05/09/2026
గిద్దలూరు నియోజకవర్గంలో ఘనంగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు
తురిమెళ్ళ గ్రామం కంభం మండలం మార్కాపురం జిల్లా నందు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా ఆకాశమే హద్దుగా జరపడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వీరమహిళలు పవన్ కళ్యాణ్ గారి వేడుకలను పాల్గొనడం అందులోనూ పెద్దవారు ఆడవాళ్లు కావడం ఎంతో విశేషం పిల్లలు పెద్దలు అందరూ గ్రామంలో పాల్గొని కేక్ కటింగ్ ప్రోగ్రాం చేసి ఈ ప్రోగ్రాం కి ముఖ్యంగా చెన్నకేశవ సుబ్బరాయుడు గారి ఆధ్వర్యంలో జరగడం ఎంతో శుభ పరిణామం రాబోయే రోజులలో పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నారు ఆయనను అందరూ ఎన్నుకొని ఆయనకు ఇంకా మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఈ కార్యక్రమంతో గ్రామ ప్రజలలో ఉన్న ఉద్దేశం కూడా తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమానికి కంభం మండల మాజీ ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్ పూలు రంగనాయకులు పుట్టాసిద్దయ్య కోళ్ల పిచ్చి రంగయ్య చెన్నకేశవ శ్రీనివాసులు అలియాస్ భగవంతుడు ఇలా చెప్పుకుంటూ పోతే అలిశెట్టి వెంకటేశ్వర్లు గారు రాచర్ల మండల అధ్యక్షులు ఇలా పలు వ్యక్తులు హాజరవడం జరిగింది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. టీ స్నాక్స్ తోటి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది. ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు.