Nakka Naresh goud BRS

Nakka Naresh goud BRS goud

21/01/2023

Kalvakuntla Taraka Rama Rao - KTR

Telangana CMO
08/01/2023

Telangana CMO

గడువులోగా కొత్త మెడికల్‌ కాలేజీలుటెండర్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలిదవాఖానలకు మందుల పంపిణీలో కోటా లేదుటీఎస్‌ఎంఎస్‌ఐడీస...
08/01/2023

గడువులోగా కొత్త మెడికల్‌ కాలేజీలు
టెండర్‌ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి
దవాఖానలకు మందుల పంపిణీలో కోటా లేదు
టీఎస్‌ఎంఎస్‌ఐడీసీపై సమీక్షలో మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న తొమ్మిది వైద్య కళాశాలల భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో గతేడాది 8 మెడికల్‌ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని గుర్తు చేశారు. ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్‌, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్‌, జనగాం, నిర్మల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల్లోని నూతన కళాశాలల్లో ఎంబీబీఎస్‌ తరగతులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కార్యాలయంలో శనివారం ఎన్‌హెచ్‌ఎం, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీపై మంత్రి హరీశ్‌రావు నెలవారీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9 కాలేజీల భవనాలకు టెండర్‌ ప్రక్రియను త్వరగా పూర్తి చేసి పనులు ప్రారంభించాలని అన్నారు. నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బృందాలు పరిశీలనకు వచ్చేనాటికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

దవాఖానల్లో అపరిమితంగా మందులు
అన్ని దవాఖానల్లో మందులు మూడు నెలల బఫర్‌ స్టాక్‌ ఉండేలా చూడాలని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఔషధాల సరఫరాలో ఎలాంటి నియంత్రణ వద్దని, కోరిన మేర పంపిణీ చేయాలని ఆదేశించారు. రీయేజెంట్స్‌ కొరత లేకుండా చూడాలని చెప్పారు. వైద్య పరీక్షలు నిర్వహించిన 24 గంటల్లోగా పరీక్ష ఫలితాలు వచ్చేలా చూడాలని అన్నారు. ఈ-ఉపకరణ్‌ పోర్టల్‌ను పూర్తిగా వినియోగించాలని, ఏవైనా వైద్య పరికరాలు చెడిపోతే వెంటనే అప్‌డేట్‌ చేయాలని స్పష్టం చేశారు. వైద్య పరికరాలు పనిచేసేలా చూసుకోవడం ఆయా దవాఖానల సూపరింటెండెంట్‌ బాధ్యతే అన్నారు. సమీక్షలో కుటుంబ ఆరోగ్యం సంక్షేమ విభాగం కమిషనర్‌ శ్వేతా మహంతి, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, టీవీవీపీ కమిషనర్‌ అజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

వివిధ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రాలను (ఎంసీహెచ్‌) త్వరగా పూర్తి చేయాలి. ముఖ్యంగా నిమ్స్‌, గాంధీ దవాఖానల్లో పనులను వేగంగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి.
టీవీవీపీ పరిధిలో కొనసాగుతున్న 23 సీహెచ్‌సీల పనులు త్వరగా పూర్తి చేయాలి.

కొత్తగా ఏర్పాటు చేస్తున్న 13 డయాగ్నొస్టిక్‌ సెంటర్లను త్వరగా అందుబాటులోకి తేవాలి.
మార్చురీల పనులు, 12 సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ పనులు వేగంగా పూర్తి చేయాలి.
రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలకు సమీపంలో 9 క్రిటికల్‌ కేర్‌ హాస్పిటళ్లను త్వరలో ఏర్పాటు చేస్తున్నాం. బాధితులకు సకాలంలో వైద్యం అందేలా చూడాలి. Thaneeru Harishrao-assembly tiger

కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటి రికార్డు సృష్టించిన మన తెలంగాణ. వచ్చే మూడు నెలల్లో మరో 70...
08/01/2023

కేవలం ఒక్క ఏడాదిలోనే 52 వేల ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కలు నాటి రికార్డు సృష్టించిన మన తెలంగాణ. వచ్చే మూడు నెలల్లో మరో 70 వేల ఎకరాల్లో సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి. Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial
Telangana CMO

మేరా సిటీ మహాన్‌బీజింగ్‌ను బీట్‌ చేసి, టోక్యోను తోసేసి హైదరాబాద్‌ పరుగుఈ ఏడాది ఆర్థిక వృద్ధిపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అ...
08/01/2023

మేరా సిటీ మహాన్‌

బీజింగ్‌ను బీట్‌ చేసి, టోక్యోను తోసేసి హైదరాబాద్‌ పరుగు
ఈ ఏడాది ఆర్థిక వృద్ధిపై ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌ అంచనా
2023లో వృద్ధిరేటు 6 శాతానికి పైగా పెరుగుదల
ఇది దక్షిణ భారత ఆర్థిక చైతన్యం పర్యవసానం
తయారీ, ఐటీ రంగాల్లో వెల్లువెత్తుతున్న పెట్టుబడులు
ఆర్థిక మాంద్యాన్ని అధిగమించనున్న నగరం
2023లో ఆసియా పసిఫిక్‌లో నంబర్‌ వన్‌
భారీగా పెట్టుబడుల సాధనే వృద్ధికి కారణం
ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలో కొత్త రికార్డులు
తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధికి ప్రతీక
చిత్తశుద్ధి, అంకితభావం, అంతకుమించి మంచి మనసుతో చేసిన ప్రతి పని అద్భుతమైన ఫలాలను అందిస్తుందని మరోసారి రుజువైంది.ఎనిమిదేండ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ గుండెకాయలాంటి హైదరాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడంతో నగరం నేడు ప్రపంచ మేటిగా ఎదిగింది.

ప్రపంచమంతా ఆర్థిక మాంద్యం భయంతో వణికిపోతున్న ప్రస్తుత సమయంలోనూ తనకు ఎదురే లేదన్నట్టుగా వృద్ధిలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నది. 2023 సంవత్సరంలో ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని మహామహా నగరాలన్నింటినీ వెనుకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌’ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్‌ వంటి నగరాలను కూడా హైదరాబాద్‌ వెనక్కు నెట్టనున్నదని తెలిపింది.

ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఉన్నారు. ఇది స్వతంత్రంగా నడిచే గ్లోబల్‌ ఎకనామికల్‌ ఫోర్‌కాస్టింగ్‌, ఎకనామెట్రిక్‌ అనాలిసిస్‌ సంస్థ.


ఈ సంవత్సరంలో ఏసియా పసిఫిక్‌ రీజియన్‌లోని మహామహా నగరాలన్నింటినీ వెనుకకు నెట్టి ఆర్థిక వృద్ధిలో హైదరాబాద్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందని ప్రఖ్యాత ఆర్థిక విశ్లేషణ సంస్థ ‘ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌’ తన తాజా నివేదికలో ప్రకటించింది. ఇప్పటికే ఆర్థికంగా గొప్పగా వ్యవస్థీకృతమైన షాంఘై, టోక్యో, సింగపూర్‌ వంటి నగరాలను కూడా హైదరాబాద్‌ వెనక్కు నెట్టనున్నదని తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనమిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా 300 మంది ఆర్థికవేత్తలు, విశ్లేషకులు ఉన్నారు. ఇది స్వతంత్రంగా నడిచే గ్లోబల్‌ ఎకనామికల్‌ ఫోర్‌కాస్టింగ్‌, ఎకనామెట్రిక్‌ అనాలిసిస్‌ సంస్థ. దక్షిణ భారతదేశంలోని బెంగళూరు నగరం కూడా 2023లో హైదరాబాద్‌లాగే మెరుగైన ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని ఈ సంస్థ పేర్కొన్నది.

మాంద్యం గుప్పిట్లో ప్రపంచం
ప్రపంచం ప్రస్తుతం క్రమంగా ఆర్థిక మాంద్యం గుప్పిట్లోకి వెళ్లిపోతున్నదని అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, కరోనా వంటి కారణాలతో అమెరికా వంటి అగ్రదేశాలు కూడా ఆర్థికంగా కుదేలవుతున్నాయి. 2022 చివరలో మొదలైన ఈ పరిస్థితి 2023లో తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

ఈ క్రమంలో ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ సంస్థ తాజాగా విడుదల చేసిన నివేదిక సంచలనంగా మారింది. ఈ సంస్థ ఆసియా పసిఫిక్‌ రీజియన్‌లోని ప్రధాన నగరాల్లో మౌలిక వసతులు, 2022లో ఆర్థిక వృద్ధి, స్థానిక పరిస్థితులు, రాబడుతున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులు, వివిధ రంగాల్లో సాధిస్తున్న వృద్ధి రేటుతో పాటు వివిధ అంతర్జాతీయ సంస్థలు పలు రంగాల్లో నిర్వహించిన సర్వేలను ప్రామాణికంగా తీసుకొని 2023లో నగరాల ఆర్థిక వృద్ధి ఎలా ఉంటుందనే అంచనాలను రూపొందించింది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాకు వెన్నెముక వంటి షాంఘై, బీజింగ్‌ నగరాలతోపాటు ఆసియాలో అతిపెద్ద నగరాలైన టోక్యో, హాంకాంగ్‌, సింగపూర్‌, బ్యాంకాక్‌ కూడా 2023లో ఆర్థిక మాంద్యం బారిన పడనున్నాయని తెలిపింది.

వృద్ధిలో.. తగ్గేదే లే
ఆర్థికంగా కొమ్ములు తిరిగిన నగరాలు కూడా మాంద్యం దెబ్బకు కుదేలవుతుండగా, హైదరాబాద్‌ మాత్రం తగ్గేదే లే అంటున్నది. ఆక్స్‌ఫర్డ్‌ ఎకనామిక్స్‌ ఆసియా పసిఫిక్‌ రీజినల్‌ అవుట్‌లుక్‌ నివేదిక ప్రకారం హైదరాబాద్‌ నగరం 2023లో 6 శాతానికిపైగా వృద్ధిరేటు నమోదుచేయనున్నది. బెంగళూరు కూడా ఇంచుమించు ఇదే స్థాయిలో వృద్ధి నమోదు చేయనున్నది. చైనా నగరాలు కొవిడ్‌-19తో విలవిలలాడుతున్న దరిమిలా 2023లో అవి ఆర్థికంగా కోలుకొనే పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నట్టు వెల్లడించింది. బ్యాంకాక్‌ నగరం పర్యాటక రంగంలో కొంతమేర కోలుకొనే అవకాశమున్నదని తెలిపింది.

పెట్టుబడుల ఆకర్షణనే ఆయువుపట్టు
హైదరాబాద్‌ మహా నగరం ఈ ఏడాది అనూహ్య ఆర్థిక వృద్ధి సాధించటానికి కొన్ని సంవత్సరాలుగా నిలకడగా వస్తున్న జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులే కారణంగా నిలుస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. గతంలో దేశీయ దిగ్గజ ఐటీ, ఐటీఎస్‌ కంపెనీలు బెంగళూరు వైపు మాత్రమే చూసేవి. గత ఎనిమిదేండ్లుగా హైదరాబాద్‌ నగరం పెట్టుబడులకు స్వర్గధామంగా మారింది. పెట్టుబడుల ఆకర్షణకు ఇక్కడ వాతావరణ అనుకూలత ఒక కారణమైతే, తెలంగాణ ప్రభుత్వం అంతర్జాతీయ ప్రమాణాలతో వేల కోట్లు వెచ్చించి సమకూరుస్తున్న రహదారులు, ఫ్లైఓవర్లు, మంచినీరు, పార్కులు, 24 గంటల విద్యుత్తు సరఫరా తదితర మౌలిక వసతులు మరో ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

ప్రపంచ ఐటీ దిగ్గజాలైన మైక్రోసాప్ట్‌, గూగుల్‌, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, ఆపిల్‌ కంపెనీలు తమ రెండో అతి పెద్ద కార్యాలయాలను హైదరాబాద్‌లోనే ఏర్పాటు చేశాయి. వీటితోపాటు పదుల సంఖ్యలో కంపెనీలు తమ గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లను సైతం ఇక్కడే ప్రారంభించాయి. వచ్చే రెండుమూడేండ్లలో డాటా సెంటర్ల ఏర్పాటుకోసం సుమారు రూ.50 వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్‌, అమెజాన్‌ ప్రకటించాయి. డాటా సెంటర్ల ఏర్పాటుకు మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చాయి. ఈ లెక్కన డాటా సెంటర్ల విభాగంలోనే రూ.60 వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌, మెక్రోసాప్ట్‌, కంట్రోల్‌ ఎస్‌ డాటా సెంటర్ల నిర్మాణం పురోగతిలో ఉన్నది. భవిష్యత్తులో మరింత విస్తరించేందుకు ఆయా కంపెనీలు ఆసక్తి చూపుతుండగా, కొత్తగా మరిన్ని కంపెనీలు ముందుకు వస్తున్నాయి.

ఎగుమతులు రూ.రెండు లక్షల కోట్లు
ఐటీ ఎగుమతుల్లో గత ఏడాది దేశవ్యాప్తంగా 17.20 శాతం వృద్ధి రేటు ఉంటే, తెలంగాణలో 26.14 శాతం నమోదైంది. 2022-23లోనూ ఐటీ రంగంలో 17 నుంచి 20 శాతం వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉన్నదని అంచనా. దాని ప్రకారం 2022-2023లో హైదరాబాద్‌ నుంచి ఐటీ ఎగుమతులు రూ.2 లక్షల కోట్లు దాటే అవకాశం ఉన్నది. ఆఫీస్‌ స్పేస్‌ వినియోగం లో బెంగళూరును హైదరాబాద్‌ ఎప్పుడో దాటేసింది. కొత్త ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలు హైదరాబాద్‌ కేంద్రంగానే ఏర్పాటు కావడంతో ఐటీ ఎగుమతుల వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఆఫీస్‌ స్పేస్‌లో బెంగళూరును దాటి

ఆఫీస్‌స్పేస్‌ వినియోగంలో హైదరాబాద్‌ గణనీయమైన వృద్ధి సాధించిందని అన్‌రాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ ఇండియా తన నివేదికలో ఇప్పటికే స్పష్టం చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో కొత్త ఆఫీస్‌ స్పేస్‌ విభాగంలో బెంగళూరును హైదరాబాద్‌ అధిగమించింది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో హైదరాబాద్‌ నగరంలో కొత్తగా 8.2 మిలియన్‌ చదరపు అడుగుల మేర ఆఫీస్‌ స్పేస్‌ వినియోగంలోకి వచ్చింది. ఈ విభాగంలో తొలి ఏడు నగరాల్లో హైదరాబాద్‌ 34 శాతం వాటాతో అగ్రభాగాన నిలిచింది. ఆ తర్వాత బెంగళూరు 26 శాతం, దేశ రాజధాని నగరం ఢిల్లీ 21 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
Kalvakuntla Taraka Rama Rao - KTR
KTR

స్వచ్ఛ అవార్డుల్లో మరోసారి సత్తా చాటిన మన తెలంగాణ...స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2023 లో భాగంగా కేంద్రం ప్రకటించిన 4 స్ట...
05/01/2023

స్వచ్ఛ అవార్డుల్లో మరోసారి సత్తా చాటిన మన తెలంగాణ...

స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌-2023 లో భాగంగా కేంద్రం ప్రకటించిన 4 స్టార్‌ కేటగిరీ ర్యాంకింగ్ లలో దేశంలోనే తొలి మూడు స్థానాలను కైవసం చేసుకున్న తెలంగాణ.



Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial Telangana CMO

బి ఆర్ ఎస్ ఇందుకోసమే !వనరులున్నాయి,వసతులున్నాయి , కష్టించి పని చేయగల మనుషులున్నారు..అయినా దేశం ఎందుకు వంచనకు గురవుతున్నద...
05/01/2023

బి ఆర్ ఎస్ ఇందుకోసమే !

వనరులున్నాయి,వసతులున్నాయి ,
కష్టించి పని చేయగల మనుషులున్నారు..

అయినా దేశం ఎందుకు
వంచనకు గురవుతున్నది ?

ఈ ప్రశ్న వేసేందుకు
పుట్టిందే బి ఆర్ ఎస్ !
Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial Telangana CMO

      Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial
05/01/2023


Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial

దేశమంతా ఉచిత విద్యుత్  అదికరమిస్తే రెండేళ్లలో అమలు Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial
03/01/2023

దేశమంతా ఉచిత విద్యుత్ అదికరమిస్తే రెండేళ్లలో అమలు Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial

తొమ్మిది నెలల్లో 60,929 ఉద్యోగాలు43,099 పోస్టులకు నోటిఫికేషన్‌ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ రోల్‌మాడల్‌నెలలో మరో 19,...
03/01/2023

తొమ్మిది నెలల్లో 60,929 ఉద్యోగాలు
43,099 పోస్టులకు నోటిఫికేషన్‌
ఉద్యోగాల భర్తీలో దేశానికే తెలంగాణ రోల్‌మాడల్‌
నెలలో మరో 19,110 పోస్టులకు అనుమతి
కొత్తగా 7,029 ఉద్యోగాలకు క్యాబినెట్‌ ముద్ర
11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
2022లో 98,171 కొలువుల భర్తీ కసరత్తు

‘తెలంగాణ ఏర్పడ్డాక 1,33,942 పోస్టులను భర్తీ చేశాం. ప్రస్తుతం కొత్తగా మరో 91,142 ఉద్యోగాలు భర్తీ చేయాలని నిర్ణయించాం. అందులో 80,039 ఉద్యోగాలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతిలో, మరో 11,103 ఉద్యోగాలు కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వారా భర్తీ చేస్తాం’ అని గత ఏడాది మార్చి 9న అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అన్నట్టుగానే 9 నెలల్లోనే 60,929 ఉద్యోగాలకు అనుమతినిచ్చారు. దేశ చరిత్రలోనే అనతికాలంలో ఇన్ని ఉద్యోగాల భర్తీకి అనుమతులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణే. అతి తక్కువ సమయంలో ఉద్యోగ ప్రక్రియ పూర్తిచేస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణే. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టే.. శుభకృత్‌ నామ సంవత్సరం తెలంగాణ యువతకు ఉద్యోగ నామ సంవత్సరంగా గుర్తుండిపోయేలా చేశారు.

నీళ్లు, నిధులు, నియామకాలే నినాదంగా ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కొలువుల జాతర సాగుతున్నది. ఇప్పటికే నీళ్లు, నిధులను సాధించుకోగా, ఇప్పుడు నియామకాల జోరు నడుస్తున్నది. ప్రస్తుతం వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండటంతో ఉద్యోగాల పండుగ జరుగుతున్నది. గత మార్చి 9న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్‌ ఉద్యోగాల ప్రకటన చేయగా.. 9 నెలల్లోనే 60,929 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. మరో నెలలో మిగిలిన 19,110 పోస్టులకు సైతం అనుమతి ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. 11,103 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు సర్కారు చర్యలు చేపట్టింది. దీనితోపాటు ఇటీవలే కొత్తగా మరో 7,029 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. అందులో పోలీస్‌శాఖ సైబర్‌ సేఫ్టీ విభాగంలో 3,966 ఉద్యోగాలు, బీసీ గురుకులాల్లో 2,591 ఉద్యోగాలు ఉన్నాయి. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ ద్వార భర్తీ చేసే అన్ని పోస్టులు కలిపితే మొత్తం కొలువుల సంఖ్య 98,171కి చేరింది. అసెంబ్లీలో కేసీఆర్‌ ప్రకటించిన ఉద్యోగాల్లో ఇప్పటికే 76 శాతం ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరో 24 శాతం ఉద్యోగాలకు రెండు, మూడు వారాల్లో గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనున్నట్టు తెలిసింది.

టీఎస్‌పీఎస్సీ నుంచి 18,263 ఉద్యోగాలు
టీఎస్‌పీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీ చకచకా సాగుతున్నది. ఇప్పటికే గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష పూర్తయింది. మెయిన్స్‌ను ఏప్రిల్‌లో నిర్వహించనున్నారు. 9,168 పోస్టులకు గ్రూప్‌-4 నోటిఫికేషన్‌ సైతం విడుదలైంది. ఈ నెల 30 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అసిస్టెంట్‌ ఇంజినీర్‌, లెక్చరర్‌ తదితర ఉద్యోగాల ప్రక్రియ జరుగుతున్నది. ఇప్పటి వరకు టీఎస్‌పీఎస్సీ నుంచి 18,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చారు. టీఎస్‌పీఎస్సీ గురువారం 783 గ్రూప్‌ -2 పోస్టులకు, శుక్రవారం 1,373 గ్రూప్‌-3 పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇచ్చింది. మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇప్పటికే 9,50 సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్ల నియామకాలను పూర్తి చేసింది. 1,147 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల ఖాళీలకు నోటిఫికేషన్లు ఇచ్చింది. శుక్రవారమే 5,204 స్టాఫ్‌నర్సుల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ జారీ చేసింది. శనివారం మరో 806 ఉద్యోగాలకు నాలుగు నోటిఫికేషన్లు ఇచ్చింది. గురుకులాల్లో 11,687 ఉద్యోగాలను భర్తీ చేయడానికి గురుకుల విద్యాసంస్థల బోర్డు చర్యలు చేపట్టింది.

పోలీస్‌ శాఖలో 17,516
తెలంగాణ స్టేట్‌ లెవల్‌ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా అత్యధిక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు పోలీస్‌శాఖలో 17,516 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తయింది. ఈవెంట్స్‌ జరుగుతున్నాయి. తర్వాత మెయిన్స్‌ పరీక్ష నిర్వహించి, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తారు.

95 శాతం.. దేశంలోనే రికార్డు
ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోనూ విద్య, ఉద్యోగాల్లో స్థానికత 85 శాతానికి మించి లేదు. దేశంలోనే తొలిసారిగా 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించింది. వరుసగా 1 నుంచి 7వ తరగతి వరకు అభ్యర్థి చదువుకున్న చోటే 95 శాతం స్థానికత వర్తిస్తుంది. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో తెలంగాణ యువతకే అత్యధిక ఉద్యోగాలు దక్కుతున్నాయి. 2022 ఉద్యోగ నామ సంవత్సరమని ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా.. 2022 తెలంగాణ యువతకు ఉద్యోగనామ సంవత్సరంగా గుర్తుండిపోయేలా చేసింది. Telangana CMO
Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial Kalvakuntla Taraka Rama Rao - KTR

ఎన్నికల్లో ప్రజలు గెలవాలెప్రజల లక్ష్యం నెరవేరడం లేదుపవర్‌ఫుల్‌ ఇందిరాగాంధీని గిల్లిపడేసిన్రుప్రజలకు అర్థమైతే ఇండియా రియా...
03/01/2023

ఎన్నికల్లో ప్రజలు గెలవాలె
ప్రజల లక్ష్యం నెరవేరడం లేదు
పవర్‌ఫుల్‌ ఇందిరాగాంధీని గిల్లిపడేసిన్రు
ప్రజలకు అర్థమైతే ఇండియా రియాక్ట్స్‌
ఉజ్వల భారత నిర్మాణం బీఆర్‌ఎస్‌ లక్ష్యం
అందులో ఏపీ భాగస్వామ్యం కావాలి Telangana CMO Kalvakuntla Chandrashekar Rao - KCR - Unofficial Kalvakuntla Taraka Rama Rao - KTR

Address

Manahorabad Medak
Gajwel
502336

Website

Alerts

Be the first to know and let us send you an email when Nakka Naresh goud BRS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share