18/04/2017
రిజర్వేషన్ లు ౼ చరిత్ర :
మొట్టమొదట ఈ రిజర్వేషన్ ల వెనక ఉద్దేశాన్ని తెలుసుకుంటే మన అనుమానాలన్ని తీరుతాయి. వర్ణ వ్యవస్థ గ ఉండి తరువాత్తర్వాత కులవ్యవస్థ గ మారిన
మన హిందూ సమాజం లో విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, పాలనా వ్యవస్థలు పై మూడు వర్గాలకే ( బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ) కేటాయించబడి, అత్యధిక జనాభా ఉన్న శూద్రులకు మొండి చేయి చూపించడం జరిగింది.
అందులోను యజ్ఞ యాగాదుల్లో జంతుబలిని నిర్వహించే, జంతు చర్మాన్ని ఒలిచే దళితులను అంటరాని వారుగా, పంచములు గా ఊరికి దూరం గ ఉంచడం జరిగింది. ఇది కనీసం 1500 సంవత్సరాలు కొనసాగింది.
ఇలా అంటరాని వారుగా, ఆదివాసులు గ ముద్రవేయబడి అణిచివేతకు గురవుతున్న, సాంఘికంగా వెనక్కునెట్టి వేయబడ్డ వారి అభ్యున్నతి కోసం అంబేద్కర్ విరచిత భారత రాజ్యాంగం రిజర్వేషన్ లు ప్రసాదించింది. అలా SC లకు 15%, ST లకు 6% రిజర్వేషన్ వచ్చింది. అంతవరకు ఓకే.
కానీ 80, 90 దశకాల్లో V. P. సింగ్ అనే మహానుభావుడి దయవల్ల సమాజం మరింత చీలి అల్లర్లు చెలరేగడం విద్యార్థులు చనిపోవడం, BC లకు 25% రిజర్వేషన్ లు కల్పించడం, తర్వాత ఆయన ప్రధాన మంత్రి కావడం తరువాతి కథ. ఇక్కడ కూడా సాంఘిక వెనకబాటు ను ఆధారం చేసుకోవడం వైచిత్రి. అంబేద్కర్ కు కూడా కనబడని అణిచివేత మన రాజకీయ నాయకులకు కనబడటం ఇక్కడ టర్నింగ్ పాయింట్.
తర్వాత తమిళనాడు లాంటి కొన్ని రాష్ట్రాలు కేంద్రం లో వాళ్ళ పలుకుబడిని అడ్డుపెట్టుకొని 50% కి పైగా రిజర్వేషన్ లు ఇచ్చి 9వ షెడ్యూల్ లో చేర్చుకున్నాయి. కోర్టు లు విచారించవు అనే బరితెగింపు తో.
అమలు జరుగుతున్న తీరు :
రిజర్వేషన్ లు అనేవి అలిగి అల్లరి చేస్తున్న చిన్న పిల్లలను తమ దారికి తేవడానికి పెద్దలు పంచే పప్పు, బెల్లాల మాదిరిగా మారినయి. అంతే కానీ నిజమైన ప్రేమతో కాదు. ప్రపంచీకరణ, ప్రయివేటీకరణ కారణం గ సమాజం లో అసమానతలు పెరిగి అందరికీ సమాన, సార్వత్రిక విద్య అందుబాటులో లేకపోవడం, రిజర్వేషన్ లు మాత్రం ఇచ్చి మిగతా విద్య, వైద్యం పట్టించుకోకపోవడం వల్ల రిజర్వేషన్ లు కావాలనే వర్గాలు, కులాలు ఇంకా పెరిగాయే తప్ప తగ్గలేదు. వాళ్ళ పరిస్థితి మెరుగుపడలేదు. ఫలితం ఆయా కులాల ప్రాతినిధ్యం ఇప్పటికీ విద్య, వ్యాపార, రాజకీయ వర్గాల్లో పెరగలేదు. దీనికి కారణం ఇట్టే తెలుసుకోవచ్చు, "చిత్త శుద్ధి లేని శివపూజ లేలరా ? " అన్నారు మన పెద్దలు. అంటే అమలు పరిచే పాలకులు వీళ్ళను ఓటు వేసే యంత్రాలుగా చూస్తున్నంత కాలం పరిస్థితి ఇంతే.
ముస్లిం రిజర్వేషన్ లు :
రిజర్వేషన్ ల స్ఫూర్తి ని మరొక్కసారి గుర్తు చేసుకుంటే సాంఘిక అణిచివేత ప్రధాన కారణం అని తెలుస్తుంది. కానీ ముస్లిం రిజర్వేషన్ ల విషయం లో అది ఏ విధంగా justify అవుతుందో పాలకులు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది.
800 సంవత్సరాలు దేశాన్ని పాలించిన వర్గం సుమారు అంతే సమయం మన తెలంగాణ ను పాలించిన వర్గం సాంఘికం గ అణిచివేతకు గురి అయిందంటే నమ్మే పిచ్చోళ్లు తెరాస లో ఉన్నారేమో కానీ జనం లో అయితే లేరు. పైగా విద్య కూడా దేశ భాషల్లో కాకుండా ఉర్దూ, అరబ్బీ లో ఉండేవి. ఈ విధంగా 800 ఏండ్లు విద్య, ఉద్యోగాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న వర్గం ఇప్పుడు అకస్మాత్తుగా సాంఘికంగా వెనకబడి ఉన్నారంటే సచ్చిపోయిన తుఘ్లక్ కూడా పగలబడి నవ్వుతాడు😂😂😂😂
ఆర్థిక వెనకబాటు కారణం అయితే సాంఘిక వెనకబాటు కారణం గ ఇచ్చిన రిజర్వేషన్ లు తీసివేయాలి కదా మరి? పేరుకు బ్రాహ్మణ, వైశ్య, రెడ్లు గ ఉంటూ ఆర్థిక మద్దతు లేని కారణం గ దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న సోకాల్డ్ అగ్రకులాల వాళ్ళు లేరా ? మరి వాళ్ళ గతేమి కాను ?
జనాభా ప్రాతిపదిక అయితే BC లకు ఇప్పుడున్న 25% నుండి 52% కి పెంచాలి. Sc లకు 15% నుండి 16% పెంచాలి. ఒక్కముస్లిం లకే జనాభా బేస్ అంటావా? జనాభా బేస్ అయితే ఓపెన్ category అనేదే ఉండకూడదు. మొత్తం ప్రతి కులానికి జనాభా ప్రతినిధ్యానికి అనుగుణంగా సీట్ లు ఇస్తే సరి.
తరువాత :
రాజ్యాధికారం ఇవ్వకుండా నువ్ ఎన్ని తాయిలాలు ప్రకటించినా లాభం లేదు. సమస్య వచ్చిందే అత్యధిక సంఖ్యలో ఉన్న వర్గాలు, కులాలకు పాలన లో ప్రాతినిధ్యం లేకపోవడమే.
కాబట్టి మొదట ఒక బీసీ కి ముఖ్యమంత్రి పదవి తో పాటు, ముఖ్యమైన పదవులు వారికే ఇవ్వాలి. ( ఎందుకంటే 52% ఉన్నారు కాబట్టి ). తరువాత16% ఉన్న SC లకు, తరువాత 12% ఉన్న ముస్లిం లకు, ST లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఈ లెక్కన నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు మంత్రి పదవులు వదులుకోవాలి. అంతేనా పెద్ద సారూ ?
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రేపు జరగబోయేది అదే ! మాకు 52% కావాలని BC లు ఉద్యమిస్తారు. అప్పుడు ఏం జేస్తవ్ ? రాష్ట్రాన్ని రావణ కాష్ఠం ల మార్చే ఈ కుట్రను ఎదిరించాల్సిన అవసరం ప్రతీ ఒక్కరి పై ఉంది. ఎందుకంటే ఓపెన్ లో ఉద్యోగాలు పొందే పరిస్థితి రిజర్వేషన్ పొందే వర్గాలకు లేకుండా పోతుంది. ఇప్పుడు BC, SC లకు లకు టోటల్ గ ఓపెన్ లో 12% రిజర్వేషన్ కోల్పోతారు కదా ?
ఓటు బ్యాంకు రాజకీయం :
ఎవరేమన్న సంప్రదాయకం గ ముస్లిం లు, దళితులు కాంగ్రెస్ ఓటు బ్యాంకు, BC లు టీడీపీ కి ఓటు బ్యాంకు. తెలంగాణ ల టీడీపీ ఎలా అయినా ఖతం అయిందని చెప్పి ముస్లిం లను దువ్వితే ఇక మనకు తిరుగుండదని చెప్పి వారిని మభ్యపెట్టడానికి కల్వకుంట్ల వారి కుతంత్రం ఈ తేనెతుట్టెను కదిలించే ప్రయత్నం.
ఇంత జరిగినా ఏ ఒక్క నాయకుడు వ్యతిరేకించకపోవడం, దాని పర్యవసానాలు సభలో చర్చించకపోవడం శోచనీయం. అందరికీ ఓట్లు కావాలి కదా? సమాన విద్య, సమాన అవకాశాలు గల సమాజం రూపొందించే ప్రయత్నం చేయక ఓట్ల కోసం కక్కుర్తిపడే నాయకులు ఉన్నంత కాలం ఇంతే.
లోకాస్సమస్తా సుఖినోభవంతు.