Waddepally Municipality

Waddepally Municipality Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Waddepally Municipality, Government Organization, WaddepallyMunicipality, Gadwal.

Waddepally Municipality Formed in March 2018 By Merged of Waddepally, Shanthi Nagar and Paipadu Villages its comes under Jogulamba Gadwal District Telangana State.

వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలువడ్డేపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ ...
15/08/2026

వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

వడ్డేపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

అనంతరం మున్సిపల్ పారిశుధ్య సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని, వారి విధుల్లో రక్షణగా ఉపయోగపడే PPE కిట్లను గౌరవ మున్సిపల్ చైర్‌పర్సన్ గారు, కౌన్సిలర్ గార్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపల్ కమిషనర్ గారు కలిసి పారిశుధ్య సిబ్బందికి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పారిశుధ్య సిబ్బంది ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నారని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు వారు అందిస్తున్న సేవలు అభినందనీయమని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. పారిశుధ్య సిబ్బంది భద్రతకు అవసరమైన రక్షణ సామగ్రిని అందిస్తూ వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్ గార్లు, కో-ఆప్షన్ సభ్యులు, పారిశుధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ప్రెస్ నోట్వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమంవడ్డేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకు...
15/08/2026

ప్రెస్ నోట్
వడ్డేపల్లి మున్సిపాలిటీలో ఘనంగా వన మహోత్సవం కార్యక్రమం

వడ్డేపల్లి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్‌లో గల సప్తగిరి నగర్ వెంచర్‌లో వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించి, పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ప్రజలకు సూచించారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం లక్ష్యంగా వన మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, పట్టణ ప్రజలు పాల్గొని మొక్కలు నాటారు.

*🇮🇳 వడ్డేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు...**🔴 జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చ...
15/08/2026

*🇮🇳 వడ్డేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు...*

*🔴 జాతీయ జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ గారు*

*💥వడ్డేపల్లి మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి గారు _*

ఈరోజు వడ్డేపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో *80వ స్వాతంత్ర్య దినోత్సవం* సందర్భంగా *కౌన్సిలర్ మరియు మున్సిపల్ సిబ్బంది నాయకులతో కలిసి,చైర్మన్ మంజుల ధర్మ గారు జాతీయ జెండాను ఆవిష్కరించి,జాతీయ గీతాన్ని అలపించారు....* ....

*ఈ సందర్భంగా చైర్మన్ మంజుల ధర్మ గారు మాట్లాడుతూ...*

*💫 ప్రజలందరికీ 80వ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.....*

స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని చెప్పుకొచ్చారు.స్వాతంత్య్ర సమరయోధుల నిస్వార్థ పోరాట స్ఫూర్తి, నాటి నేతల దార్శనిక నాయకత్వం, సకల జనుల త్యాగపూరిత భాగస్వామ్యమే భారతదేశానికి స్వాతంత్య్రాన్ని అందించాయని స్మరించుకున్నారు....

స్వాతంత్ర్య భారతంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. పదేళ్ల అనతి కాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందని కొనియాడారు.అమరుల త్యాగాలను గౌరవించుకుంటూ స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు అందించి, దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ఇనుమడిస్తాయని స్పష్టం చేశారు... స్వాతంత్ర్య తమరి యోధుల ఆశయాలను పూర్తిగా తీసుకోవాలని అన్నారు...

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు మరియు మున్సిపాలిటీ సిబ్బంది యూత్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు....

వడ్డేపల్లి మున్సిపాలిటీశుక్రవారం డ్రై డే డ్రైవ్ – డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ...
07/08/2026

వడ్డేపల్లి మున్సిపాలిటీ
శుక్రవారం డ్రై డే డ్రైవ్ – డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు

నేడు వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వివిధ వార్డులలో శుక్రవారం డ్రై డే డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వర్షాకాలంలో ప్రబలే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.

ఈ సందర్భంగా కాలనీలోని రహదారులు, డ్రైనేజీలలో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, నిల్వ ఉన్న మురుగు నీటిలో ఆయిల్ బాల్స్ వేయడం, దోమల ఉత్పత్తి కేంద్రాలను తొలగించడం వంటి చర్యలు చేపట్టారు. అలాగే ఇంటింటికి వెళ్లి ప్రజలకు డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ, "వర్షాకాలంలో ప్రజలందరూ తమ ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, ప్రతి మంగళవారం మరియు శుక్రవారం డ్రై డే పాటించి నీటి నిల్వ పాత్రలను శుభ్రపరచాలని, డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల నివారణకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సీనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఆర్‌పీలు, మున్సిపల్ జవాన్లు మరియు ఇతర మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

📷 *  Campaign under JSJB 3.0*   Waddepally Municipality  * *Campaign under Jal Sanchay Jan Bhagidari *(JSJB) 3.0*   📷   ...
05/08/2026

📷 * Campaign under JSJB 3.0* Waddepally Municipality * *Campaign under Jal Sanchay Jan Bhagidari *(JSJB) 3.0* 📷

వడ్డేపల్లి మున్సిపాలిటీలో జల్ సంవాద్ & అవగాహన ర్యాలీజల్ సంచయ్ జన భాగీదారి (JSJB) 3.0లో భాగంగా   ప్రచారాన్ని పురస్కరించుక...
05/08/2026

వడ్డేపల్లి మున్సిపాలిటీలో జల్ సంవాద్ & అవగాహన ర్యాలీ

జల్ సంచయ్ జన భాగీదారి (JSJB) 3.0లో భాగంగా ప్రచారాన్ని పురస్కరించుకుని 05.08.2026న ZPHS వడ్డేపల్లి పాఠశాల నుండి వడ్డేపల్లి మున్సిపల్ కార్యాలయం వరకు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు మున్సిపల్ సిబ్బంది కలిసి వర్షపు నీటి సంరక్షణపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ సందర్భంగా "పడిన చోటే – పడినప్పుడే" (Catch the Rain – Where it Falls, When it Falls) అనే సందేశంతో ప్రజలకు వర్షపు నీటి సంరక్షణ, రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాల ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కల్పించారు. అనంతరం వడ్డేపల్లి మున్సిపల్ కార్యాలయంలో జల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించి, భూగర్భ జలాల పరిరక్షణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ZPHS వడ్డేపల్లి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

వడ్డేపల్లి మున్సిపాలిటీలో జల్ సంవాద్ & అవగాహన కార్యక్రమంజల్ సంచయ్ జన భాగీదారి (JSJB) 3.0లో భాగంగా   ప్రచారంలో భాగంగా 05....
05/08/2026

వడ్డేపల్లి మున్సిపాలిటీలో జల్ సంవాద్ & అవగాహన కార్యక్రమం

జల్ సంచయ్ జన భాగీదారి (JSJB) 3.0లో భాగంగా ప్రచారంలో భాగంగా 05.08.2026న వడ్డేపల్లి మున్సిపాలిటీలో ZPHS వడ్డేపల్లి ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి జల్ సంవాద్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో "పడిన చోటే – పడినప్పుడే" (Catch the Rain – Where it Falls, When it Falls) అనే సందేశంతో వర్షపు నీటి సంరక్షణ మరియు రూఫ్‌టాప్ రైన్‌వాటర్ హార్వెస్టింగ్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, మున్సిపల్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

05/08/2026

జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 3.0 – ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అవగాహన మానవహారం

జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 3.0 – ప్రచారంలో భాగంగా తేదీ : 05.08.2026 వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ మరియు రీఛార్జ్ పిట్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మానవహారం కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) వడ్డేపల్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 3.0 –   ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అవగాహన మానవహారంజల్ సంచయ్ జన్ భాగీదారి (...
05/08/2026

జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 3.0 – ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి మున్సిపాలిటీలో అవగాహన మానవహారం

జల్ సంచయ్ జన్ భాగీదారి (JSJB) 3.0 – ప్రచారంలో భాగంగా వడ్డేపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో వర్షపు నీటి సంరక్షణ మరియు రీఛార్జ్ పిట్ల నిర్మాణంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మానవహారం కార్యక్రమం నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్ (ZPHS) వడ్డేపల్లి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని నీటి సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అలాగే ప్రతి ఇంటిలో వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు, పారిశుద్ధ్య కార్మికులు మరియు స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Address

WaddepallyMunicipality
Gadwal
509126

Alerts

Be the first to know and let us send you an email when Waddepally Municipality posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Waddepally Municipality:

Shortcuts

Share