Naga Raju

Naga Raju for the army and police welfare trust

18/03/2024
*రాహుల్ గాంధీ గారు చేపట్టిన  భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.**ముంబాయి లో జరిగిన ...
18/03/2024

*రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క.*

*ముంబాయి లో జరిగిన భారత్ జూడో న్యాయ యాత్ర ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కర్ణాటక రాజకీయ చానకక్యుడిగా పేరున్న కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డి.కె శివకుమార్ గారిని తెలంగాణ పంచాయతి రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డా.దనసరి అనసూయ సీతక్క గారు మర్యాదపూర్వకంగా కలిశారు.*

*🙏🙏మంత్రి సీతక్క గారు  ట్విట్టర్ వేదికగా వృద్ధాశ్రమ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.🙏🙏*హైదారాబాద్ లోని చందానగర్‌లో...
09/03/2024

*🙏🙏మంత్రి సీతక్క గారు ట్విట్టర్ వేదికగా వృద్ధాశ్రమ ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.🙏🙏*

హైదారాబాద్ లోని చందానగర్‌లో మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ను మంత్రి సీతక్క గారు ప్రారంబించారు. ఇట్టి విషయాన్ని ట్విట్టర్ వేదికగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలా వ్రాశారు.
👉చందానగర్‌లో వృద్ధాశ్రమాన్ని ప్రారంభించడం ఒక గౌరవం & ప్రత్యేకత, ఈ అవకాశం ఇచ్చినందుకు మలబార్ ఛారిటబుల్ ట్రస్ట్‌కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, మీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నాకు బాగా నచ్చాయి, పేదలకు మరింత సేవ చేసేందుకు కలిసి పనిచేస్తాయి.

*మంత్రి సీతక్క చేతుల మీదుగా గ్రాండ్ మా.. వృద్ధాశ్రమం ప్రారంభం*హైదరాబాదులోని చందానగర్లో చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహ్వానం మే...
09/03/2024

*మంత్రి సీతక్క చేతుల మీదుగా గ్రాండ్ మా.. వృద్ధాశ్రమం ప్రారంభం*

హైదరాబాదులోని చందానగర్లో చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహ్వానం మేరకు వారు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమాన్ని ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. తదనంతరం వృద్ధాశ్రమం సందర్శించి ఆశ్రమంలో ఉన్న వృద్ధులతో ఆమె ముచటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సభా వేదికపై మంత్రి సీతక్క గారు సంభాషిస్తూ దుఃఖానికి లోనయ్యారు. తమ తల్లిదండ్రులను కాపాడే బాధ్యత కొడుకు కూతుళ్లదే అన్నారు. ఒక రోజు ఏ కుటుంబ సభ్యులైతే తల్లి-దండ్రులను వదిలేసారో వారికి కూడా ఇలాంటి దినం వస్తదన్న సంగతి గుర్తుంచుకోవాలి అని అన్నారు. అలాగే ఆమె మాట్లాడుతూ నేను కూడా *కరోనా కష్టకాలంలో ✊గో-హంగర్-గో✊ అనే నినాదంతో ఆకలి లేని ప్రపంపంచాన్ని నిర్మిద్దాం అంటూ 1250 మందికి ఆహారాన్ని అందజేసి అఖలి తీర్చడం జరిగిందాని తాను చేసిన సేవలు సభా వేదికగా గుర్తు చేశారు.* వృద్ధుల కోసం ఆశ్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ట్రస్ట్ వారిని ప్రోత్సాహపరుస్తు... ధన్యవాదాలు తెలియజేశారు.

*వైరల్ అవుతున్న మంత్రి సీతక్క ట్వీట్**రామోజీ ఫిలిం సిటీ లో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీత...
07/03/2024

*వైరల్ అవుతున్న మంత్రి సీతక్క ట్వీట్*

*రామోజీ ఫిలిం సిటీ లో మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క గారు*

అనుక్షణం ప్రజల పక్షాన పోరాడిన వ్యక్తి ప్రజలే దేవుళ్ళుగా భావించి వారికి సేవ చేస్తూ కంటికి నిద్ర లేకుండా ప్రజల మధ్యలో ఉంటూ నేడు ఒక గొప్ప మహిళా ఋషిగా మహిళలందరికీ స్ఫూర్తి ప్రదాత ఆమెనే గౌరవ మంత్రివర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు. హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ లో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ జ్ఞానం చాలా గొప్పది , జ్ఞానాన్ని నేర్చుకోవడం అలవర్చుకోండి అని అన్నారు. ఆమె తన బాల్య దశ నుండి ఆమె ఎదిగిన విధానాన్ని వివరించారు.
ఇందులో భాగంగా బాల్య దశలో నేను నక్సలైట్ లోకి వెళ్తారని అనుకోలేదు కానీ నక్సలైట్ గా నక్సలైట్ లోకి వెళ్లాను అటు తర్వాత నక్సలైట్ లో నుండి ప్రజా క్షేత్రంలోకి వస్తాను అనుకోలేదు ప్రజాక్షేత్రంలోకి వచ్చాను అటు తర్వాత నేను ఎల్ఎల్బి చేశాను ఎల్ ఎల్ బి తర్వాత పిహెచ్డి చేస్తాను అని అనుకోలేదు కానీ పిహెచ్డి కంప్లీట్ చేశాను, తదనంతరం రాజకీయాల్లోకి వస్తాను అనుకోలేదు కానీ రాజకీయాల్లోకి వచ్చాను , రాజకీయాల్లో ఎదుగుతూ, ఎదుగుతూ నేడు మంత్రి అవుతానని అనుకోలేదు కానీ నేడు మంత్రిని అయ్యాను దీనికంతటి కారణం కృషి పట్టుదల ఒక్కటే అని అన్నారు. ఆమె అంచలంచలుగా ఎదిగిన విధానాన్ని మహిళలకు వివరించారు అలాగే చావు పుట్టుక మన చేతుల్లో లేదని ఆ రెండిటి మధ్య ఉన్న జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలనే అంశం మన చేతుల్లోనే ఉందని గొప్ప మాటను వాళ్లకు వివరించారు. తదనంతరం మంత్రి సీతక్క గారు మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

*నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తున్న   గొప్ప వ్యక్తి మంత్రి సీతక్క అన్న రాజగోపాల్ రెడ్డి**తెలంగాణ ఆడపడుచులకు బ్రాండ్ అ...
07/03/2024

*నిద్రాహారాలు మాని ప్రజా సేవ చేస్తున్న గొప్ప వ్యక్తి మంత్రి సీతక్క అన్న రాజగోపాల్ రెడ్డి*

*తెలంగాణ ఆడపడుచులకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి సీతక్క గారు*

*వృద్ధాశ్రమం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి సీతక్క గారిని ఉద్దేశించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని డైనమిక్ మహిళా నాయకురాలు మంత్రి సీతక్కని అన్నారు ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్న గొప్ప మహిళా ఋషి సీతక్క అని అన్నారు అలాగే తెలంగాణ ఆడపడుచులకు బ్రాండ్ అంబాసిడర్ మంత్రి సీతక్క అని అన్నారు.*

*కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన పిల్లలు చూసుకుంటే వృద్ధాశ్రమం అవసరం ఉండదన్న మంత్రి సీతక్క**హైదరాబాద్ శామీర్పేట వద్ద కోమటిరె...
07/03/2024

*కన్న తల్లిదండ్రుల ఆలనా పాలన పిల్లలు చూసుకుంటే వృద్ధాశ్రమం అవసరం ఉండదన్న మంత్రి సీతక్క*

*హైదరాబాద్ శామీర్పేట వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళా వృద్ధాశ్రమాన్ని మంత్రి సీతక్క గారు ప్రారంభించారు. ఆమెతోపాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు పెద్దవాళ్ళు పసిపిల్లలతో సమానమని వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు, వాళ్ళు లేకుంటే మనం లేమని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. అలాగే మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియజేశారు.*

*200 యూనిట్ల ఉచిత కరెంట్ బిల్ అందజేసిన మంత్రి సీతక్క.**ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ...
06/03/2024

*200 యూనిట్ల ఉచిత కరెంట్ బిల్ అందజేసిన మంత్రి సీతక్క.*

*ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారింటిల్లో గృహ జ్యోతి పతకం కింద జిల్లా కేంద్రంలోని సఫయివాడలో లబ్దిదారులు బోడ సంధ్యకు జీరో కరెంట్ బిల్ ను అందజేశారు. తదనంతరం మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ ఇందిరమ్మ రాజ్యంలో పేదల సంక్షేమం కోసం పెద్ద పీఠ వెస్తున్నామన్నారు, అలాగే లబ్దిదారులు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.*

*నెక్స్ట్ ఇయర్ నుండి గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభం :-మంత్రి సీతక్క**ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క గా...
28/02/2024

*నెక్స్ట్ ఇయర్ నుండి గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభం :-మంత్రి సీతక్క*

*ములుగు జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క గారు ,జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మరియు అధికార గుణంతో ఆమె పలు కార్యక్రమాలను పరిశీలించారు. మంత్రి సీతక్క గారు మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుంచి గిరిజన యూనివర్సిటీ తరగతులు ప్రారంభించినట్లు ఆమె తెలియజేశారు ఈ సందర్భంగా జికారంలో తాత్కాలిక భవనంలో నిర్వహిస్తున్న యూత్ ట్రైనింగ్ సెంటర్ ను బుధవారం సందర్శించారు. మంత్రి సీతక్క తో పాటు అధికారులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.*

Address

Gadwal
Gadwal
509125

Telephone

+918637070613

Website

Alerts

Be the first to know and let us send you an email when Naga Raju posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Naga Raju:

Share

Category