ్రామంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం సందర్భంగా పలువురు మహిళా సంఘాల సభ్యులు వడ్డీ లేని రుణాలు కావాలని కోరారని, ప్రభుత్వ నిర్ణయంతో త్వరగానే సాకారం కావడం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం జిల్లాకు మొత్తం 4724 సంఘాలకు రూ.5.10 కోట్ల వడ్డీ లేని రుణాలు రావడం జరిగిందని, ఇదివరకు కూడా వడ్డీ లేని రుణాలు అందజేయడం జరిగిందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల్లో లేని మహిళలను కూడా సంఘాల్లో చేర్పించి ప్రతి ఆడపడుచు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. మహిళలు పెట్రోల్ బంకుల, సోలార్ పవర్ ప్లాంట్ నిర్వహణతో కూడా సంపాదించే అవకాశాన్ని కలిగించడం జరిగిందన్నారు. ప్రభుత్వం నుంచి బస్సులు కొనుగోలు చేసేందుకు జిల్లాలోని మూడు మండలాల మహిళా సంఘాలకు సబ్సిడీ రుణాలు ఇవ్వడం జరిగిందని, మిగిలిన మండలాలకు కూడా త్వరలోనే బస్సులు కొనుగోలు చేసేందుకు సహకరిస్తామన్నారు. ఈ బస్సులను ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడంతో మంచి ఆదాయాన్ని పొందవచ్చు అన్నారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల్లోను మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, జిల్లాలోని ఆయా పాఠశాలల్లో రూ.10 కోట్లకు పైగా నిధులతో మరమ్మతులు చేయించడం జరిగిందన్నారు. పంచాయతీ ఎన్నికల్లోను ప్రభుత్వం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం గర్వకారణమన్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గ వర్గానికి సంబంధించి 2248 స్వయం సహాయక సంఘాల గ్రూపులకు రూ.2.28 కోట్ల విలువైన చెక్కును ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి ఆయా మహిళా సంఘాల సభ్యులకు అందజేశారు.

👉ఈ కార్యక్రమంలో. అధికారులు గద్వాల నియోజకవర్గం మహిళా సంఘాలు అధ్యక్షురాలు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

*శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరశురాముడు స్వామి వారి దర్శించుకుని ఎమ్మెల్యే గారు* ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని...
25/11/2025

*శ్రీశ్రీశ్రీ జమ్ములమ్మ అమ్మవారిని & పరశురాముడు స్వామి వారి దర్శించుకుని ఎమ్మెల్యే గారు*

ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని శ్రీ శ్రీ శ్రీ జమ్ములమ్మ అమ్మవారిని పరశురాముడు దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్న *గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* అమ్మవారి ఆశీస్సులను పొందడం జరిగింది.

అమ్మవారి ఆశీస్సులతో గద్వాల నియోజకవర్గ ప్రజలు రైతులు, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని తెలిపారు.

👉ఈ కార్యక్రమంలో ఆలయం కమిటీ చైర్మన్ బోయ వెంకటరాములు, ఆలయం కమిటీ డైరెక్టర్స్ నాయకులు దివాకర్ రెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

*మహిళా పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*   *మహిళాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసి ఎమ్మెల్యే గారు* ఈరోజు గ...
24/11/2025

*మహిళా పెద్దపీట వేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం*


*మహిళాలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసి ఎమ్మెల్యే గారు*

ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం పరిధిలోని ఆలూరు గ్రామంలో *ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ* కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా **ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు* * పాల్గొన్నారు.

*ఎమ్మెల్యే గారికి నాయకులు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు*.

*ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మహిళలకు చీరలను పంపిణీ చేయడం జరిగింది* .

*ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ*...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అత్యంత ప్రాధాన్యతస్తు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. అదేవిధంగా వివిధ రంగాలలో కూడా మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తూ మహిళలు ఆర్థికంగా ఎదగాలి మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆ కుటుంబం అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదుగుతుందని తెలిపారు ‌.

మహిళా పొదుపు సంఘంలో ప్రతి ఒక్కరు సభ్యులుగా ఉండాలి సభ్యులుగా లేనివారు కూడా త్వరలో సభ్యులుగా ఏర్పడి గ్రామ మహిళా సంఘం లో చేరి మహిళా సంఘాలు ద్వారా కుటీర వ్యాపారస్తు మహిళలు అభివృద్ధి చెందాలి సీఎం గారు చెప్పినట్లు మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళలు కోటీశ్వరులుగా కావడం జరుగుతుందని తెలిపారు.

⚡ఒకప్పుడు మహిళలు బ్యాంకులకు వెళ్లాలన్న ఇబ్బంది పడే వారిని, గత 15, 20 సంవత్సరాలుగా మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఏర్పాటై ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తుండడంతో ఆడపడుచులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఈ రుణాలతో పిండి గిర్నీల ఏర్పాటు, ఆహార ఉత్పత్తుల తయారీ, ట్రాక్టర్స్, వరి కోత యంత్రాలు కొనుగోలు చేసి అద్దెకివ్వడం, ఇతర వ్యాపారాలు చేసుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారన్నారు.

⚡మహిళా సంఘాల సభ్యులు దీని నిర్వహణతో నెలకు సుమారు రూ.3 లక్షల ఆదాయాన్ని అర్జించవచ్చు అన్నారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు నడిపేందుకు వీలుగా, వీటిని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ రుణాలు మంజూరు చేస్తుందని, ఫలితంగా మహిళలు బస్సుల యజమానులుగా మారుతున్నారని, పెట్రోల్ బంకుల నిర్వహణ తో కూడా లాభాలు ఆర్జించవచ్చని పేర్కొన్నారు.

⚡మహిళలు వివిధ వృత్తులు, వ్యాపారాలకు సంబంధించి ప్రావీణ్యం పొందేలా గద్వాలలో త్వరలోనే మహిళ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారికి ఉచిత బస్సు ప్రయాణ అమలులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకెళుతున్నట్లు చెప్పారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

⚡మహిళా సంఘాల సభ్యులందరూ వివిధ సమావేశాలు నిర్వహించుకున్న సందర్భాల్లో ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న చీరలను ధరించాలని సూచించారు. మహిళా సంఘాల సభ్యులకే
తెల్ల రేషన్ కార్డు కలిగిన 18 ఏళ్లు నిండిన ఆడపడుచులు అందరికీ ఇందిరమ్మ చీరలను ఇవ్వడం జరుగుతుందన్నారు. మహిళా సంఘాల్లో లేని ఇతర ఆడబిడ్డలను కూడా సంఘాల్లో చేరేలా ప్రోత్సహించాలని, ఫలితంగా కుటుంబ నిర్వహణలో మహిళలు కీలక శక్తిగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. మహిళలను ప్రోత్సహిస్తే ఏ రంగంలోనైనా రాణిస్తారని, ఫలితంగా వారి కుటుంబ అభివృద్ధితోపాటు దేశ ప్రగతిలో ముఖ్య భూమిక వహిస్తారనడంలో ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.

👉ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ ఛైర్మన్ జంబు రామన్ గౌడు, మాజీ ఎంపీపీ విజయ్, PACS ఛైర్మన్ వెంకటేష్, మాజీ ఎంపీటీసీ ఆనంద్ గౌడు, నాయకులు నర్సన్ గౌడు, మేస్త్రీ తిమ్మప్ప, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

23/02/2024
01/02/2024

Address

Gadwal
509125

Telephone

+918686668900

Website

Alerts

Be the first to know and let us send you an email when Team bandla krishnamohanreddy yuva sena posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share